S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/17/2016 - 04:40

కర్నూలు, జూన్ 16: కర్నూలు నగరానికి సమీపంలోని ఓర్వకల్లు వద్ద నిర్మించతలపెట్టిన విమానాశ్రయానికి త్వరలో టెండర్లు పిలవనున్నట్లు అధికార వర్గాల సమాచారం. రానున్న రెండేళ్లకాలంలో నిర్మాణం పనులు పూర్తిచేసి 2018 మే నెలలో విజయవాడకు తొలి విమానం నడపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.

06/17/2016 - 04:39

హైదరాబాద్, జూన్ 16: సాగునీటి ప్రాజెక్టుల కోసం 123 జీవో కింద భూములు ఇవ్వాలని రైతులపై ఎందుకు వత్తిడి తెస్తారంటూ హైకోర్టు గురువారం తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

06/17/2016 - 04:36

హైదరాబాద్, జూన్ 16:వైసీపీ నుంచి వలసలను ప్రోత్సహించి జగన్‌కు ఝలక్ ఇచ్చిన తెలుగుదేశం నాయకత్వానికి ఇప్పుడు బదిలీల వ్యవహారం తలనొప్పిలా పరిణమించింది. 20 నియోజకవర్గాల నుంచి చేరిన వైసీపీ ఎమ్మెల్యేలకు, అంతకుముందు నుంచే పార్టీలో పనిచేస్తున్న ఇన్చార్జిలకు బహిరంగయుద్ధం జరుగుతుండటంతో..బదిలీల విషయంలో ఎవరి మాటకు ప్రాధాన్యం ఇవ్వాలో తెలియక టిడిపి నాయకత్వం తలపట్టుకుంది.

06/17/2016 - 04:23

గుంటూరు, జూన్ 16: చిత్తూరు జిల్లా పలమనేరు వైసిపి ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి, గురువారం రాత్రి ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు. సిఎం చంద్రబాబు అమరనాథ్‌రెడ్డికి పచ్చకండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అమరనాథ్‌రెడ్డి మాట్లాడుతూ టిడిపి ఆవిర్భావం నుంచి తాను పార్టీలో పనిచేసినట్లు గుర్తుచేశారు.

06/17/2016 - 04:21

రాజమహేంద్రవరం/కాకినాడ, జూన్ 16: దాదాపు పరిష్కారమైనట్టు కనిపించిన కాపు ఉద్యమనేత ముద్రగడ ఆమరణ దీక్ష వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. బుధవారం అధికారులు, కాపుజెఎసి నేతల ఆధ్వర్యంలో జరిగిన చర్చల అనంతరం వైద్యసేవలకు ముద్రగడ అంగీకరించిన సంగతి విదితమే.

06/17/2016 - 04:19

విజయవాడ, జూన్ 16: తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ పిల్లలను క్రమశిక్షణతో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఉంగుటూరు మండలం, ఆత్కూరు గ్రామంలో స్వర్ణ్భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం జిల్లాలోని అన్ని మండలాల్లో పదవ తరగతిలో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థులకు ప్రతిభకు పురస్కార ప్రదాన కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

06/17/2016 - 04:17

పాడేరు, జూన్ 16: విశాఖ జిల్లా పాడేరు అడిషనల్ పోలీస్ సూపరింటెండెంట్ (ఎఎస్‌పి) కె.శశికుమార్ (28) గురువారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన ఇంట్లోనే సర్వీస్ రివాల్వర్‌తో తలపై కుడిభాగాన చెవివద్ద కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఎఎస్పీ ఆత్మహత్య ఘటన విశాఖ గిరిజన ప్రాంతంలో తీవ్ర సంచలనం రెక్కిత్తించగా పోలీసు అధికారుల్లో అలజడి సృష్టించింది.

06/16/2016 - 08:24

మంగళగిరి, జూన్ 15: ప్రభుత్వ అసమర్థత వలనే గడిచిన ఏడాదిన్నరగా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ఆచార్య నాగార్జునా విశ్వవిద్యాలయం ఎదుట మంగళగిరి మండలం కాజ గ్రామ పరిధిలో బుధవారం అగ్రిగోల్డ్ ఏజంట్స్ అండ్ కస్టమర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యాన బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన పోరుదీక్షలో ఆయన మాట్లాడారు.

06/16/2016 - 08:13

హైదరాబాద్, జూన్ 15: ముద్రగడ దీక్షను అడ్డుపెట్టుకుని ప్రాబల్యం కోల్పోయిన కాపు ప్రముఖులు తమ ఇమేజ్ పెంచుకోవాలన్న ఎత్తుగడతో ఉన్నారా? మరికొందరు ముద్రగడ భుజంపై తుపాకి పెట్టి బాబుకు గురిపెట్టారా? వారి కలయిక వల్ల కులానికి నష్టమే తప్ప లాభం లేదా? అధికారంలో ఉన్నప్పుడు కనిపించని వీళ్లంతా ఇప్పుడు గళం విప్పడాన్ని సొంత సామాజికవర్గమే నమ్మడం లేదా?

06/16/2016 - 06:31

హైదరాబాద్, జూన్ 15: ప్రమాదాలు,దుర్ఘటనలపై నియమితమయ్యే దర్యాప్తు సంఘాలు సకాలంలో విచారణ పూర్తి చేసి నివేదికలందిస్తేనే..తదుపరి నివారణ, నిరోధక చర్యలకు ఆస్కారం ఉంటుంది. నత్తనడకగా, మొక్కుబడి చందంగా సాగే విచారణల వల్ల తదుపరి ముందు జాగ్రత్త చర్యలకూ ఆస్కారం ఉండదు.

Pages