S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/14/2016 - 02:08

హైదరాబాద్, అక్టోబర్ 13: సెంటర్ ఫర్ ఆర్గనైజేషన్ డెవలప్‌మెంట్ ప్రతి ఏటా ప్రతిష్ఠాత్మకంగా అందిస్తున్న వి కృష్ణమూర్తి అవార్డ్ ఫర్ ఎక్స్‌లెన్స్‌ను ఈ ఏడాది సిఎస్‌ఐఆర్ మాజీ డైరెక్టర్ జనరల్, ప్రముఖ శాస్తవ్రేత్త డాక్టర్ ఆర్‌ఏ మషేల్కర్‌కు అందజేశారు. గురువారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో తమిళనాడు మాజీ గవర్నర్ డాక్టర్ కె రోశయ్య ఈ అవార్డును డాక్టర్ మషేల్కర్‌కు అందచేశారు.

10/14/2016 - 02:06

విశాఖపట్నం, అక్టోబర్ 13: పర్యాటక సీజన్ ప్రారంభమైంది. ఆంధ్రా ఊటి అరకు, ఆంధ్రా కాశ్మీర్ లమ్మసింగి అందాలను ఆరబోసి, పర్యాటకులకు ఆహ్వానం పలుకుతున్నాయి.

10/14/2016 - 02:04

హైదరాబాద్, అక్టోబర్ 13: విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల అరాచకాలు రోజురోజుకు శ్రుతిమించుతున్నాయి. తాము చెప్పినట్టు వినాల్సిందే అనే ధోరణి పెరగడంతో వర్శిటీల్లో క్రమశిక్షణ దారితప్పుతోంది. పాలన కట్టుతప్పి పోలీసు స్టేషన్లు, కోర్టుల జోక్యం వరకూ వెళ్తోంది.

10/14/2016 - 02:02

హైదరాబాద్, అక్టోబర్ 13: హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలోని డైరెక్టర్ జనరల్ నివాసాన్ని ఖాళీ చేసేందుకు ఎంత సమయం అవసరమని హైకోర్టు విచారణ సందర్భంగా ఏపి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ పివి రమేష్‌ను ప్రశ్నించింది. నివాసాన్ని ఖాళీ చేయాలంటూ హైకోర్టు సింగిల్ జడ్జి కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ డాక్టర్ రమేష్ హైకోర్టు ధర్మాసనం ఎదుట అపీల్ చేశారు.

10/14/2016 - 02:02

హైదరాబాద్, అక్టోబర్ 13: నవీకరణ వృద్ధి ప్రామాణికమైనదని, కాని మోసకారి ఆవిష్కరణలకు ఎప్పుడూ మినహాయింపు ఉంటుందని , పరిశోధనలు ప్రగతికి విఘాతం కారాదని అంతర్జాతీయ శాస్తవ్రేత్త , గ్లోబల్ రీసెర్చ్ అలయన్స్ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ ఎ మషేల్కర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో నవీకరణ వృద్ధి ఆవిష్కరణల నుండి విఘాతం అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు.

10/14/2016 - 02:01

రాజమహేంద్రవరం, అక్టోబర్ 13: గోదావరి నదిలోంచి సముద్రంలోకి వరద జలాలు రికార్డు స్థాయిలో కలుస్తున్నాయి. నిన్నటి వరకు పెరుగుదలలో వున్న గోదావరి ఎగువన ఉన్న భద్రాచలం వద్ద తగ్గుముఖం పట్టడంతో దిగువన వున్న ధవళేశ్వరం బ్యారేజి వద్ద కూడా ప్రవాహ ఉద్ధృతి తగ్గుతోంది. ధవళేశ్వరం బ్యారేజి వద్ద గురువారం రాత్రి 10.3 అడుగుల ప్రవాహ నీటి మట్టం నమోదైంది.

10/13/2016 - 07:29

విశాఖపట్నం, అక్టోబర్ 12: విశాఖ నగర ప్రజలు 2014 అక్టోబర్ 12వ తేదీని ఎన్నటికీ మరిచిపోలేరు. అందాల విశాఖను వణికించి, చిన్నాభిన్నం చేసిన రోజు అది. ప్రకృతి విలయ తాండవానికి పరాకాష్ట అది. పచ్చని చెట్లతో రమణీయంగా కనిపించే విశాఖ హుదూద్ ధాటికి చిగురుటాకులా వణికిపోయింది. తరుముకొస్తున్న ప్రమాదాన్ని ముందుగానే నాసా హెచ్చరించడంతో, ప్రాణనష్టం పెద్దగా జరగలేదు., కానీ అనూహ్యమైన ఆస్తి నష్టం వాటిల్లింది.

10/13/2016 - 06:45

హైదరాబాద్, అక్టోబర్ 12: చాలాకాలం తర్వాత నవ్యాంధ్ర రాజకీయాల్లో మైండ్‌గేమ్ మొదలయింది. రాజధాని భూములు, ప్రభుత్వం-ప్రాజెక్టులలో అవినీతి అంశాలతో తెదేపాపై ఆరోపణమర గుప్పిస్తున్న వైకాపా గత వారం నుంచి లోకేశ్‌ను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత ఆరోపణలకు దిగింది. తెదేపా నుంచి అంతకుమించి ఎదురుదాడి మొదలుకావడంతో మైండ్‌గేమ్ ఆసక్తికరంగా మారింది.

10/13/2016 - 06:27

హైదరాబాద్, అక్టోబర్ 12: దేశ వ్యాప్తంగా సుప్రీంకోర్టు నుంచి దిగువ కోర్టుల వరకు వివిధ కేసులపై వెలువడిన తీర్పులను నిక్షిప్తం చేసేందుకు కేంద్రప్రభుత్వం నేషనల్ జ్యుడీషియల్ డాటా గ్రిడ్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ గ్రిడ్ ఏర్పాటుకు సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టుల వివరాలను తెలియచేయాలని కేంద్రం కోరుతూ లేఖలు రాసింది.

10/13/2016 - 06:24

హైదరాబాద్, అక్టోబర్ 12: వివిధ బోధనాంశాల్లో పిహెచ్‌డి, ఎంఫిల్ సీట్ల గోల్‌మాల్‌పై ఇటు తెలంగాణలోనూ, అటు ఆంధ్రాలోనూ అనేక ఫిర్యాదులు అందిన తర్వాత కూడా ఇరు ప్రభుత్వాలు పిహెడ్‌డి అడ్మిషన్లలో ఎలాంటి మార్పు చేయకపోవడానికి కారణం ఆయా వర్శిటీలు విముఖత వ్యక్తం చేయడమేనని తెలిసింది. మెడికల్, ఇంజనీరింగ్, బిఇడి, ఎంబిఎ, ఎంసిఎ, లా, ఫిజికల్ ఎడ్యుకేషన్ తదితర కోర్సులకు ఉమ్మడిగా ప్రవేశపరీక్షలు జరుగుతున్నాయి.

Pages