S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/15/2016 - 08:28

హైదరాబాద్, జూన్ 14: రాజకీయ, ఆర్ధిక రంగాల్లో బలంగా ఉన్న ప్రకాశం జిల్లాలో అధికార-ప్రతిపక్ష పార్టీల్లో ముఠాల ముసలం మొదలయింది. తెలుగుదేశం, వైఎస్సార్‌సీపీలో ముఠా రాజకీయాలు అధినాయకత్వాలకు తలనొప్పిగా మారాయి. వారిని నియంత్రించలేని పరిస్థితి అధినేతలకు ఎదురవుతోంది.

06/15/2016 - 08:25

హైదరాబాద్, జూన్ 14: సెల్‌ఫోన్‌లోనే ఐఐటి శిక్షణ పొందే అవకాశాన్ని ఒక యువకుడు హైదరాబాద్‌లో రూపొందించాడు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సబ్జెక్టు నిపుణులను, ఐఐటిపై ఆసక్తి ఉన్న విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఐఐటిజెఇఇ ఫోరం పేరిట వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేసిన ఈ యువకుడు ఉచితంగా ఐఐటి శిక్షణను సంవత్సరం పొడవునా పొందే వీలుకల్పించారు.

06/15/2016 - 08:23

రాజమహేంద్రవరం, జూన్ 14: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో కొనసాగిస్తున్న ఆమరణ దీక్ష మంగళవారానికి ఆరో రోజుకు చేరుకుంది. ఆయన ఆరోగ్యం ఒక పక్క బాగా క్షీణిస్తుండగా, మరోపక్క సమస్య పరిష్కారానికి కోసం అధికారుల అధ్వర్యంలో చర్చలు మొదలయ్యాయి. ముద్రగడ సతీమణి, కోడలు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

06/15/2016 - 04:30

హైదరాబాద్, జూన్ 14: అనుభవం అయితే గానీ తత్వం బోధపడదన్న విషయా న్ని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిదానంగా గ్రహిస్తున్నారు. జూన్ 27 కల్లా హైదరాబాద్ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులంతా, వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయానికి తరలి రావలసిందేనని సీఎం హుకుం జారీ చేశారు.

06/15/2016 - 04:26

హైదరాబాద్, జూన్ 14 : నైరుతీ రుతుపవనాలు ఇప్పటికే తెలంగాణ, కోస్తాంధ్ర జిల్లాలను చుట్టుముట్టి మహారాష్టల్రోకి విస్తరించాల్సి ఉన్నా, అది జరగలేదు. సాధాణంగా అరేబియా సముద్రం, బంగాళాఖాతం వైపు నుండి తేమ రావలసి ఉంటుందని, అదే సమయంలో గాలుల వేగం 15 నుండి 20 నాట్స్‌తో ఉండాలని హైదరాబాద్‌లోని ఐఎండి శాస్తవ్రేత్త నాగరత్న తెలిపారు.

,
06/14/2016 - 06:43

విజయవాడ, జూన్ 13:అమరావతిలో అన్నీ రికార్డులే నెలకొంటున్నాయి. రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా 33వేల ఎకరాల భూములనివ్వడం ఓ రికార్డయితే, 60 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణం గల సచివాలయ భవనాన్ని 150నుంచి 200 రోజుల్లో నిర్మాణం కానుంది. ఇది మరో రికార్డు. వెలగపూడిలో నిర్మాణంలో ఉన్న తాత్కాలిక సచివాలయం భవనాన్ని చూసిన వారెవరికైనా అక్కడ చీమల దండులా శ్రమిస్తున్న కార్మికులను చూసి ముక్కున వేలేసుకోవలసిందే.

06/14/2016 - 05:57

భద్రాచలం, జూన్ 13: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో సోమవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మడకం ఇడమా అనే మహిళా మావోయిస్టు మృతి చెందింది. సుక్మా జిల్లా కుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని గోంపాడు గ్రామం వద్ద కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

,
06/14/2016 - 05:49

భీమవరం, జూన్ 13: రొయ్యల సంక్షోభంలో తెరపైకి వచ్చిన పండుగప్ప చేపల పెంపకం దేశవిదేశాల్లో ఎనలేని డిమాండుతో రైతులకు సిరులు కురిపిస్తోంది. చేపల్లో రారాజుగా పిలిచే పండుగప్ప పేరుచెబితేనే మాంసాహారులు లొట్టలేస్తుంటారు. ఎంత ధరకైనా కొనుగోలు చేయడానికి వెనుకాడరు. అయితే పెంపకానికి రైతులు ఆసక్తి చూపుతున్నా, సరిపడేంత సీడ్ లభ్యంకాక డిమాండుకు తగినంత ఉత్పత్తి జరగడంలేదు.

06/14/2016 - 05:45

హైదరాబాద్, జూన్ 13: హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో మున్సిపల్ మంత్రి టి.తారకరామారావు సోమవారం అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆయన ఇదివరకే అధికారులకు సూచించిన వంద రోజుల ప్రణాళిక పనులు క్షేత్ర స్థాయిలో జరుగుతున్న తీరును తనిఖీ చేశారు.

06/14/2016 - 05:42

హైదరాబాద్, జూన్ 13: హైకోర్టును విభజించి ప్రత్యేకంగా తెలంగాణకు హైకోర్టు ఏర్పాటు చేయాలని, ఆప్షన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ న్యాయవాదుల జెఎసి ఇచ్చిన ‘చలో హైకోర్టు’ పిలుపు ఉద్రిక్తతకు దారి తీసింది. సోమవారం పలు కోర్టుల న్యాయవాదులు విధులు బహిష్కరించి హైకోర్టు 6వ గేట్ వద్ద ఆందోళనకు దిగారు.

Pages