S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/27/2016 - 00:47

కరీంనగర్, సెప్టెంబర్ 26: కరువుతో కునారిల్లుతున్న రాష్ట్ర ప్రజలకు వచ్చే రెండేళ్ళ వరకూ కరువు ఛాయలు కనిపించవని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆనందం వ్యక్తం చేశారు. అతివృష్టితో ఖరీఫ్ పంటలు కొంతమేర దెబ్బతిన్నా, రబీలో మరింత బలమైన పంటలతో రైతులకు మేలు కలుగుతుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. గత మూడు రోజులుగా కురుస్తున్న అసాధారణ వర్షాలతో అతలాకుతలమైన వరద ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సోమవారం పర్యటించారు.

09/27/2016 - 00:44

హైదరాబాద్, సెప్టెంబర్ 26: వైద్య ఆరోగ్య శాఖలో త్వరలోనే 2118 పోస్టులు భర్తీ చేయనున్నట్టు వైద్య ఆరోగ్య మంత్రి సి లక్ష్మారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ప్రక్రియ పూరె్తైందని, నియామకపు ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందన్నారు. వీటితోపాటు మరి కొన్ని పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. నియామకాలు పూరె్తైతే ప్రభుత్వ వైద్య శాలల్లో సిబ్బంది కొరత తీరిపోతుందన్నారు.

09/27/2016 - 00:43

హైదరాబాద్, సెప్టెంబర్ 26: దేశవ్యాప్తంగా జూనియర్ రీసెర్చి ఫెలోషిప్, జాతీయ అర్హత పరీక్షల నిర్వహణ తమ వల్ల కాదని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్‌ఇ)చేతులెత్తేసింది. యూనివర్శిటీలతో పాటు ఉన్నత విద్యా సంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియామకానికి, పిహెచ్‌డి అడ్మిషన్లలో ప్రాధాన్యతకు నెట్ అర్హత ఉపయోగపడుతుంది. ఇక మీదట ఆ బాధ్యతను యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ చూసుకోవాలని పేర్కొంది.

09/27/2016 - 00:41

హైదరాబాద్, సెప్టెంబర్ 26: అసాధారణ వర్షాలతో రాజధానినే వరద కకావికలం చేయడంతో మున్సిపల్ మంత్రి కె తారక రామారావు చర్యలకు ఉపక్రమించారు. నీటి ప్రవాహ మార్గాల్లో అక్రమంగా వెలసిన కట్టడాలను తప్పించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలు, వరదలపై మున్సిపల్ కమిషనర్లు అప్రమత్తం కావాలని, అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

09/27/2016 - 00:33

భద్రాచలం/రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 26: భద్రాచలం, ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం క్రమేణా పెరుగుతోంది. ఎగువన శ్రీరాంసాగర్, సింగూరు ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేసిన నేపథ్యంలో భద్రాచలం వద్ద నీటిమట్టం సోమవారం రాత్రి 27.2 అడుగులకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు.

09/27/2016 - 00:29

న్యూఢిల్లీ, సెప్టెంబరు 26: పోలంవరం ప్రాజెక్టు నిర్మాణానికి తొలి విడత రుణం ఇచ్చేందుకు నాబార్డ్ అంగీకరించింది. వచ్చే నెల 15నుంచి తొలి విడత రుణం విడుదల మొదలు కానుందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి వెల్లడించారు. ఢిల్లీలో సోమవారం సుజనా చౌదరి అధ్వర్యంలో నాబార్డ్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, రాష్ట్ర జల వనరుల శాఖలకు చెందిన ఉన్నతాధికారులు సమావేశమయ్యారు.

09/26/2016 - 05:33

హైదరాబాద్, సెప్టెంబర్ 25: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం సమిసిపోకముందే జల విద్యుత్‌పై రగడ ప్రారంభమైంది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి ఉత్పత్తి చేస్తున్న జల విద్యుత్‌లో ఆంధ్రాకు వాటా ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ పంపింది.

09/26/2016 - 05:28

హైదరాబాద్, సెప్టెంబర్ 25: డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి (ఎంసిఆర్-హెచ్‌ఆర్‌డి) ఇనిస్టిట్యూట్‌ను వాషింగ్టన్‌లోని జార్జిటౌన్ యూనివర్సిటీ, సింగపూర్‌లోని నేషనల్ యూనివర్సిటీ ఇ-గవర్నమెంట్ లీడర్‌షిప్ సెంటర్‌కు చెందిన ప్రతినిధులు ఆదివారం సందర్శించారు.

09/26/2016 - 05:27

హైదరాబాద్, సెప్టెంబర్ 25: మన దేశ భూభాగంలో పాకిస్తాన్ అశాంతిని ప్రేరేపిస్తున్నదని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రాందా స్ అతవాలే మండిపడ్డారు. పాకిస్తాన్‌పై ఎటువంటి చర్యలకైనా వెనుకాడబోమని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారని ఆయన ఆదివారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో గుర్తు చేశారు. జమ్మూకాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయడాని కి పాక్ ప్రయత్నిస్తున్నదని ఆయన విమర్శించారు.

09/26/2016 - 05:13

తిరుపతి, సెప్టెంబర్ 25: శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం గొప్ప లక్ష్యాలతో ఏర్పాటు చేసిందని, ఆ దిశగా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఎంతో ఉందని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. ఆదివారం వేదిక్ వర్శిటీని సందర్శించిన ఆయన ఆచార్యులతో సమావేశమయ్యారు.

Pages