S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/16/2016 - 01:58

అనంతపురం, ఆగస్టు 15: ‘నా ప్రతి అడుగూ, ప్రతి ప్రయాణం ఆంధ్రప్రదేశ్ పురోభివృద్ధి కోసమే. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యం. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేస్తా. ఇందుకోసం నిద్ర కూడా పోకుండా శ్రమిస్తానని హామీ ఇస్తున్నా. ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శ రాష్ట్రంగా చేద్దాం. మీరంతా నా వెనుక ఉన్నారన్న కొండంత ఆశతో ఉన్నా.

08/16/2016 - 01:56

అనంతపురం, ఆగస్టు 15: ‘తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న అనంతపురం జిల్లా అంటే నాకెంతో ఇష్టం.. దివంగత మాజీ ముఖ్యమంత్రి, అన్న ఎన్టీఆర్‌ను అక్కున చేర్చుకుని ఆదరించిన జిల్లా ఇది. ఈజిల్లా ప్రజలంటే నాకు అత్యంత ప్రేమాభిమానాలున్నాయి. ఇలాంటి జిల్లా వరుస కరవు కాటకాలకు నిలయంగా, క్షామ పీడిత ప్రాంతంగా మారుతోంది. ఈ ప్రాంతాన్ని ఎడారి కానియ్యబోను..

,
08/16/2016 - 01:53

హైదరాబాద్, ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏపి, తెలంగాణ ముఖ్యమంత్రులు కులాల రిజర్వేషన్లపై చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. ఏపిలో ఉన్న నిరుపేద అగ్రకులాల వారికి రిజర్వేషన్లు ఇస్తామని, ఆర్ధిక సాయం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనంతపురంలో జరిగిన స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో ప్రకటించారు.

08/16/2016 - 01:48

విజయవాడ, గుంటూరు, కర్నూలు, ఆగస్టు 15: కృష్ణా పుష్కరాలకు నాలుగో రోజైన సోమవారం కూడా భక్తుల తాకిడి కొనసాగింది. సోమవారం స్వాతంత్య్రదినోత్సవం సెలవుదినం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు పుష్కర స్నానాలకు తరలి వచ్చారు. ఉదయం 11 గంటల సమయానికి భక్తుల రద్దీ బాగా పెరిగింది.

08/15/2016 - 07:34

హైదరాబాద్, ఆగస్టు 14: తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత తెలంగాణ తన అస్తిత్వాన్ని, మూలాలను అనే్వషిస్తూ, ఆవిష్కరించుకుంటోందని తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్‌వి సత్యనారాయణ పేర్కొన్నారు. ద్యావనపల్లి సత్యనారాయణ రాసిన ‘తెలంగాణలో కృష్ణానదీ నాగరికత’ పుస్తకాన్ని హైదరాబాద్ (హిమాయత్‌నగర్) లోని దక్కన్ అకాడమీ భవనమైన ‘చంద్రం’లో ఆదివారం ఆవిష్కరించారు.

08/15/2016 - 07:19

తిరుమల, ఆగస్టు 14: దేశం అభివృద్ధిపథంలో ముందుకు సాగాలంటే ప్రతి పౌరుడు తమవంతు భాగస్వామి కావాలని కేంద్ర న్యాయ, ఐటి శాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం విరామ సమయంలో ఆయన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల విలేఖరులతో మాట్లాడుతూ తిరుమలలో వెలసిన వెంకటేశ్వర స్వామి అత్యంత శక్తివంతుడన్నారు. ఆయన కరుణాకటాక్షాలతోనే మనుగడ సాధ్యమన్నారు.

08/15/2016 - 06:53

హైదరాబాద్, ఆగస్టు 14: ఇతర ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో లాగానే, రాజకీయ పార్టీల కార్యాలయాల్లో ఉద్యోగం చేసే గర్భిణీ స్ర్తిలకు 26 వారాల పాటు సెలవు ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని, పార్టీలు అతీతం కావని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ హెచ్చరించారు. ఏ సంస్థలైనా, పరిశ్రమలైనా, రాజకీయ పార్టీలైనా కార్మిక చట్టాలను తప్పని సరిగా పాటించాలని ఆయన సూచించారు.

08/14/2016 - 08:48

హైదరాబాద్, ఆగస్టు 13: ఆక్రమిత కాశ్మీర్ సైతం భారత్‌లో అంతర్భాగమేనని కేంద్ర సమాచార మంత్రి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు జోరందుకున్నాయని, ప్రధాని నరేంద్రమోదీ సంస్కరణలను వేగవంతం చేశారని దేశ ఆర్థిక వ్యవస్థకు జిఎస్‌టి బిల్లు పెద్ద అండగా ఉంటుందని వెంకయ్య నాయుడు చెప్పారు.

08/14/2016 - 07:59

విశాఖపట్నం, ఆగస్టు 13: ప్రపంచ శాంతి చర్యల్లో భాగంగా భారత నౌకాదళం మరో ముందడుగు వేసింది. ఇండో ఫసిఫిక్ మహా సముద్రంలో యుఎస్ నేవీ నిర్వహిస్తున్న రిమ్‌ప్యాక్ 2016లో భాగంగా హవాయి-్ఫలిప్పీన్స్ మధ్య పసిఫిక్ మహా సముద్రంలో రెండు రోజుల పాటు నిర్వహించే ఎక్స్‌పోలో భారత యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ సత్పుర పాల్గొంది.

08/14/2016 - 07:59

పుంగనూరు, ఆగస్టు 13: బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న తన ఐదేళ్ళ కుమారుడిని చంపుకునేందు(మెర్సీకిల్లింగ్)కు అనుమతి ఇవ్వాలని చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణానికి చెందిన తండ్రి బుడ్డప్ప శనివారం పుంగనూరు కోర్టు ఆవరణలో జరుగుతున్న లోక్‌అదాలత్‌లో మొరపెట్టుకున్నారు.

Pages