S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/06/2016 - 07:56

హైదరాబాద్, అక్టోబర్ 5: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విభజనకు రంగం సిద్ధమైందని ఆ యూనివర్శిటీ కొత్త వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ వి సత్యనారాయణ పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలంగాణలో ఉన్న వర్శిటీ ఇక మీదట తెలంగాణ తెలుగు విశ్వవిద్యాలయంగా మారుతుందని, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రాజమండ్రిలో ఏర్పాటు అవుతుందని అన్నారు.

10/06/2016 - 07:44

హైదరాబాద్, అక్టోబర్ 5: ఈ సంవత్సరం ఇంతవరకు సమాచార కమిషన్‌కు 31,662 అపీల్స్, ఫిర్యాదులు రాగా, 30301 అపీల్స్, ఫిర్యాదులను పరిష్కరించినట్లు ఉమ్మడి రాష్ట్రాల సమాచార కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్ తెలిపారు. సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు.

10/06/2016 - 07:21

హైదరాబాద్, అక్టోబర్ 5: ‘ఆశ లావు.. పీక సన్నం’ అంటే ఇదే. ప్రచారంలో పక్క రాష్ట్రంతో పోటీ పడాలి. కానీ సొమ్ములు ఇచ్చేది మాత్రం అంతంతమాత్రమే. సరిపడా సిబ్బంది, అధికారులు, వసతులు లేక ఏపి సమాచార శాఖ సమస్యల్లో కొట్టుమిట్టాడుతోంది. ఫలితంగా దాదాపు 50 కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయింది. సర్కారు సకాలంలో నిధులివ్వకపోవడంతో బకాయిలు చెల్లించలేక నానా అవస్థలు పడుతుతున్న పరిస్థితి నెలకొంది.

10/05/2016 - 08:23

విజయవాడ, అక్టోబర్ 4: అన్నం పరబ్రహ్మ స్వరూపం.. సర్వ జీవనాధారం అటువంటి అన్నాన్ని ప్రసాదించే అన్నపూర్ణాదేవిని నిత్యాన్నదేవిని నిత్యాన్న దానేశ్వరిగా నిటలాక్ష ప్రాణేశ్వరిగా కొలుస్తాం.. సర్వమానవాళే కాకుండా జీవకోటి నశించి పోకుండా అన్నపూర్ణాదేవి నిజ నివాసం కాశీపురం.. అధినాధుడు విశే్వశ్వరుడి ప్రియపత్ని అన్నపూర్ణాదేవిని కాశీఅన్నపూర్ణ అని పిలుస్తాం.. దుర్గమ్మ దివ్య స్వరూపాల్లో అన్నపూర్ణాదేవి ఒకరు.

10/05/2016 - 08:16

హైదరాబాద్, అక్టోబర్ 4: అర్బన్ సీలింగ్ ల్యాండ్ ఆక్రమితులకు క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పిస్తూ రెవిన్యూ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు వెలువడిన నాటి నుంచి నెల రోజుల పాటు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్టు రెవిన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె ప్రదీప్ చంద్ర పేర్కొన్నారు.

10/05/2016 - 08:14

హైదరాబాద్, అక్టోబర్ 4: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల 24 వ జాతీయ సదస్సు బుధవారం నుండి హైదరాబాద్ (ఐటిసి కాకతీయ, బేగంపేట) లో నిర్వహిస్తున్నారు. 29 రాష్ట్రాల నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఎన్నికల నిర్వహణకలో కీలకపాత్ర పోషించే ఎన్నికల కమిషనర్ల సమావేశంలో ముఖ్యమైన అంశాలపై రెండు రోజులపాటు చర్చలు జరుగుతాయని అధికార వర్గాలు వెల్లడించాయి.

10/05/2016 - 06:16

హైదరాబాద్/హయత్‌నగర్, అక్టోబర్ 4: రెండు నెలల కింద ట నలుగురు యువకులు పీకల దాకా మద్యం సేవించి, కారు నడిపి రమ్య అనే పదేళ్ల బాలికను బలిగొన్న సంఘటన మళ్లీ తెరపైకి వచ్చింది. అదే తరహాలో హయత్‌నగర్ సమీపాన ప్రమా దం జరగడం, ఈ దుర్ఘటనలో సంజన అనే ఐదేళ్ల బాలికకు బ్రెయిన్‌డెడ్ కాగా ఆమె తల్లి శ్రీదేవి పరిస్థితి విషమంగా మారిన సంగతి తెలిసిందే.

10/05/2016 - 05:52

హైదరాబాద్, అక్టోబర్ 4: కృష్ణా జలాల వినియోగాన్ని పర్యవేక్షించేందుకు ఇరు రాష్ట్రాల అధికారులతో కృష్ణా యాజమాన్య బోర్డు ఒక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగం, ప్రాజెక్టుల నిర్మాణంపై వివాదాలు తలెత్తిన నేపథ్యంలో ఇటీవల కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి నేతృత్వంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.

10/05/2016 - 01:46

భద్రాచలం, అక్టోబర్ 4: తెలంగాణ సర్కారు చేపట్టిన జిల్లాల పునర్విభజనను నిరసిస్తూ ఖమ్మం జిల్లా భద్రాచలం మన్యం భగ్గుమంటోంది. కొత్తగూడెం జిల్లా నుంచి వాజేడు, వెంకటాపురం మండలాలను వేరు చేసి భూపాల్‌పల్లి జిల్లాలో విలీనం చేయాలనే ముఖ్యమంత్రి కెసిఆర్ సూచనలను అన్ని రాజకీయ పార్టీలు, గిరిజన, దళిత, ప్రజాసంఘాలు తప్పుబడుతున్నాయి. వెంకటాపురం మండలంలో అఖిలపక్షం 72 గంటల బంద్‌ను నిర్వహించింది.

10/04/2016 - 03:29

హైదరాబాద్, అక్టోబర్ 3: ముసాయిదాలో ప్రకటించిన 17 కొత్త జిల్లాలతోపాటు జనగామ, గద్వాల, సిరిసిల్ల, ఆసిఫాబాద్ జిల్లాల ఏర్పాటుకు ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులపై అధ్యయనం చేసి తుది నిర్ణయం తీసుకుంటామని సిఎం కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

Pages