S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/19/2016 - 07:51

విశాఖపట్నం, జూన్ 18: డిగ్రీ కళాశాలలు, వర్సిటీల్లో అధ్యాపక నియామకాలకు సంబంధించి అర్హత పరీక్ష, ఎపిసెట్-2016 (ఎపి స్టేట్ ఎలిజిబిలిటీ టెస్టు) నోటిఫికేషన్‌ను ఈ నెల 22న విడుదల చేయనున్నారు. పరీక్షను సెప్టెంబర్ 11న నిర్వహించనున్నారు.

06/19/2016 - 07:51

హైదరాబాద్, జూన్ 8: మహిళల వేధింపులకు కళ్లెం వేస్తూ, ఈవ్ టీజింగ్‌కు పాల్పడే వారిని అదుపులోకి తీసుకొని కౌనె్సలింగ్ ఇస్తూ, సెల్‌ఫోన్లలో అసభ్యకర చిత్రాలు, మెసేజ్‌లు పంపేవారికి శిక్ష పడేలా హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా చేపట్టిన ‘షీ’టీమ్స్ మంచి ఫలితాలనిస్తోంది.

06/19/2016 - 07:50

హైదరాబాద్, జూన్ 18: బురిడీ బాబా శివతోపాటు మరో ఇద్దరు నిందితులకు మెట్రోపాలిటన్ కోర్టు 14 రోజులు జుడిషియల్ రిమాండ్ విధించింది. ఇటీవల బంజారాహిల్స్‌లోని రియల్టర్ మధుసూదన్‌రెడ్డి ఇంట్లో పూజల పేరుతో రూ. 1.30 కోట్లతో శివబాబా ఉడాయించిన విషయం తెలిసిందే. శుక్రవారం దొంగబాబాను అరెస్టు చేసిన పశ్చిమ మండల వెస్ట్‌జోన్ పోలీసులు విచారించి అతని నుంచి 1.19కోట్లు స్వాధీనం చేసుకున్నారు.

06/19/2016 - 06:55

భిక్కనూరు, జూన్ 18: ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాల్లో ఒక మార్కు తక్కువ రావడంతో అర్హత సాధించలేకపోయానన్న బెంగతో తీవ్ర మనస్తాపానికి గు రైన ఒక విద్యార్థిని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నిజామాబాద్ జి ల్లా భిక్కనూరు మండలం తలమడ్ల గ్రామంలో శనివారం జరిగింది. కామారెడ్డి మండలం అడ్లూర్ గ్రామానికి చెందిన డిఇడి విద్యార్థిని ముదాం సుస్మిత ఇటీవల జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాసింది.

06/19/2016 - 03:04

హైదరాబాద్, జూన్ 18: టిఎస్‌ఐపాస్ ద్వారా పెద్ద ఎత్తున పరిశ్రమలు తెలంగాణకు వస్తున్నాయని, దీనివల్ల ఉపాధి అవకాశాలు మెరుగు పడుతున్నట్టు ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. ఏడాదిలో పరిశ్రమల శాఖ సాధించిన అభివృద్ధిని శనివారం విలేఖరుల సమావేశంలో కెటిఆర్ వెల్లడించారు.

06/19/2016 - 03:06

తొగుట, జూన్ 18: మల్లన్న సాగర్ ఏర్పాటును నిరసిస్తూ గ్రామస్థులంతా ఆందోళన చేస్తుంటే గ్రామానికి చెందిన కొందరు భూములను రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారని ఆరోపిస్తూ ఆగ్రహించిన మహిళలు వారి పంటలను ధ్వంసం చేసి, డ్రిప్ పైప్‌ను దగ్ధం చేసిన సంఘటన తొగుట మండలం ఏటిగడ్డకిష్టాపూర్‌లో శనివారం నాడు జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు పంట భూముల్లోకి వెళ్లి మొక్కజొన్నను పీకివేశారు. డ్రిప్‌పైప్‌లు దగ్ధంచేశారు.

06/19/2016 - 03:05

హైదరాబాద్, జూన్ 18: నిజాంసాగర్ ఆధునీకరణకు ప్రభుత్వం 115 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. రెండు లక్షల 32 వేల ఎకరాలకు సాగునీటిని అందించాల్సిన నిజాంసాగర్ ఆధ్వాన్న పరిస్థితిలో ఉంది. గతంలో ఈ ప్రాజెక్టు ఆధునీకరణకు 549 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇప్పుడది 742 కోట్ల రూపాయలకు పెరిగింది. నిజాం హయాంలో మంజీరా నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టుకు పూర్వవైభవం తీసుకు రావడానికి ఆధునీకరణ పనులు చేపట్టారు.

06/19/2016 - 02:25

హైదరాబాద్, జూన్ 18: టాటా-బోయింగ్ ఏరో స్పెస్ యూనిట్‌కు కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ శనివారం శంకుస్థాపన చేశారు. దేశంలో ప్రతిష్టాత్మకమైన టాటా కంపెనీ, వందేళ్లు పూర్తిచేసుకున్న బోయింగ్ కంపెనీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఏరో స్పేస్ యూనిట్‌ను రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో ప్రారంభించారు. రెండు నెలల్లో రక్షణ రంగ ఉత్పత్తులను ఈ యూనిట్ ప్రారంభిస్తుందని పారికర్ అన్నారు.

06/19/2016 - 02:24

విశాఖపట్నం/ న్యూఢిల్లీ, జూన్ 18: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శనివారం రాత్రి తెలిపారు. కోస్తాంధ్రలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

06/19/2016 - 02:46

విజయవాడ, జూన్ 18: మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రభుత్వ ప్రయోజనాలను నిజమైన లబ్ధిదారులకు చేర్చడం కోసమే స్మార్ట్ పల్స్ సర్వే నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఇది ప్రజలందరి సంపూర్ణ వివరాలకోసం చేపడుతున్న సర్వే అని, సంక్షేమ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాబోదన్నారు.

Pages