S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/08/2016 - 02:33

హైదరాబాద్, నవంబర్ 7: సచివాలయాన్ని కూల్చవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను కోరారు. టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్వర్యంలో సిఎల్‌పి నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కె.

11/08/2016 - 02:31

హైదరాబాద్, నవంబర్ 7: విపక్షాలు ఎన్ని అడ్డంకులు కల్పించినా అద్భుమైన సచివాలయాన్ని నిర్మించి తీరుతామని ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. టిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జీవన్‌రెడ్డి తదితరులు గవర్నర్‌ను కలిసి సచివాలయం కూల్చివేతకు వ్యతిరేకంగా వినతిపత్రం ఇవ్వడం శోచనీయం అని అన్నారు.

11/08/2016 - 02:29

హైదరాబాద్, నవంబర్ 7: ఎత్తు పెంచేందుకు శస్తచ్రికిత్స చేయించుకున్న నిఖిల్‌రెడ్డికి ఎట్టకేలకు గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు వైద్యం అందిస్తున్నారు. నిఖిల్‌రెడ్డి కాళ్లకు చేసిన ఆపరేషన్ అనైతికంగా జరిగిందని, వైద్యుడు చంద్రభూషణ్‌ను తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ రెండేళ్లపాటు సస్పెండ్ చేసింది. దీంతో నిఖిల్‌కు గ్లోబల్ ఆసుపత్రి వైద్యసేవలు నిలిపివేసింది.

11/08/2016 - 02:27

హైదరాబాద్, నవంబర్ 7: గ్యాంగ్‌స్టర్ నరుూం అక్రమ వ్యవహారాల కేసులో రిటైర్డ్ అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, నరుూం డ్రైవర్ శామ్యూల్ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సోమవారం ప్రశ్నించింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఈ విచారణ కొనసాగింది. నరుూం ఎన్‌కౌంటర్‌లో మృతి చెంది మూడు నెలలు గడిచింది. చార్జిషీట్ దాఖలు చేయనున్న నేపథ్యంలో ఈ విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది.

11/08/2016 - 02:26

హైదరాబాద్, నవంబర్ 7: వృత్తి సాంకేతిక విద్యా సంస్థల్లో ఇటు అధ్యాపకులు , అటు విద్యార్ధులు అక్రమార్కులే ఎక్కువగా ఉన్నట్టు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన విజిలెన్స్ తనిఖీల్లో తేటతెల్లం కావడంతో అక్రమార్కులకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది.

11/08/2016 - 02:25

హైదరాబాద్, నవంబర్ 7: సచివాలయానికే రాని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు వాస్తు భయం ఎందుకూ? అని తెలంగాణ ఉద్యమ వేదిక నాయకులు డాక్టర్ చెరుకు సుధాకర్, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. వాస్తు బాగా లేదన్న భావనతో సచివాలయంలోని భవనాలను కూల్చి వేయించి కొత్తగా నిర్మించాలనుకోవడం సమంజసం కాదని వారు సోమవారం విలేఖరుల సమావేశంలో అన్నారు.

11/08/2016 - 02:24

విజయనగరం, నవంబర్ 7: ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ సంస్థ ఆదాయ వనరులను సమకూర్చుకునేందుకు కొత్త పుంతలు తొక్కుతోంది. సరకు రవాణా, కొరియర్ సర్వీసులకే పరిమితమైన ఆర్టీసీ నేడు మిని థియేటర్లు ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. తద్వారా ప్రయాణికులకు వినోదంతోపాటు ఆర్టీసీకి గణనీయంగా ఆదాయం సమకూరగలదని భావిస్తోంది.

11/08/2016 - 02:17

హైదరాబాద్, నవంబర్ 7: యాదాద్రికి లక్షమంది భక్తులు ఒకేరోజు వచ్చినా సాఫీగా దర్శనం జరిగేలా, అందరికీ వసతి సౌకర్యాలు లభించేలా ఏర్పాట్లు చేపట్టాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో సోమవారం యాదాద్రి అభివృద్ధి పనులపై సమీక్ష జరిపారు. తితిదే ఏర్పాటు చేసిన తరహాలోనే యాదాద్రి టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ (వైటిడిఏ) ఆధ్వర్యంలో మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు.

11/08/2016 - 02:15

హైదరాబాద్, నవంబర్ 7: ప్రస్తుత బడ్జెట్‌లో ప్రణాళిక, ప్రణాళికేతర పద్దుల కింద కేటాయించిన నిధులను పూర్తిగా ఖర్చు పెట్టడంతోపాటు కేంద్ర నుంచి పొందిన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని శాఖాధిపతులను ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుత బడ్జెట్‌లో జరిగిన ఆదాయ, వ్యయాలను అనుసరించే వచ్చే ఏడాది బడ్జెట్ రూపకల్పన ఆధారపడి ఉంటుందని సూచించింది.

11/08/2016 - 02:14

హైదరాబాద్, నవంబర్ 7: దేవాదుల ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరుపట్ల నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనులపై సోమవారం మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పనులు నత్తనడక సాగడంపై అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు.

Pages