S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/04/2016 - 03:27

హైదరాబాద్, అక్టోబర్ 3: 2019 జరిగే ఎన్నికల్లోనూ టిఆర్‌ఎస్ పార్టీయే గెలుస్తుంది. ప్రతిపక్ష పార్టీలూ ఇదే మాట చెబుతున్నాయి. కాబట్టి మన ప్రణాళిక, ఆలోచన రాబోయే ఏడేనిమిదేళ్ళ కోసం జరగాలి. రోటీన్ ప్రభుత్వంగా మనం పని చేస్తే లాభం లేదు. మార్పు తీసుకురావడమే లక్ష్యంగా పని చేసుకుపోతున్నాం’ అని సిఎం కె చంద్రశేఖర్‌రావు అన్నారు.

10/04/2016 - 03:24

మెదక్, అక్టోబర్ 3: మెదక్ జిల్లాలో నాగిరెడ్డిపేటను చేర్చాలని డిమాండ్ చేస్తూ సోమవారం మధ్యాహ్నం నలుగురు యువకులు పోచారం డ్యామ్‌లో దూకారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకులను అక్కడున్న లంబాడివాసులు గమనించి ప్రాణాలు కాపాడారు. నాగిరెడ్డిపేట ఎస్‌ఐ ఆటోలో నలుగురు యువకులను మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెదక్ జిల్లాలో నాగిరెడ్డిపేట మండలాన్ని చేర్చాలని ఇప్పటికే ఆందోళనలు జరుగుతోన్న విషయం తెలిసిందే.

10/04/2016 - 03:22

హైదరాబాద్, అక్టోబర్ 3: ఇటీవల పంజగుట్ట వద్ద జరిగిన చిన్నారి రమ్య ప్రమాద ఘటన మరువకముందే మరోసారి అలాంటి ప్రమాదమే సోమవారం ఔటర్ రింగ్‌రోడ్డుపై చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట వద్ద కారు అదుపుతప్పి తల్లీ కూతుళ్లను ఢీకొట్టింది. ప్రమాదంలో ఐదేళ్ల చిన్నారి బ్రెయిన్ డెడ్ అయ్యింది.

10/04/2016 - 03:19

దిలవార్‌పూర్, అక్టోబర్ 3: మత్స్యకారుల స్వయం సమృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాష్టవ్య్రాప్తంగా చెరువులు, ప్రాజెక్టుల్లో ఉచితంగా 35 కోట్ల చేప పిల్లలు విడుదల చేస్తుందని పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. స్థానిక సాంగ్వీలోని శ్రీరాంసాగర్ కాల్వలో మంత్రులు అల్లోల, జోగు రామన్నతో కలిసి సోమవారం చేప పిల్లలు వదిలారు.

10/04/2016 - 03:16

గుంటూరు, అక్టోబర్ 3: గుంటూరు జిల్లా వెలగపూడిలోని కొత్త సచివాలయంలో యంత్రాంగం కొలువుతీరింది. మొత్తం 32 ప్రభుత్వ శాఖలకు గాను 28 విభాగాలకు చెందిన 15 వందల మంది రెగ్యులర్, మరో 500 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు సోమవారం విధులకు హాజరయ్యారు. మొదటి బ్లాక్ మినహా మిగిలిన నాలుగు బ్లాకులలో 3వేల మంది వరకు ఉద్యోగులకు సీటింగ్ సదుపాయం కల్పించారు. అన్ని శాఖలకు కార్యాలయాలను బ్లాకుల వారీగా ఇప్పటికే నిర్దేశించారు.

10/04/2016 - 02:59

చిత్రం.. శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా సోమవారం స్వామి వారికి
పట్టువస్త్రాలు సమర్పిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

10/04/2016 - 03:13

గుంటూరు, అక్టోబర్ 3: ‘విభజన అనివార్యమైంది.. స్వరాష్ట్రంలో మేము ఉద్యోగాలు చేయక తప్పదు.. అభివృద్ధిని కాంక్షించి ముఖ్యమంత్రి పిలుపు మేరకు నవ్యాంధ్ర నిర్మాణంలో భాగస్వాములం కావడమే మా తక్షణ కర్తవ్యం’ అని సచివాలయ ఉద్యోగినులు అన్నారు.

10/04/2016 - 02:50

తిరుమల, అక్టోబర్ 3: వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయంలో సోమవారం నుండి పూర్తి స్థాయిలో పాలన ప్రారంభమైందని సిఎం చంద్రబాబు చెప్పారు. వచ్చే శీతాకాల అసెంబ్లీ సమావేశాలు అమరావతిలో జరుగుతాయన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం ముఖ్యమంత్రి ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.

10/04/2016 - 02:47

విశాఖపట్నం, అక్టోబర్ 3: విశాఖ షిప్‌యార్డుకు మంచిరోజులు రాబోతున్నాయి. దేశంలోనే పురాతనమైన, నాణ్యమైన నౌకల తయారీగా పేరొందిన విశాఖ షిప్‌యార్డు అనేక భారీ నౌకలను తయారు చేసి కీర్తి ప్రతిష్ఠలను ఆర్జించిన సంగతి తెలిసిందే. అయితే, పాతికేళ్ల కిందట నుంచి నష్టాల ఊబిలో కూరుకుపోయింది. ఈ షిప్‌యార్డుకు ఎంతమంది చైర్మన్‌లుగా వచ్చినా, దీని దశ, దిశను మార్చలేకపోయారు.

10/04/2016 - 02:39

తిరుమల, అక్టోబర్ 3: శ్రీవేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల ప్రారంభానికి నాందిగా శ్రీవారి ఆలయంలో సోమవారం ధ్వజారోహణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 6.15 నుంచి 6.30 గంటల మధ్య మీనలగ్నంలో వైఖానస ఆగమ సంప్రదాయ రీత్యా పవిత్ర గరుడ పతాకాన్ని (్ధ్వజపటం) బంగారు ధ్వజస్తంభ శిఖరాగ్రంపై ఆవిష్కరించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.

Pages