S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/10/2016 - 05:08

హైదరాబాద్, ఆగస్టు 9: వాళ్ల భర్తలు నిక్షేపంగా బతికే ఉన్నారు. కొందరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అయినా తమ భర్తలు చనిపోయారని వితంతు పెన్షన్లు తీసుకున్నారు. ఇంకొందరు సకలాంగులయినప్పటికీ, వికలాంగుల పెన్షన్లు తీసుకున్నారు. భర్త బతికుండగనే బాల్చీ తనే్నసినట్లు ధ్రువీకరణ పత్రాలు పుట్టించి, లేని వైకల్యాన్ని కొని తెచ్చుకుని ఎంచక్కా పెన్షన్ పొందుతున్న ఆ వైనం అధికారులనే ఖంగుతినిపించింది.

08/10/2016 - 04:59

హైదరాబాద్, ఆగస్టు 9: తాను లక్ష్యంగా ఎంచుకున్న వారిని జాతీయ స్థాయిలో ముద్దాయిగా నిలబెట్టడంలో చంద్రబాబు గతంలో అనుసరించిన విధానానే్న వైకాపా అధినేత జగన్ ఇప్పుడు పాటిస్తున్నారు. వైఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలపై ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు ఢిల్లీ వేదికగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించిన బాబు, అప్పట్లో జాతీయ పార్టీల మద్దతు కూడగట్టారు. ప్రస్తుతం జగన్ కూడా అదే పద్ధతి పాటిస్తున్నారు.

08/10/2016 - 04:43

హైదరాబాద్, ఆగస్టు 9: ప్రపంచ గిరిజన దినోత్సవంగా ఆగస్టు 9వ తేదీని ఐక్యరాజ్య సమితి గుర్తించినా, తెలుగు రాష్ట్రాలు దానిని పట్టించుకోకపోవడం దారుణమని ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు కేలోత్ శంకర్ నాయక్ , ప్రధానకార్యదర్శి మూడ్ శోభన్ నాయక్‌లు పేర్కొన్నారు. ప్రభుత్వాలు నిర్వహించకున్నా తామే భారీ ర్యాలీ నిర్వహించి గిరిజనోత్సవాన్ని నిర్వహించినట్టు వారు వెల్లడించారు.

08/10/2016 - 04:40

హైదరాబాద్, ఆగస్టు 9: తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణంపై ఒకవైపు ఆంధ్రప్రదేశ్ అడ్డంకులు కల్పిస్తుండగా, మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేస్తూ ప్రాజెక్టులను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. జివో 123ని హైకోర్టు కొట్టివేయడంపై డివిజన్ బెంచ్ స్టే ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్టు మంత్రి తెలిపారు.

08/10/2016 - 04:38

హైదరాబాద్, ఆగస్టు 9: ఇంజనీరింగ్‌లోనూ, డిగ్రీ, పిజి కాలేజీల్లో ఆన్‌లైన్ అడ్మిషన్లు విద్యార్థులను ముప్పుతిప్పలు పెట్టాయి. ప్రభుత్వం ఇంజనీరింగ్ అడ్మిషన్లకు సంబంధించి సమగ్రమైన వివరణాత్మక మార్గదర్శకాలను జారీ చేయకపోవడంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు.

08/09/2016 - 05:10

నాగార్జునసాగర్, ఆగస్టు 8: నాగార్జునసాగర్ జలాశయం నుండి ప్రధాన జల విద్యుత్ కేంద్రంద్వారా సోమవారం కృష్ణాడెల్టాకు జెన్‌కో అధికారులు నీటిని విడుదల చేశారు.

08/09/2016 - 04:41

భద్రాచలం, ఆగస్టు 8: అంత్య పుష్కరాల్లో భాగంగా ఖమ్మం జిల్లా భద్రాచలంలో గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. 9వ రోజు సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో స్నానఘట్టాలు కిక్కిరిశాయి. గోదారమ్మ వందనం అంటూ భక్తులు ప్రణమిల్లారు. పుష్కర స్నానాలు చేసి తర్పణాలు, పిండప్రదానాలు సమర్పించుకున్నారు. శ్రావణ మాసం సందర్భంగానూ మహిళలు గోదావరికి ప్రత్యేక పూజలు చేశారు.

08/09/2016 - 03:50

హైదరాబాద్, అగస్టు 8: గ్యాంగ్‌స్టర్ నరుూం ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. రాత్రి 9 గంటల వరకు సాగిన తనిఖీల్లో భారీ మొత్తంలో నగదు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నరుూం అనుచరులు, కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో జరిగిన గ్యాంగ్‌స్టర్ నరుూం ఎన్‌కౌంటర్ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలోని అతడి ఇంటిని పోలీసులు ముట్టడించి, సోదాలు చేశారు.

08/09/2016 - 03:47

హైదరాబాద్, ఆగస్టు 8: తెలంగాణలో మెడికల్, డెంటల్ కాలేజీల్లో ప్రవేశానికి ఎమ్సెట్-3 నోటిఫికేషన్ విడుదలైంది. ఎమ్సెట్-2 పేపర్ లీక్ కావడంతో మరో మారు సెప్టెంబర్ 11న ఎమ్సెట్ -3ని నిర్వహిస్తున్నారు. పరీక్ష నిర్వహించిన వారం రోజుల్లో ఫలితాలు విడుదల చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు కన్వీనర్ ప్రొఫెసర్ యాదయ్య తెలిపారు.

08/09/2016 - 03:46

హైదరాబాద్, ఆగస్టు 8: రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లో అటవీ భూములు ఉన్నప్పటికీ వాటిలో ఎక్కడా అడవులు లేవని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మాత్రమే ఇంకా అడవి మిగిలి ఉందని, మిగిలిన కొద్దిపాటి అడవిని సంరక్షించడానికి అటవీశాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Pages