S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/03/2016 - 06:08

హైదరాబాద్, నవంబర్ 2: డీలర్ల మార్జిన్‌పై అపూర్వ చంద్ర కమిటీ సిఫార్సులను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా పెట్రోలు బంక్‌ల నిర్వాహకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 3,4 తేదీల్లో ఆయిల్ కొనుగోలు నిలిపి వేస్తున్నామని, 5వ తేదీ నుంచి 8గంటలు మాత్రమే అమ్మకాలు జరుగుతాయని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ తెలిపింది.

11/03/2016 - 06:07

హైదరాబాద్, నవంబర్ 2: భారీ సంఖ్యలో పిహెచ్‌డి అడ్మిషన్లు, ఉద్యోగ నియామకాల్లో అక్రమాలకు పాల్పడినట్టు గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న ద్రావిడ విశ్వవిద్యాలయం మరోమారు విద్యాదోపిడీకి సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్ కుప్పంలో ఉన్న ద్రావిడ విశ్వవిద్యాలయం మరోమారు దూరవిద్యా పరీక్షలను తెలంగాణలో మారుమూల ప్రాంతాల్లో మాత్రమే నిర్వహించడం ద్వారా అక్రమాలకు తెరతీసినట్టు ఆరోపణలు వస్తున్నాయి.

11/03/2016 - 06:06

అమరావతి, నవంబర్ 2: ఇంతకూ తెలుగుదేశం పార్టీకి సిపిఎం మిత్రపక్షమా? శత్రుపక్షమా? జాతీయ పార్టీగా మారిన తర్వాత రాష్ట్రానికో విధంగా అనుసరిస్తున్న విధానాలతో తెదేపా నేతల్లో కనిపిస్తోన్న గందరగోళమిది. ఆంధ్రప్రదేశ్‌లో తమ ప్రభుత్వంపై పోరాటం చేస్తూ, వైకాపాతో కలిసి అడుగులు వేస్తున్న సిపిఎంతో తెలంగాణ తెదేపా నేతలు చెట్టపట్టాలేసుకుని తిరుగుతుండటం ఏపి తమ్ముళ్లకు మింగుడుపడకుండా ఉంది.

11/02/2016 - 03:54

హైదరాబాద్, నవంబర్ 1: షిర్డీసాయి భక్తుల మనోభావాలను గాయపరిచేలా ఉత్తరామ్నాయ బదరీజ్యోతిష్పీఠం, పశ్చిమామ్నాయ ద్వారకా శారదాపీఠం అధిపతి జగద్గురు శంకరాచార్య శ్రీ స్వరూపానంద సరస్వతీ మహాస్వామి భవిష్యత్తులో ఎక్కడా మాట్లాడవద్దని హైదరాబాద్‌లోని 20వ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

11/01/2016 - 07:28

హైదరాబాద్, అక్టోబర్ 31: పిచ్చుక మీద బ్రహ్మస్త్రంలా హోం గార్డులపై చర్యలు తీసుకోవటం దారుణమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన సోమవారం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు లేఖ రాశారు. హోం గార్డులు పోలీసులతో సమానంగా పూర్తికాలం విధులు నిర్వహిస్తున్నప్పటికీ నెలసరి వేతనం కాకుండా దినసరి వేతనం చెల్లిస్తున్నారని ఆయన తెలిపారు.

11/01/2016 - 06:48

శ్రీశైలం, అక్టోబర్ 31 : ప్రసిద్ధ శైవక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో సోమవారం కార్తీక మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. కార్తీక మాస ప్రారంభం రోజు, శివునికి ప్రీతికరమైన సోమవారం కావడంతో వేకువజాము నుంచే అధిక సంఖ్యలో మహిళలు పాతాళగంగలో పుణ్యస్నానమాచరించి కార్తీక దీపాలు వెలిగించారు. కార్తీక మాసం పురస్కరించుకుని భక్తుల కోసం దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

11/01/2016 - 06:32

హైదరాబాద్, అక్టోబర్ 31: మావోయిస్టు అగ్ర నేత రామకృష్ణ అలియాస్ అక్కిరాజు హరగోపాల్ ఆచూకీపై సస్పెన్షన్ ఇంకా వీడలేదు. ఆర్కే ఆచూకీపై ప్రజాసంఘాలు, మానవ హక్కుల సంఘాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ పొలిటిల్ జేఏసి చైర్మన్ కోదండరాం స్పందించారు.

11/01/2016 - 06:31

హైదరాబాద్, అక్టోబర్ 31: ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడు, కేరళ, కర్నాటక మధ్య ప్రాంతాలను ఈశాన్య రుతుపవనాలు ఆదివారం పలకరించాయి. నాలుగు నెలల పాటు (జూన్ నుండి అక్టోబర్ మధ్య వరకు) దేశంలోని వివిధ ప్రాంతాలకు వర్షాలను అందించిన నైరుతీ రుతుపవనాలు ఈ నెల 28న వెళ్లిపోయాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించింది. వాస్తవంగా ఈశాన్య రుతుపవనాలు అక్టోబర్ 20న రావలసి ఉండగా, పదిరోజుల పాటు ఆలస్యంగా వచ్చాయి.

11/01/2016 - 06:29

హైదరాబాద్, అక్టోబర్ 31: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఎనిమిది మంది సిమి కార్యకర్తల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించాలని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ఎన్‌కౌంటర్‌పై పోలీసులు కట్టు కథ చెబుతున్నారని ఆయన సోమవారం తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు.

11/01/2016 - 06:28

హైదరాబాద్, అక్టోబర్ 31: ఓటుకు నోటు కేసు విచారణను రాష్ట్ర హైకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ఎపి ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ లూథ్రా హాజరై జస్టిస్ టి సునీల్ చౌదరి ముందు వాదనలు వినిపించారు. వచ్చే సోమవారం నాడు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫున న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తమ వాదనలను వినిపించనున్నారు.

Pages