S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/21/2016 - 04:30

మంత్రాలయం, ఆగస్టు 20: మంత్రాలయం రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాల్లో భాగంగా శనివారం మధ్యారాధన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి మూల బృందావనానికి పంచామృతాభిషేకం, రాయల పాదపూజ, నిర్మల్య విసర్జన పూజలు నిర్వహించారు. బంగారు కవచాన్ని మూల బృందావనానికి అలంకరింపజేసి కర్నాటక నుంచి తెచ్చిన ప్రత్యేక పూలతో పూజలు చేశారు.

,
08/21/2016 - 04:31

హైదరాబాద్/కీసర, ఆగస్టు 20: హైదరాబాద్ శివార్లలోని కీసర సమీపంలో ఉన్న శ్రీసాయిధామం ఆశ్రమ ధర్మాధికారి మాతా శుకవాణి శనివారం తెల్లవారు జామున స్వర్గస్థులయ్యారు. కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఉన్న ఆమె ఆశ్రమంలోనే తుది శ్వాస విడిచారు. ఆశ్రమ పీఠాధిపతి స్వర్గీయ శ్రీ సత్యపదానంద ప్రభూజీ శిష్యరికంలో ఆమె ఆశ్రమ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు.

08/21/2016 - 04:24

సిద్దిపేట, ఆగస్టు 20: పోలీసు ఉన్నతాధికారుల మామూళ్ల వేధింపులతో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్న కుకునూరుపల్లి ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి కేసులో ఉన్నతాధికారులు ఎట్టకేలకు ఆరోపణలు ఎదుర్కొంటున్న డిఎస్పీ శ్రీ్ధర్, సిఐ వెంకటయ్య, కానిస్టేబుళ్లపై బదిలీ వేటు వేశారు.

08/21/2016 - 04:23

హైదరాబాద్, ఆగస్టు 20: సెప్టెంబర్ తొలివారంలో శాసనసభ సమావేశాలు నిర్వహించాలని ఏపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈసారి కూడా హైదరాబాద్‌లోనే సమావేశం నిర్వహించాలని, ఆ సమావేశంలోనే జిఎస్‌టి బిల్లును ఆమోదించాలని నిర్ణయించింది.

08/21/2016 - 04:22

హైదరాబాద్/ కాచిగూడ, ఆగస్టు 20: నగరాల్లో విపత్తులు క్రమంగా పెరిగిపోతున్నాయని సెంటర్ ఫర్ రిసోర్స్ ఎడ్యుకేషన్ (సిఆర్‌ఇ) డైరెక్టర్ డాక్టర్ బివి సుబ్బారావు ఆందోళన వ్యక్తం చేశారు.

08/21/2016 - 04:19

హైదరాబాద్, ఆగస్టు 20: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్సెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో శనివారం మరో ఇద్దరు దళారులను సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్లు హర్యానాకు చెందిన మహమ్మద్ ఇక్బాల్ (29), గుంటూరు జిల్లాకు చెందిన గుమ్మడి వెంకటేశ్ (28) విద్యార్థులకు ప్రశ్నపత్రాలు లీక్ చేసినట్టు గుర్తించారు.

08/21/2016 - 04:18

హైదరాబాద్, ఆగస్టు 20: దావూద్ ఇబ్రహీంలా డాన్ అవతారమెత్తాలనుకుని పోలీసుల చేతిలో హతమైన నరుూముద్దీన్‌తో ప్రముఖులకు ఉన్న లింకులపై విచారణ విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఏకాభిప్రాయం కనిపించడం లేదు. ఈ విషయంలో శాసనసభాపక్ష నేత ఒకదారిలో వెళుతుంటే శాసనమండలి నేత, ఇతర ప్రముఖులు అందుకు భిన్నమైన వాదన వినిపిస్తుండటం ఆసక్తికరంగా మారింది.

08/21/2016 - 04:17

మిర్యాలగూడ టౌన్, ఆగస్టు 20: పోలీసు ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ నరుూంకు ఆడశిశువును విక్రయించిన కేసులో ముగ్గురు నిందితులను సిట్ అధికారులు, నల్లగొండ జిల్లా మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సిట్ అధికారులు, వన్‌టౌన్ పోలీసులు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నరుూం అత్త, సుల్తానా, మరో ఇద్దరిని పోలీసు కస్టడీకి తీసుకుని విచారణ జరిపిన అనంతరం ఆడశిశువుల విక్రయం వెలుగు చూసింది.

08/21/2016 - 04:16

హైదరాబాద్, ఆగస్టు 20: ఉగ్రవాది నరుూం తనను ఎప్పుడూ బెదిరించలేదని తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి తెలిపారు. ఎవరూ తనను బెదిరించలేరని అన్నారు. తాను హోంమంత్రిగా ఉన్నప్పుడే నరుూం ఆగడాల గురించి తెలియడంతో వేట మొదలు పెట్టామని ఆయన శనివారం విలేఖరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చెప్పారు. అయితే ఇప్పుడు తుదముట్టించడం జరిగిందని అన్నారు.

08/21/2016 - 04:14

హైదరాబాద్, ఆగస్టు 20: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను కేంద్రం మంజూరు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఆంధప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు, ఈ సందర్భంగా ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేసే విధంగా హైకోర్టు తగిన ఆదేశాలు ఇవ్వాలని తెలుగు సినీనటుడు సొంటినేని శివాజీ పిల్ దాఖలు చేశారు.

Pages