S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/19/2016 - 02:02

విజయవాడ, ఆగస్టు 18: దళిత, గిరిజన యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పెద్దఎత్తున ‘జాబ్ మేళా’లను నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సాంఘిక గిరిజన సంక్షేమ శాఖల మంత్రి రావెల కిశోర్‌బాబును ఆదేశించారు. ప్రముఖ సంస్థలతో మాట్లాడి రాష్టమ్రంతటా ‘జాబ్ మేలా’లు నిర్వహించాలని సిఎం ఆయన అన్నారు. గుంటూరులోని చౌడవరంలో ఈ నెల 26, 27 తేదీలలో నిర్వహించే జాబ్ మేళా వాల్‌పోస్టర్‌ను సిఎం విడుదల చేశారు.

08/18/2016 - 03:21

హైదరాబాద్, ఆగస్టు 17: క్రీడల్లో ప్రతిభ చూపని వారు కూడా క్రీడల కోటా కింద ఎంబిబిఎస్ కోర్సుల్లో సీటు పొందేందుకు ప్రయత్నం చేయడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీని వల్ల క్రీడారంగం, వైద్య రంగంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతోందని హైకోర్టు పేర్కొంది. కొన్ని క్రీడలను గుర్తిస్తూ ఏపి ప్రభుత్వం 2014 అక్టోబర్ 10వ తేదీన జీవో జారీ చేసింది.

08/18/2016 - 03:27

జి.మాడుగుల, ఆగస్టు 17: రాష్ట్రంలో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. విశాఖ జిల్లాలో ముగ్గురు, గుంటూరు జిల్లాలో ముగ్గురు దుర్మరణం చెందారు. విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం వంజరి ఘాట్‌లో బుధవారం జీపు బోల్తా పడిన సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గిరిజనులు దుర్మరణంపాలయ్యారు. భార్యాభర్తలు, కుమారుడు చనిపోయారు. పదమూడు మందికి తీవ్ర గాయాలయ్యాయి.

08/18/2016 - 02:19

హైదరాబాద్, ఆగస్టు 17: తెలంగాణ రాష్ట్రాన్ని పాలనా సౌలభ్యం కోసం 27 జిల్లాలుగా విభజించాలని మంత్రివర్గ ఉప సంఘం ప్రతిపాదించింది. ప్రస్తుతం ఉన్న పది జిల్లాలతోపాటు కొత్తగా 17 జిల్లాలను ఏర్పాటు చేయాలని సూచించింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రివర్గ ఉప సంఘం బుధవారం ప్రభుత్వానికి నివేదిక అందజేసింది.

08/18/2016 - 02:17

హైదరాబాద్, ఆగస్టు 17: పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా ఐపిఎస్ అధికారి సివి ఆనంద్‌ను నియమించడం వివాదాస్పదంగా మారింది. ఈ నియామకం ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల మధ్య చిచ్చు పెడుతోంది. తమను నియమించాల్సిన పోస్టుల్లో ఐపిఎస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వడం ఏమిటనీ ఐఏఎస్ అధికారులు ప్రభుత్వంపై కినుక వహించారు.

08/18/2016 - 02:24

హైదరాబాద్, ఆగస్టు 17: ప్రాజెక్టుల రీ-డిజైనింగ్, అందులో జరిగిన అవినీతిపై బహిరంగ చర్చకు రావాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌కు టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి సవాల్ విసిరారు. చర్చకు ఎప్పుడైనా, ఎక్కడైనా తాను సిద్ధమన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఐదు నెలల క్రితం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నీటి పారుదల ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

08/18/2016 - 02:34

విజయవాడ: పుష్కర స్నానమాచరించేందుకు విజయవాడకు విచ్చేసిన గవర్నర్ నరసింహన్ సతీసమేతంగా పుణ్యస్నానం ఆచరించారు. పుష్కర భక్తుల కోసం ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను ప్రత్యక్షంగా చూసిన నరసింహన్ ముఖ్యమంత్రి చంద్రబాబును అభినందించారు. పుష్కర స్నానాలతో తరిస్తున్న రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలని గవర్నర్ ఆకాంక్ష వ్యక్తం చేశారు.

08/18/2016 - 02:01

విజయవాడ, ఆగస్టు 17: రాష్ట్రంలో ఈ ఏడాది 15 శాతం వృద్ధి రేటు సాధనకు అన్ని విధాలా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడితో కలిసి ఆర్థిక శాఖపై సమీక్షించారు.

08/18/2016 - 01:57

విశాఖపట్నం, ఆగస్టు 17: తూర్పు తీరంలో ఎగుమతులు, దిగుమతులను నిర్వహించేందుకు ఐరోపా దేశాలు సిద్ధంగా ఉన్నాయి. ఐరోపా దేశాల్లో రెండో అతిపెద్ద పోర్టుగా పేరుగాంచిన బెల్జియంకు చెందిన ఎంట్వెర్ప్ ఇంటర్నేషనల్ పోర్టు ప్రతినిధులు బుధవారం విశాఖ పోర్టును సందర్శించారు.

08/18/2016 - 01:54

హైదరాబాద్, ఆగస్టు 17: రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్‌వద్ద పర్సనల్ సెక్రటరీ (పిఎస్) గా పనిచేస్తున్న ఎం పద్మావతిని బుధవారం అర్థంతరంగా బదిలీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పద్మావతి ఏడాది కాలంగా నవీన్ మిట్టల్ వద్ద పనిచేస్తున్నారు. కమలనాథన్ కమిటీ పరిశీలన తర్వాత పద్మావతిని తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు.

Pages