S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/12/2016 - 05:17

హైదరాబాద్, జూన్ 11: ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత నిరుపేద 32 వెనుకబడిన కులాలకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎపి కార్పొరేషన్ ఫర్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ మోస్టు బ్యాక్‌వర్డు క్లాసెస్ పేరిట ఈ కార్పొరేషన్ ఏర్పాటవుతోంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం జిఓ 17 జారీ చేసింది. ఇందులో పలు సంచార జాతులను, విముక్త జాతులను చేర్చారు.

06/12/2016 - 05:15

రాజమహేంద్రవరం, జూన్ 11: రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్యశాలలో దీక్ష కొనసాగిస్తున్న ముద్రగడ ఆరోగ్యం క్షీణిస్తోంది. మూడురోజులుగా వైద్య సహాయాన్ని నిరాకరిస్తున్న ముద్రగడ శనివారం రాత్రి పొద్దుపోయాక వైద్య సేవలకు అంగీకరించారు. దీంతో వైద్యులు ఆయనకు ఫ్లూయిడ్స్ ఎక్కించడం ప్రారంభించారు. శనివారం నాటికి ముద్రగడ దీక్ష మూడోరోజుకు చేరింది.

06/12/2016 - 05:13

కాకినాడ/ఏలూరు, జూన్ 11: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నిరాహారదీక్ష నేపథ్యంలో ఆందోళనకారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో శనివారం కాపుల బంద్ ప్రభావం ఎక్కడా కనిపించకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. కాకినాడ సహా అన్ని చోట్లా పోలీసులు మోహరించారు. మారుమూల ప్రాంతాల్లో సైతం బలగాలను గస్తీలో ఉంచారు.

06/12/2016 - 05:11

విజయవాడ, జూన్ 11: రహదారులు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి తన కార్యాలయంలో శనివారం ఆర్ అండ్ బి అధికారులో సమీక్ష నిర్వహించారు. అధునాతన సాంకేతిక విధానాలను అమలు చేసి రాష్ట్రంలో రహదారి వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించాలని ఆయన కోరారు.

06/12/2016 - 05:01

విజయవాడ, జూన్ 11: రాష్టంలో 13 జిల్లాలు, జలవనరుల ప్రధాన ప్రాజెక్ట్‌లతో అనుసంధానమైన అత్యాధునిక వ్యవస్థతో కూడిన వీడియోకాన్ఫరెన్స్ విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ప్రారంభించారు.

06/12/2016 - 04:58

విజయవాడ, జూన్ 11: కృష్ణా జలాల విషయంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న విభేదాలపై సుప్రీంకోర్టులో అనుసరించాల్సిన వైఖరిపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఎకె గంగూలీతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. విజయవాడలోని సిఎం కార్యాలయంలో గంగూలీ ముఖ్యమంత్రిని కలిశారు. శ్రీశైలం దగ్గర కృష్ణానదిపై చేపట్టిన పాలమూరు, రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాల వివరాలను సిఎం గంగూలీకి వివరించారు.

06/11/2016 - 07:59

హైదరాబాద్, జూన్ 10: వందేళ్లు నిండుతున్న ఉస్మానియా యూనివర్శిటీకి గత రెండేళ్లుగా వైస్ చాన్సలర్ కరవుయ్యారు. 1917లోప్రారంభమైన ఉస్మానియా యూనివర్శిటీ కొద్ది నెలల్లో వందేళ్ల పండుగను చేసుకోబోతోంది. ఆ తరుణంలో కూడా వైస్ చాన్సలర్ నియామకం జాప్యం చేయడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే అత్యంత పురాతనమైన వర్శిటీల్లో ఉస్మానియా ఒకటి కాగా, హైదరాబాద్ స్టేట్‌లో తొలి విశ్వవిద్యాలయం.

06/11/2016 - 07:58

తిరుమల, జూన్ 10: తిరుమలలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. గురువారం అర్థరాత్రి 12.30 గంటల సమయంలో రింగ్ రోడ్డులోని హంపి మఠం అవరణలో ఓ చిరుతపులి సంచరించింది. చిరుతపులి సంచరించిన దృశ్యాలు శుక్రవారం ఉదయం రోజువారి విధుల్లో భాగంగా సిసి టివి పుటేజీని పరిశీలిస్తున్న హంపి మఠం సిబ్బంది కొనుగొన్నారు.

06/11/2016 - 07:55

హైదరాబాద్, జూన్ 10: సమస్యలను కూడా అవకాశంగా తీసుకుని ముందుకు వెళ్లే అధినేత ఆలోచనా శక్తి రానురాను మందగిస్తోందా? సమస్యలను పరిష్కరించుకోవలసిన కాలంలో అధినాయకత్వం కొత్త సమస్యలు సృష్టించుకుంటోందా? సాక్షి చానెల్ ప్రసారాలను తామే నిలిపివేయించామన్న మంత్రుల ప్రకటనపై తెలుగుదేశం నేతల అభిప్రాయమిది.

06/11/2016 - 06:37

హైదరాబాద్, జూన్ 10: మొత్తం పది మార్కెట్ కమిటీలకు పాలక వర్గాలను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు మొత్తం 51 మార్కెట్ కమిటీలకు పాలక వర్గాల నియామకం పూర్తయింది. రాష్ట్రంలో మొత్తం 168 మార్కెట్ కమిటీలు ఉండగా, వీటిలో 51 మార్కెట్ కమిటీలకు నియామకాలు పూర్తి కాగా, మిగిలిన 117 మార్కెట్ కమిటీలకు వరుసగా నియమాకాలు చేపట్టనున్నారు.

Pages