S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/25/2016 - 03:23

హైదరాబాద్, సెప్టెంబర్ 24: దేశవ్యాప్తంగా మెడికల్ , డెంటల్ పిజి కాలేజీల్లో ఉన్న ఎండి, ఎంఎస్, పిజి డిప్లొమా సీట్ల భర్తీకి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టు (నీట్) పీజీ -2017ను డిసెంబర్ 5 నుండి నిర్వహించాలని నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్ నిర్ణయించింది. ఈ ప్రకటన ఆదివారం వెలువడనుంది. పిజి పరీక్ష డిసెంబర్ 5 నుండి 13వ తేదీ వరకూ జరుగుతుంది. డెంటల్ కోర్సులకు మాత్రం నవంబర్ 30న పరీక్ష జరుగుతుంది.

09/25/2016 - 03:22

ఏలూరు, సెప్టెంబర్ 24: ఎటువంటి హేతుబద్ధత లేకుండా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని, ఫలితంగా కష్టాల్లో ఉన్నా ఎలాగోలా అభివృద్ధిపథంలో నెట్టుకొస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం హోదాకు మించిన సహాయం చేస్తామని ముందుకొస్తే తెలివైనవాడిని కాబట్టే ఒప్పుకున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు.

09/25/2016 - 03:19

షాద్‌నగర్, సెప్టెంబర్ 24: మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని న్యూసిటీ కాలనీలో శనివారం రాత్రి 10.15 గంటల సమయంలో ఐదేళ్ల బాలుడిని అతిదారుణంగా గొంతుకోసి హత్య చేసిన ఘటన కలకలరేపింది. కొత్తూరు మండలం చంద్రయనిగూడకు చెందిన డ్రైవర్ యాదయ్య, అతని భార్య మంజుల, వారి ఐదేళ్ల కుమారుడు శ్రీనాథ్, మరో ఇద్దరు కుమార్తెలు షాద్‌నగర్ పట్టణంలో న్యూసిటీ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు.

09/25/2016 - 03:19

హైదరాబాద్, సెప్టెంబర్ 24: గ్యాంగ్‌స్టర్ నరుూం కేసులో కీలక వ్యక్తి శేషన్న కోసం పోలీసులు నల్లమల్లను జల్లెడ పడుతున్నారు. నరుూంకు ఆయుధాలు, డ్రగ్స్, డబ్బు సమకూర్చింది శేషనే్ననని పోలీసులు గుర్తించారు. శేషన్న మాజీ నక్సలైట్ కావడం, అతనికి నరుూంతో మంచి సంబంధాలు ఉండటం.. నరుూం డంప్‌ల రహస్యం అతనికి తెలిసి ఉంటుందనడానికి బలం చేకూరుస్తోంది.

09/25/2016 - 03:18

హైదరాబాద్, సెప్టెంబర్ 24: తెలంగాణలో ఎంబిఎ, ఎంసిఎ కాలేజీల్లో తుది విడత కౌనె్సలింగ్ ప్రక్రియను శనివారం పూర్తి చేసినట్టు అడ్మిషన్ల కన్వీనర్ డాక్టర్ ఎం వి రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో 296 ఎంబిఎ కాలేజీల్లో 22648 సీట్లకు 22,532 మందికి సీట్లు కేటాయించామని, అలాగే 38 ఎంసిఎ కాలేజీల్లో 1909 సీట్లకుగానూ 1822 సీట్లు కేటాయించామని పేర్కొన్నారు.

09/25/2016 - 03:17

హైదరాబాద్, సెప్టెంబర్ 24: తెలంగాణ రాష్ట్రంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల రిక్రూట్‌మెంట్‌కు ఎంపిక పరీక్షను ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్నట్టు పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ చెప్పారు. 251 పోస్టులకు 563 దరఖాస్తులు వచ్చాయని, వారికోసం హైదరాబాద్‌లో మూడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

09/25/2016 - 02:42

హైదరాబాద్, సెప్టెంబర్ 24: రాష్టవ్య్రాప్తంగా వర్షాలు కురవడం సంతోషకరమని, వీటితో రెండేళ్లపాటు తెలంగాణలో కరువనేది ఉండదని సిఎం కె చంద్రశేఖర్ రావు తెలిపారు. హైదరాబాద్‌లో అసాధారణ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయన్నారు. నాలాల ఆక్రమణలు, చెరువుల్లోని భూముల్లో నిర్మాణాల వల్ల ముంపు పాలయ్యాయని చెప్పారు.

09/25/2016 - 02:40

హైదరాబాద్ : మరఠ్వాడాలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, దీనివల్ల గోదావరికి వరదొచ్చే ప్రమాదముందని సిఎం కెసిఆర్ హెచ్చరించారు. గోదావరి పరీవాహక ప్రాంత జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ, పోలీసు యంత్రాంగం అప్రమత్తం కావాలని ఆదేశాలిచ్చామన్నారు. అధికారుల సెలవులు రద్దు చేసి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అప్రమత్తం చేశామన్నారు.

09/25/2016 - 02:38

తెలంగాణ చిగురుటాకులా వణుకుతోంది. భయపెట్టేంతగా కురుస్తున్న కుండపోత ‘కొంప’ కొల్లేరు చేస్తుంటే, మరో ఐదు రోజుల అతి భారీ వర్షాలు ఎలాంటి ఉపద్రవం తెస్తాయోనన్న ఆందోళన పెరుగుతోంది. శనివారంనాటి వర్షాలకు రాష్ట్రంలో నలుగురు మృతిచెందితే, ఏడుగురు గల్లంతయ్యారు. వానదెబ్బకు జనం అల్లాడుతుంటే, ఎగువన కురిసిన వానతో గోదావరి వరద పెరుగుతోంది. దీంతో పరీవాహక జిల్లాల్లో హై-అలర్ట్ ప్రకటించారు.

09/25/2016 - 02:35

హైదరాబాద్, సెప్టెంబర్ 24: ఉత్తర తెలంగాణ జిల్లాలను అతిభారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో గత 24 గంటల్లో కుంభవృష్టి కురిసింది. గతంలో లేని విధంగా ఆర్మూర్‌లో 39 సెంటీమీటర్లు, మద్నూర్, రెంజల్, బోధన్‌లలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో రాష్ట్ర ప్రభుత్వ దృష్టి నిజామాబాద్ జిల్లాపై కేంద్రీకృతమైంది.

Pages