S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/07/2016 - 02:08

హైదరాబాద్, అక్టోబర్ 6:సింగరేణి కాలరీస్‌కు వచ్చిన లాభాల్లో కార్మికులకు 23 శాతం వాటా చెల్లించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. అలాగే పదవీ విరమణ (విఆర్‌ఎస్) పథకం కింద లబ్ధిపొందని ఉద్యోగుల కుటుంబాలకు డెపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

10/07/2016 - 02:06

హైదరాబాద్, అక్టోబర్ 6: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ రీసర్చి విద్యార్ధి రోహిత్ వేముల కేవలం నిరాశ, నిస్పృహతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని జస్టిస్ రూపన్‌వాలా కమిషన్ తన నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది.

10/07/2016 - 01:45

విశాఖపట్నం, అక్టోబర్ 6: రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, వాటిని సాంకేతిక పరిజ్ఞానంతో అధిగమిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ‘డిజిటల్ డిస్ట్రప్షన్ అండ్ ఇన్నోవేషన్, నేవిగేటింగ్ ది నెక్స్ట్‌జన్ రివల్యూషన్’ అంశంపై గురువారం విశాఖలో జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ప్రభుత్వ పాలనను సాంకేతికతతో అనుసంధానం చేశామని చెప్పారు.

10/07/2016 - 02:15

విజయవాడ, అక్టోబర్ 6: పార్టీకి చెందిన మంత్రులు, ఎంపి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధుల అందరి పనితీరును తాను మొదటి నుంచి మదింపుచేస్తూ వస్తున్నానని.. ప్రజలతో ఎవరు ఏ విధంగా వ్యవహరిస్తున్నదీ ప్రభుత్వ కార్యక్రమాలను ఏ విధంగా అమలు చేస్తున్నదీ అన్నీ ఓ కంట కనిపెడుతూనే ఉన్నాననీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరించారు.

10/07/2016 - 01:38

విశాఖపట్నం, అక్టోబర్ 6: వరదలు, సునామీలు వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏటా రాష్ట్రంలో వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. అయితే ఎవరికీ తెలియని విషయమేమంటే...పిడుగుపాటుకు మరణిస్తున్నవారి సంఖ్యా అధికంగానే ఉంటోంది. ఆంధ్రప్రదేశ్‌లో సగటున ఏటా పిడుగుపాటుకు 2,500మంది కన్నుమూస్తున్నట్టు అంచనా.

,
10/07/2016 - 01:04

తిరుమల, అక్టోబర్ 6: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో నాల్గవ రోజు గురువారం ఉదయం 9 గంటలకు శ్రీవారి ఉత్సవమూర్తి అయిన మలయప్పస్వామి తన ఉభయ నాంచారులతో కలిసి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి మాడవీధులలో భక్తులకు దర్శనమిచ్చారు. పురాణాలు, బహుముఖంగా కీర్తించే దేవతావృక్షం, ప్రకృతి శోభను పెంపొందించే వృక్షాలు సృష్టిలో చాలా ఉన్నాయి. ఆ వృక్షాలు తాముకాచిన ఫలాలను మాత్రమే అందిస్తాయి.

10/07/2016 - 01:01

తిరుమల, అక్టోబర్ 6: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం శ్రీవారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనం అధిరోహించి భక్తులను కనువిందు చేయనున్నారు. శుక్రవారం రాత్రి జరిగే వాహన సేవను తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో టిటిడి, జిల్లాపోలీసులు ప్రతిష్ఠ భద్రత, పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

10/07/2016 - 01:00

హైదరాబాద్, అక్టోబర్ 6: తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలల్లో ఫీజులను నియంత్రించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫీజుల విషయంలో పాఠశాలల యాజమాన్యాల ఇష్టారాజ్యం కొనసాగదని, ఫీజులను నియంత్రించేందుకు జిల్లా స్థాయిలో కమిటీలను వేయవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. గత నెల 19వ తేదీన సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చినా, తీర్పు పూర్తిపాఠం గురువారం నాడు వచ్చింది.

10/07/2016 - 00:58

హైదరాబాద్, అక్టోబర్ 6: మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల మూలంగా గోదావరి, దాని ఉపనదులు పొంగిపొర్లుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని గోదావరికి ఉపనదిగా ఉన్న మంజీర చాలా సంవత్సరాల తర్వాత వరదతో నిండిపోతోంది. ఇప్పటికే ఈ నదిపై ఉన్న సింగూరు, మంజీరా, ఘన్‌పూర్ ఆనకట్ట, నిజాంసాగర్ తదితర ప్రాజెక్టులు గత 15 రోజుల నుండి అలుగులు పారుతున్నాయి.

10/07/2016 - 01:57

విజయవాడ, అక్టోబర్ 6: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం తాను చేసిన చట్టాలనే తుంగలో తొక్కి అప్రజాస్వామికంగా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నదంటూ ప్రముఖ సామాజికవేత్త మేధాపాట్కర్ దుయ్యబట్టారు. మద్యం, మత్తు పదార్థాలపై నిషేధం కోసం దశలవారీగా ఉద్యమాన్ని నిర్వహించబోతున్నామని ఆమె చెప్పారు.

Pages