S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/07/2016 - 00:55

కొత్తగూడెం, అక్టోబర్ 6: నిజామాబాద్ నుండి భద్రాచలంకు వెళ్తుండగా గురువారం ఒక కారు ఖమ్మంజిల్లా టేకులపల్లి మండలం ఆరవ మైలు తండా వద్ద అదుపు తప్పి వాగులో పడిపోవడంతో ఇద్దరు యువకులు మృతిచెందగా మరో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలై అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన వారిలో ప్రభాకర్ (25), విజయ్ (25) ఉండగా హరికృష్ణ, స్వామిగౌడ్‌లు గాయపడిన వారిలో ఉన్నారు.

10/07/2016 - 00:54

హైదరాబాద్, అక్టోబర్ 6: తెలంగాణలో ప్రైవేటు యూనివర్శిటీల ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతోంది. ఇప్పటికే వేర్వేరు ప్రాంతాల్లో అనుమతి పొంది ప్రైవేటు యూనివర్శిటీలు నిర్వహిస్తున్న సంస్థలతో పాటు మరో 50 ఇంజనీరింగ్ కాలేజీలు కూడా యూనివర్శిటీల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రైవేటు యూనివర్శిటీల బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

10/07/2016 - 00:54

హైదరాబాద్, అక్టోబర్ 6: తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపునకు ఈ నెల 31 వ తేదీ వరకూ గడువు విధించారు. 50 రూపాయిల జరిమానాతో నవంబర్ 15 వరకూ, 200 రూపాయిల జరిమానాతో నవంబర్ 30 వరకూ, 500 రూపాయిల జరిమానాతో డిసెంబర్ 7వ తేదీ వరకూ గడువు విధించారు. రెగ్యులర్ అభ్యర్ధులు 125 రూపాయిలు, మూడు లేదా అంతకంటే తక్కువ సబ్జెక్టులకు హాజరయ్యే వారు 110 రూపాయిలు చెల్లించాల్సి ఉంటుంది.

10/07/2016 - 00:53

హైదరాబాద్, అక్టోబర్ 6: ఒరిస్సాలోని ఉత్కళ్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్‌గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ కమల్ కె మిశ్రా నియమితులయ్యారు. ఆంత్రోపాలజీ డిపార్టుమెంట్‌కు డీన్‌గా వ్యవహరిస్తున్న కమల్ కె మిశ్రా మూడేళ్ల కాలపరిమితికి వైస్ ఛాన్సలర్‌గా నియమితులయ్యారు. ఈ యూనివర్శిటీని 1990లో స్థాపించారు.

10/07/2016 - 00:53

హైదరాబాద్, అక్టోబర్ 6: తెలంగాణ పోలీసులు ఉగ్రవాద అనుమానితుల కదలికలపై గట్టి నిఘా వేసి కేంద్ర దర్యాప్తు సహకరించడంలో ముందున్నారు. తెలంగాణలో తీవ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసి జాతీయ స్థాయిలో శభాష్ అనిపించుకున్న తెలంగాణ పోలీసులు, ఇప్పుడు ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.

10/06/2016 - 08:28

విజయవాడ, అక్టోబర్ 5: రాష్ట్ర వ్యాపితంగా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 8న రామవరప్పాడు రింగ్ సెంటర్ వద్ద అగ్రిగోల్డ్ బాధితులతో రాస్తారోకో నిర్వహించడం జరుగుతుందని, ఈ రాస్తారోకోలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధులు పాల్గొంటారని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరపతిరావు చెప్పారు.

10/06/2016 - 08:07

తిరుమల, అక్టోబర్ 5: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో మూడోరోజైన బుధవారం ఉదయం అనంతతేజోమూర్తి అయిన శ్రీ మలయప్ప స్వామి సింహ వాహనంపై అధిరోహించి భక్తులకు అభయమిచ్చారు. దుష్టశిక్షణ కోసం నారసింహునిగా మలయప్ప భక్తులను అనుగ్రహించారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.

10/06/2016 - 08:00

హైదరాబాద్, అక్టోబర్ 5: ఎన్నికల ఖర్చు తగ్గించేందుకు లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అభిప్రాయపడ్డారు. ఈ దిశగా ఆలోచన చేయాలని ఆయన సూచించారు. బుధవారం నగరంలో ఏర్పాటైన రాష్ట్ర ఎన్నికల అధికారుల 24వ జాతీయ స్థాయి సమావేశాన్ని ఆయన ప్రారంభించారు.

10/06/2016 - 07:59

శంషాబాద్, అక్టోబర్ 5: ఇతర దేశాలతో సఖ్యతతో ఉండాలనేది భారతదేశ విధానమని త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి అన్నారు. బుధవారం శంషాబాద్ మండలం ముచ్చింతల గ్రామంలోని శ్రీరామనగరంలో జరిగిన విలేఖరుల సమావేశంలో చిన్నజీయర్ స్వామి మాట్లాడుతూ.. ఇతర దేశాలతో సఖ్యతతో ఉండాలని భారతదేశం కోరుకుటుందని అన్నారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ పిలుపుమేరకు సైనికుల సంక్షేమానికి రూ.10 లక్షల విరాళం ప్రకటించారు.

10/06/2016 - 07:57

హైదరాబాద్, అక్టోబర్ 5: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మంచినీరు, ఖరీఫ్ పంట అవసరాలను దృష్టిలో పెట్టుకుని కృష్ణా జలాలను కేటాయిస్తూ కృష్ణా బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు లేఖ రాసింది. అక్టోబర్ నెల అవసరాలనుదృష్టిలో ఉంచుకుని ఆంధ్రాకు 18.5 టిఎంసి, తెలంగాణకు 17.5 టిఎంసిని కేటాయించారు.

Pages