S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/23/2015 - 07:33

హైదరాబాద్, డిసెంబర్ 22: హైదరాబాద్ మెట్రోరైలు పనులు మరో అడుగు ముందుకు పడ్డాయి. సికిందరాబాద్ జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి ఆర్టీసి క్రాస్‌రోడ్డు, చిక్కడపల్లి, సుల్తాన్‌బజార్‌ల మీదుగా నిర్మించనున్న కారిడార్‌లో భాగంగా సుల్తాన్‌బజార్‌లో అలైన్‌మెంట్ మార్చాలంటూ డిమాండ్లు విన్పించిన సంగతి తెలిసిందే.

12/23/2015 - 07:33

హైదరాబాద్, డిసెంబర్ 22: ముఖ్యమంత్రి చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలను తనపైన ప్రయోగిస్తే అంతుచూసే వరకు ఊరుకోను అని ఏడాదిపాటు శాసనసభ నుంచి సస్పెండైన వైకాపా ఎమ్మెల్యే ఆర్‌కె రోజా అన్నారు. మంగళవారం ఆమె లోటస్‌పాండ్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో మహిళలంతా కంతతడి పెడుతున్నారని, ఇది చంద్రబాబు వంశానికి, కుటుంబానికి మంచిది కాదన్నారు. ఏపి అసెంబ్లీ ఎన్టీఆర్ భవన్‌లా తయారైందన్నారు.

12/23/2015 - 07:32

హైదరాబాద్, డిసెంబర్ 22: ఆంధ్రప్రదేశ్ 14వ శాసనసభ పూర్తికాలం పాటు శాసనసభ్యురాలు రోజాను సస్పెండ్ చేయాలని, ఆమెపై కఠిన చర్యలు చేపట్టాలని టిడిపి ఎమ్మెల్యేలు మంగళవారం నాడు శాసనసభలో డిమాండ్ చేశారు. జీరో అవర్ కింద టిడిపి ఎమ్మెల్యేలు రోజా వ్యవహార సరళిపై ప్రస్తావన తెస్తూ, ఆమెపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదుచేయాలని, పూర్తికాలం సభ నుండి బషిష్కరించాలని, మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని కోరారు.

12/23/2015 - 07:30

హైదరాబాద్, డిసెంబర్ 22: ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావుపై అవిశ్వాసతీర్మానం ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీ వైకాపా నిర్ణయించింది. స్పీకర్ శాసనసభలో నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వైకాపా శాసనసభాపక్ష సమావేశం తీర్మానించింది. మంగళవారం ఇక్కడ లోటస్‌పాండ్ కార్యాలయంలో వైకాపా శాసనసభాపక్ష సమావేశం జరిగింది.

12/23/2015 - 07:59

రామచంద్రపురం, డిసెంబర్ 22: పంచారామ క్షేత్రం ద్రాక్షారామలో నిర్వహిస్తున్న అతిరుద్రం మహాయజ్ఞం మూడో రోజైన మంగళవారం వైభవంగా సాగింది. సంకల్పాలు నిత్యపారాయణలు, ఏకాదశ రుద్రాభిషేకాలు, సూర్య నమస్కారాలు జరిగాయి. గౌరీశంకర కలశారాధనతో ప్రారంభమైన ఈ కార్యక్రమాలు గురువందనం, వేదపారాయణం, గురు ప్రార్ధన, మహాన్యాసం, రుద్రాభిషేకం, వసోర్ధార, మహామంగళ హారతి కార్యక్రమాలు జరిగాయి.

12/23/2015 - 07:02

కడప, డిసెంబర్ 22: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన గండికోట ప్రాజెక్టు నిర్మాణ పనులు అడుగు ముందుకు, మూడడుగుల వెనక్కి అన్న చందంగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటివరకు 3వేల 300 కోట్లు విడుదల చేశారు.

12/23/2015 - 07:01

విజయవాడ, డిసెంబర్ 22: రెండున్నర దశాబ్దాలు పైగా పుస్తక పఠనాభిలాషను పెంపొందిస్తూ పుస్తక పఠనావశ్యకతను తెలియజేసేందుకు క్రమం తప్పకుండా ఏటా నూతన సంవత్సరం ఆరంభంలో మొదటి 11 రోజులపాటు జరిగే విజయవాడ పుస్తక మహోత్సవం 2016 జనవరి 1న ప్రారంభం కానుంది.

12/23/2015 - 07:00

ఒంగోలు, డిసెంబర్ 22: ప్రకాశం జిల్లాలో నకిలీ కరెన్సీ నోట్లను చెలామణి చేస్తున్న ఎనిమిదిమంది ముఠా సభ్యులను మంగళవారం కందుకూరు పట్టణ పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్‌పి సిహెచ్ శ్రీకాంత్ వెల్లడించారు. మంగళవారం విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన శంకర్ ఈ నకలీ కరెన్సీ నోట్ల చెలామణిలో ప్రధాన నిందితుడని, అతను పరారీలో ఉన్నట్లు తెలిపారు.

12/23/2015 - 06:59

ిశాఖపట్నం, డిసెంబర్ 22: పరవస్తు పద్యపీఠం, గోకుల్‌చంద్ర, రాహుల్ చంద్రట్రస్ట్ సంయుక్త నిర్వహణలో విశాఖలో గత మూడు రోజులుగా జరుగుతున్న తెలుగు తిరునాళ్ళు కార్యక్రమం మంగళవారం ఘనంగా ముగిసింది. ‘తెలుగు పద్యం రాజనీతి’ అనే అంశంపై నగరానికి చెందిన ప్రముఖుల పద్యాలాపన, మహా సహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహరావు టీకా తాత్పర్య వివరణలతో చివరిరోజు కార్యక్రమం ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది.

12/23/2015 - 06:54

విశాఖపట్నం, డిసెంబర్ 22: మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, ఆయన ప్రధాన అనుచరుడు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కొణతాల తన క్యాడర్‌తో సమావేశం ఏర్పాటు చేసుకుని, టిడిపిలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేయడమే తరువాయి. ఆ సమావేశం కూడా ఈనెలాఖరులో ఉంటుందని గండి బాబ్జీ చెప్పారు.

Pages