S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/21/2016 - 03:32

విజయవాడ (క్రైం), అగస్టు 20: దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన ‘డిఎన్‌ఏ ఇండెక్స్ సిస్టమ్’ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం ప్రారంభించారు. అత్యాధునిక టెక్నాలజీ ద్వారా కేవలం రెండు గంటల్లోనే డిఎన్‌ఏ శాంపిల్స్ ఫలితాలు తెలుసుకోవచ్చని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. ఇప్పటికే విజయవాడలో రీజనల్ ఫోరెన్సిక్ లేబొరేటరీని కొద్దిరోజుల క్రితం ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా..

08/20/2016 - 07:33

తాడిపత్రి, ఆగస్టు 19: ఉదయించే సూర్యభగవానున్ని కనురెప్పలు కొట్టకుండా ఒక్క క్షణమైనా చూడలేం. అయితే నెల్లూరు జిల్లాకు చెందిన యోగానందస్వామి ఏకబిగిన పది గంటలపాటు కనురెప్పలు కొట్టకుండా సూర్య వీక్షణం చేసి ఔరా అనిపించారు. వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా తాడిపత్రిలోని రమణమహర్షి ఆశ్రమంలో ఉన్న 42 అడుగుల మహాశివుడి భారీ విగ్రహం ఎదుట శుక్రవారం యోగానందస్వామి అలియాస్ సుధాకర్‌రెడ్డి(55) ఈ ప్రక్రియ చేపట్టారు.

08/20/2016 - 06:31

హైదరాబాద్, ఆగస్టు 19: ఎమ్సెట్-2 లీకేజి కేసు కొత్త మలుపు తిరిగింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి, 50 వేల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన మెడికల్ ప్రవేశపరీక్ష లీకేజి కేసులో నిందితుడిని రక్షించడానికి ప్రయత్నించి సిఐడి డిఎస్పీ అడ్డంగా దొరికిపోయాడు.

08/20/2016 - 06:27

హైదరాబాద్, ఆగస్టు 19: సాయంత్రం వేళ, అందరూ మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి కవుల చమత్కారాలు, దేశభక్తి గీతాలు ఆలంకించారు. ఉత్కంఠ భరితమైన మ్యాజిక్ షోను వీక్షించారు. ఇదంతా కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అధ్యక్షతన నగరంలోని హోటల్ మ్యారియట్‌లో శుక్రవారం సాయంత్రం జరిగింది. దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న తిరంగా యాత్రలో భాగంగా బిజెపి రాష్ట్ర శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

08/20/2016 - 06:26

హైదరాబాద్, ఆగస్టు 19: అంటరానితనం రూపుమాపేందుకు, పేదరికాన్ని నిర్మూలించేందుకు, మహిళలపై అత్యాచారాలు నిరోధించేందుకు రెండో క్విట్ ఇండియా ఉద్యమం రావాల్సి ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు.

08/20/2016 - 06:13

హైదరాబాద్, ఆగస్టు 19: దేశవ్యాప్తంగా మెడికల్, డెంటల్ కాలేజీల్లో పూర్తిసీట్లకు, ఎంపిక చేసిన కాలేజీల్లో 15 శాతం సీట్లకు నీట్ ర్యాంకు ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ 22న ప్రారంభం కానుంది. మెయిన్ కౌనె్సలింగ్ రిజిస్ట్రేషన్‌గా వ్యవహరించే ఈ ప్రక్రియ 22 ఉదయం ఒంటి గంట నుంచి 25 సాయంత్రం ఐదు గంటల వరకూ అందుబాటులో ఉంటుంది.

08/20/2016 - 04:59

ఒలింపిక్స్‌లో సిల్వర్ గెలిచిన తొలి మహిళగా రికార్డ్
ఉప్పొంగిన భారతావని
వెల్లువెత్తిన ప్రశంసలు...
నజరానాలు
పసిడి పతకాన్ని కైవసం
చేసుకున్న కరొలినా

అద్భుతంగా పోరాడావు. చారిత్రక విజయాన్ని సాధించావు. ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి రజతాన్ని సాధించిన నీ విజయం చారిత్రాత్మకం.
ఇందుకోసం కనబరిచిన పోరాట పటిమ తరతరాలకూ స్ఫూర్తిదాయకం..
మనసారా అభినందనలు

08/19/2016 - 04:57

హైదరాబాద్, ఆగస్టు 18: ప్రపంచవ్యాప్తంగా విద్యారంగ విస్తరణలో అమలుచేస్తున్న ‘మూక్స్’( మాసివ్ ఆన్‌లైన్ ఓపెన్ కోర్సు)ను సార్వత్రిక విద్యా విధానం ద్వారా తొలిసారిగా భారత్‌లో నిర్వహించేందుకు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే కొన్ని ఐఐటిలు, ఐఐఎంలు మూక్స్ నిర్వహిస్తున్నా, పూర్తిస్థాయిలో నిర్వహించేందుకు అంబేద్కర్ వర్శిటీ సిద్ధమవుతోంది.

08/19/2016 - 04:56

హైదరాబాద్, ఆగస్టు 18: మీడియా మారాలని, మానవత్వాన్ని అలవర్చుకోవాలని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ హితవు పలికారు. గురువారం ఎంతో ఆడంబరంగా రాజ్‌భవన్‌లో నిర్వహించిన రాఖీ పూర్ణిమ కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్ధులతో గవర్నర్ నరసింహన్ కుటుంబం కొద్దిసేపు గడిపింది. వివిధ పాఠశాలలకు చెందిన బాలలు, బాలికలు పెద్దఎత్తున రాజ్‌భవన్‌కు తరలివచ్చి గవర్నర్‌కు రక్షాబంధన్ కట్టారు.

08/19/2016 - 04:40

విజయవాడ (స్పోర్ట్స్), ఆగస్టు 18: రియోడీ జెనీరోలో జరుగుతున్న రియో ఒలింపిక్స్‌లో తెలుగుతేజం పివి సింధు బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో ఫైనల్స్‌కు చేరుకుంది. గురువారం సాయంత్రం జరిగిన సెమీ ఫైనల్స్‌లో జపాన్‌కు చెందిన నజోమీ ఓకుహారాపై అద్భుత విజయం సాధించి ఫైనల్స్‌కు చేరిన భారత షట్లర్‌గా చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్‌లో 135 కోట్ల మంది ఎదురుచూస్తున్న పతకానికి ఒక్క అడుగు దూరంలో సింధు నిలిచింది.

Pages