S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/10/2016 - 07:57

హైదరాబాద్, జూన్ 9: వైద్యులు తమ సేవల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని, పదే పదే విధులకు గైర్హాజరయ్యే వైద్యులపై కఠిన చర్యలు తప్పవని వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైద్యుల బదిలీలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని గురువారం నాడు ఆయన హైదరాబాద్‌లో పాత్రికేయులతో మాట్లాడుతూ చెప్పారు.

06/10/2016 - 07:56

హైదరాబాద్, జూన్ 9: దేశంలో ఉన్న మైనింగ్ సంస్థలు అన్నింటికీ రేటింగ్ ఇచ్చే వ్యవస్థను వచ్చే నెల నుండి ప్రారంభిస్తామని కేంద్ర గనుల శాఖ కార్యదర్శి బల్విందర్ కుమార్ తెలిపారు. మైనింగ్ సంస్థలకు రేటింగ్‌ను ఇవ్వడం కోసం కావలసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్మార్టు గవర్నమెంట్ అందించనుంది.

06/10/2016 - 07:56

విజయవాడ, జూన్ 9: రాష్ట్రంలో పేదలకు దేవుని దర్శనాన్ని మరింత సులభంగా, ఉచితంగా జరిపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దివ్య దర్శనం పేరుతో ప్రభుత్వం చేపడుతున్న ఈ వినూత్న పథకం వలన చాలా మంది నిరుపేదలు తిరుమల వెంకన్న స్వామి దగ్గర నుంచి మిగిలిన దేవుళ్లందరినీ పైసా ఖర్చు లేకుండా దర్శించుకోవచ్చు. దీనికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది.

,
06/10/2016 - 07:53

చింతూరు, జూన్ 9: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కొండాగావ్ జిల్లాలో ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి) క్యాంపుపై మావోయిస్టులు బుధవారం అర్థరాత్రి మెరుపుదాడి చేశారు. భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని రాకెట్ లాంచర్లు, కాల్పులతో విరుచుకుపడ్డారు. భద్రతా బలగాలు వ్యూహాత్మకంగా వ్యవహరించి, మావోయిస్టుల దాడిని తిప్పికొట్టారు.

06/10/2016 - 06:14

హైదరాబాద్, జూన్ 9: కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడంవల్ల ప్రభుత్వంపై సుమారు రూ. 2వేల కోట్ల వరకు భారం పడనున్నట్టు అధికారులు వేసిన ప్రాథమిక అంచనాలో తేలినట్టు తెలిసింది. కొత్త జిల్లాలు 14 నుంచి 15 వరకు ఏర్పాటు చేయడానికి భవనాల నిర్మాణానికే జిల్లాకు రూ. 100 కోట్ల చొప్పున విడుదల చేయనున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ లెక్క ప్రకారమే దాదాపురూ.

06/10/2016 - 06:12

హైదరాబాద్, జూన్ 9: నష్టాల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్ ఆర్టీసి)ను గట్టెక్కించి లాభాలబాటలో నడపించడం పట్ల ముఖ్యమంత్రి దృష్టి సారించారు. డీజిల్ ధరలు పెరగడం, ఆక్యుపెన్సీ రేటు తగ్గడంతో కష్టాల్లో పడిన ఆర్టీసీని గట్టెక్కించేందుకు చార్జీలు పెంచడమా? లేక ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అనే్వషించాలా? అనే అంశంపై ముఖ్యమంత్రి కసరత్తు ప్రారంభించారు.

06/10/2016 - 06:10

ఖమ్మం, జూన్ 9: రాష్ట్రంలో విద్యావ్యవస్థను పటిష్ఠం చేసేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖామంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. గురువారం ఖమ్మంలో విలేఖరులతో మాట్లాడుతూ విద్య వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్యను అందించేందుకు 20కోట్లను వెచ్చించనున్నామన్నారు. 1.50లక్షల మంది పేద విద్యార్థులు నాణ్యమైన విద్య అందనుందన్నారు.

06/10/2016 - 06:07

హైదరాబాద్, జూన్ 9: మిషన్ భగీరథకు ఈ ఆర్థిక సంవత్సరం 2,200 కోట్ల రూపాయల రుణం అందించేందుకు నాబార్డ్ ముందుకు వచ్చింది. గత సంవత్సరం 1,976 కోట్లు మంజూరు చేశారు. దీంతో మిషన్ భగీరథకు ఇప్పటివరకు నాబార్డ్ 4,176 కోట్ల రూపాయల రుణ సహాయం అందించేందుకు అంగీకరించినట్టు అయింది. మొదటి విడత 1,976 కోట్ల రూపాయలు మంజూరు చేసి, నిధులను విడుదల కూడా చేశారు. రెండవ విడత మొత్తాన్ని త్వరలోనే విడుదల చేయనున్నారు.

06/10/2016 - 06:05

హైదరాబాద్, జూన్ 9: తెలంగాణ రాజకీయ జెఎసి రాజకీయ పార్టీ రూపు దాలుస్తుందా? రాజకీయ పక్షాలన్నింటిలో ఇదే చర్చ సాగుతోంది. కోదండరామ్ వ్యాఖ్యలపై టిఆర్‌ఎస్ నేతలు అనూహ్యంగా పెద్దయెత్తున దాడి ప్రారంభించడానికి కారణం కూడా ఇదేనని విశే్లషకులు అంటున్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో టిజెఎసి అంటే తెలంగాణలోని రాజకీయ పక్షాలన్నింటి రూపం.

06/10/2016 - 05:56

విశాఖపట్నం, జూన్ 9: కేరళ తీరాన్ని బుధవారం తాకిన నైరుతి రుతుపవనాలు మరింతగా పురోగమించి గురువారం నాటికి ఆంధ్ర రాష్ట్రాన్ని పలకరించాయి. ఇవి అనంతపురం, ఒంగోలు వరకూ విస్తరించినట్లు వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. కోస్తా, రాయలసీమ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోకి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ఇవి విస్తరించాయి. శుక్రవారం నాటికి కోస్తా, రాయలసీమల్లో మరింతగా విస్తరించవచ్చునని తెలిపారు.

Pages