S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/11/2016 - 06:26

విజయవాడ, జూన్ 10: త్వరలో రానున్న కృష్ణా పుష్కరాలు రాష్ట్ర నూతన రాజధాని గౌరవాన్ని పెంచేలాగా చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపేర్కొన్నారు. కృష్ణ నదీపరీవాహక ప్రాంతంలో ఉన్న మూడు జిల్లాలోని 16 మండలాల్లో ఉన్న 81 ఘాట్స్‌ల్లో భక్తులకు సకల సదుపాయాలను కల్పించటమే కాకుండా సుందీకరణ, అలంకరణాలతో అద్భుతమైన శోభను తీసుకురావాలని నిర్ధేశించారు.

06/11/2016 - 06:07

హైదరాబాద్, జూన్ 10: కోర్టు ధిక్కారం కేసు కింద హైకోర్టు సింగిల్ జడ్జి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఐఎఎస్ అధికారులకు విధించిన జరిమానా, శిక్షలను సస్పెండ్ చేస్తూ హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. మార్కెటింగ్ శాఖ కమిషనర్ శరత్, రంగారెడ్డి కలెక్టర్ రఘునందన్, మహబూబ్‌నగర్ కలెక్టర్ శ్రీదేవి తమపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ హైకోర్టు ధర్మాసనం వద్ద పిటిషన్ దాఖలు చేశారు.

06/11/2016 - 06:03

హైదరాబాద్, జూన్ 10: హైదరాబాద్ సచివాలయంలో శాఖల వారీ తరలింపు కార్యాచరణ శుక్రవారం మొదలైంది. సచివాలయంలో వివిధ శాఖలకు సంబంధించిన రికార్డులు, ఇతర ప్రభుత్వ ఆస్తులు ఎవరి ఆధీనంలో ఉన్నాయో రికార్డు చేశారు. తర్వాత ఒక్కో శాఖ తమ రికార్డులతో సహా వెలగపూడికి మారుతుంది. అలాగే శాఖాధిపతుల కార్యాలయాలు విజయవాడ, గుంటూరు నగరాల్లో గుర్తించిన భవనాల్లోకి తరలిస్తారు.

06/10/2016 - 08:14

హైదరాబాద్, జూన్ 9:ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లోని ఏపి సచివాలయాన్ని తెలంగాణ ప్రభుత్వానికి స్వాధీనం చేస్తున్నారా? అక్కడ అరబ్ దేశానికి చెందిన కంపెనీ తెలంగాణ ప్రభుత్వం కోసం భారీ భవనాలను నిర్మించనుందా? ఆ మేరకు బాబు సర్కారు అంగీకరించిందా? ఇది ఏపి ఉద్యోగులను బలవంతంగా విజయవాడకు తరలించే వ్యూహంలో భాగమేనా?

06/10/2016 - 08:13

హైదరాబాద్, జూన్ 9: తలలు అంటుకుని జన్మించిన అవిభక్త కవలలు వీణావాణిల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఆపరేషన్ చేస్తే ముప్పేనని ఎయిమ్స్ వైద్యులు తేల్చటం.. ఖర్చుతో కూడుకున్న వీరి పోషణ తాము భరించలేమని తల్లిదండ్రులు మొరపెట్టుకోవటంతో ఈ కవలల పరిస్థితి దయనీయంగా మారింది.

06/10/2016 - 08:04

హైదరాబాద్, జూన్ 9: కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులపై అధ్యయనం కోసం తెలంగాణ ప్రభుత్వ పక్షాన ప్రత్యేక బృందం శుక్ర శనివారాల్లో రెండు రోజుల పాటు కర్నాటకలో పర్యటిస్తుంది. కృష్ణా జలాల పునః పంపిణీకి సంబంధించి సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నందున ఈ అధ్యయనానికి శ్రీకారం చుడుతున్నారు.

06/10/2016 - 08:03

హైదరాబాద్, జూన్ 9: నిఖిల్‌రెడ్డి అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కాళ్లు ఎత్తు పెంచడానికి అనైతికంగా, అశాస్ర్తియ పద్ధతిలో ఆపరేషన్ చేసిన గ్లోబల్ ఆస్పత్రి సిఇఓ శివాజీ చటోపాధ్యాయ, డాక్టర్ చంద్రభూషణ్‌లపై క్రిమినల్ కేసులు నమోదుచేయాలని బిజెపి శాసనసభాపక్ష నాయకుడు జి కిషన్‌రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను డిమాండ్ చేశారు.

06/10/2016 - 08:02

హైదరాబాద్, జూన్ 9: దక్షిణ మధ్య రైల్వేలో సమ్మె సైరన్ మోగింది. జూలై 11 ఉదయం గం. 6.00ల నుంచి సమ్మె చేస్తున్నట్టు రైల్వే కార్మిక సంఘాలు గురువారం మధ్యాహ్నం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తాకు సమ్మె నోటీసు ఇచ్చాయి. ఏడో వేతన సంఘం సిఫారసులు అమలు చేయాలని, కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ, పాత పెన్షన్ విధానానే్న అమలు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి.

06/10/2016 - 07:59

హైదరాబాద్, జూన్ 9: పార్టీ-ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టడంలో నాయకుల నిరాసక్తతపై తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకత్వం అసంతృప్తితో ఉంది. చివరకు కీలకమైన అంశాలు, ఆరోపణలపై సైతం నేతలు నిద్ర వీడకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. కొన్ని అంశాల్లో పైచేయి సాధిస్తున్నప్పటికీ, ముఖ్యమైన అంశాల్లో ఎదురుదాడి పెంచకపోవడంపై పార్టీ విశే్లషణ విభాగం పెదవి విరిచింది.

06/10/2016 - 07:58

హైదరాబాద్, జూన్ 9: ప్రైవేట్ బస్సుల అక్రమ రావాణాను నియంత్రించకపోతే అడ్డుకుంటామని టిఎస్‌ఆర్టీసి ఎంప్లారుూస్ యూనియన్ హెచ్చరించింది. ఈ మేరకు గురువారం రాత్రి ఎల్‌బి నగర్, ఆరాంఘర్ చౌరస్తాలో కొన్ని ప్రైవేటు వాహనాలను అడ్డుకోవడం జరిగిందని యూనియన్ నాయకులు ఎస్ బాబు, కె రాజిరెడ్డి తెలిపారు.

Pages