S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/24/2016 - 03:10

హైదరాబాద్, సెప్టెంబర్ 23: ఈ నెల 29,30 తేదీల్లో జైళ్లలో సంస్కరణలపై ఢిల్లీలో బ్యూరో ఆఫ్ పోలీసు రీసెర్చి అండ్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు తెలంగాణ, ఆంధ్రరాష్ట్రానికి చెందిన జైళ్ల శాఖాధికారులు హాజరు కానున్నారు. రాష్ట్రంలో జైళ్లలో అమలు చేస్తున్న సంస్కరణలను కేంద్రానికి తెలియచేసేందుకు తెలంగాణ జైళ్ల శాఖ నివేదిక రూపొందించింది.

09/24/2016 - 03:09

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: తెలంగాణలో ప్రకృతిసిద్ధమైన సందర్శనీయ స్థలాలు ఎన్నో ఉన్నాయని, వాటిని మరింత అభివృద్ది చేసేందుకు పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర పర్యాటక, సాంసృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ పిలుపునిచ్చారు. శుక్రవారంనాడు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ఇంక్రెడిబుల్ ఇండియా టూరిజం ఇనె్వస్టర్స్ సమ్మిట్‌లో తెలంగాణ తరపున చందూలాల్ పాల్గొన్నారు.

09/24/2016 - 03:08

హైదరాబాద్, సెప్టెంబర్ 23: తెలంగాణ గ్రూప్-2 కేటగిరి పోస్టులకు దరఖాస్తు చేసే గడువును ఈ నెల 26వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్టు పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ చెప్పారు. హైదరాబాద్ సహా తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దరఖాస్తు గడువును మరో మూడు రోజుల పాటు పొడిగించినట్టు తెలిసింది.

09/24/2016 - 03:05

హైదరాబాద్, సెప్టెంబర్ 23: ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉమాభారతి సమక్షంలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీ తదనంతర ప్రచార పరిణామంలో తాము పూర్తిగా వెనుకబడిపోయామని ఏపి మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

09/24/2016 - 02:42

హైదరాబాద్, సెప్టెంబర్ 23: రాష్ట్రంలోని చాలాప్రాంతాల్లో శనివారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరించింది. గురువారం ఏర్పడిన అల్పపీడనం ఉత్తరకోస్తాంధ్ర, తెలంగాణ, దక్షిణ చత్తీస్‌గఢ్ మధ్యభాగంలో ప్రభావం చూపగా, ప్రస్తుతం ఇది తెలంగాణ, దక్షిణ చత్తీస్‌గఢ్, విదర్భ మధ్య కొనసాగుతోంది.

09/24/2016 - 02:40

అడ్డూఆపూ లేని వర్షాలతో తెలంగాణ జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. శుక్రవారం వర్షాల కారణంగా మెదక్ జిల్లాలో ఐదుగురు, వరంగల్ జిల్లా ఇద్దరు, నల్గొండ జిల్లాలో ఇద్దరు, సికింద్రాబాద్‌లో ఒకరు మరణించారు. హైదరాబాద్‌లోని ఆల్వాల్‌లో అత్యధికంగా 25సెంటిమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. జంట నగరాల్లో 48 పురాతన భవనాలను కూల్చివేశారు. హుస్సేన్‌సాగర్‌లోకి ఇన్‌ఫ్లో తగ్గడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

09/24/2016 - 02:56

హైదరాబాద్, సెప్టెంబర్ 23: అసాధారణ వర్షాలతో సంభవించిన నష్టాలను అంచనా వేసి నివేదిక ఇవ్వాల్సిందిగా సిఎస్ రాజీవ్ శర్మను సిఎం కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. భారీ నష్టాలపై కేంద్ర సాయం కోరనున్నట్టు వెల్లడించారు. శుక్రవారం ఉదయం ఢిల్లీ పర్యటన నుంచే సిఎం వర్షాలు, వరదల పరిస్థితిని సమీక్షించారు.

09/24/2016 - 02:44

ఆంధ్రావని జల దిగ్బంధంలో చిక్కుకుంది. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. రెండు రోజుల పాటు కురిసిన కుంభవృష్టి ప్రభావం రాష్ట్రాన్ని వరద పాలు చేసింది. పల్నాడు ప్రాంతంలో శుక్రవారం కూడా భారీ వర్షాలు కురిశాయి. వరద నీటికి గ్రామాలకు గ్రామాలే నీట మునిగిపోయాయి. లక్షల ఎకరాల్లో పంట నీటి పాలైంది.

09/24/2016 - 03:02

విశాఖపట్నం, సెప్టెంబర్ 23: తీర ప్రాంత రాష్ట్రాల్లో మెరైన్ ప్రోడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంపెడా) ప్రాంతీయ బోర్డులను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. విశాఖలో మూడు రోజులపాటు జరగనున్న ఇండియా, ఇంటర్నేషనల్ సముద్ర ఉత్పత్తుల ప్రదర్శనను శుక్రవారం ఆమె ప్రారంభించారు.

09/23/2016 - 04:08

హైదరాబాద్, సెప్టెంబర్ 22: సుప్రీం కోర్టు నిబంధనలకు లోబడి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సి కేటగిరీ కింద ఎన్‌ఆర్‌ఐ సీట్ల సంఖ్యను పెంచరాదని, అలాగే బి కేటగిరీ కింద మేనేజిమెంట్ కోటా సీట్లను రెండవ కౌనె్సలింగ్ నిర్వహించి భర్తీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. జస్టిస్ వి రామసుబ్రహ్మణియన్, జస్టిస్ అనిస్‌తో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.

Pages