S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/10/2016 - 05:55

విజయవాడ, జూన్ 9:రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో ప్రతిష్ఠంభన నెలకొంది. జూన్ ఒకటి నుంచి 15వ తేదీలోగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను బదిలీ చేయాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ఈ నిర్ణయం తీసుకుని 10 రోజులవుతున్నా, బదిలీ ఫైలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చేయలేదు. ఆ ఫైల్‌ను తన వద్దనే ఉంచుకుని కాలం వెళ్లబుచ్చుతున్నారు.

06/10/2016 - 05:53

హైదరాబాద్, జూన్ 9: వారం రోజులుగా అదృశ్యమైన వెలాసిటీ కార్పొరేట్ జూనియర్ కాలేజీ సీనియర్ లెక్చరర్ అశ్వత్థరావు గురువారం విజయవాడలో ప్రత్యక్షమయ్యారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, సొంత పనుల మీద తాను విజయవాడ వచ్చానన్నారు. నారాయణ సంస్థలు తనను బంధించాయన్న వార్తలు సరికాదని పేర్కొన్నారు.

06/10/2016 - 05:48

విజయవాడ, జూన్ 9: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని రాష్ట్భ్రావృద్ధికి సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్యాంకర్లకు పిలుపునిచ్చారు. గురువారం విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో 1,65,538 కోట్ల రూపాయల అంచనాతో రూపొందించిన వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు.

06/10/2016 - 05:47

కాకినాడ, జూన్ 9: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గురువారం చేపట్టిన ఆమరణ దీక్షను తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య సిఐడి పోలీసులు భగ్నం చేసి, ఆయన్ని అరెస్టు చేశారు. ముద్రగడ అరెస్ట్‌కు నిరసనగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరపాలని కాపు నేతలు పిలుపు నిచ్చారు. అత్యంత ఉద్విగ్న పరిస్థితుల మధ్య ఈ పరిణామం చోటుచేసుకుంది. అరెస్టు సమయంలో ముద్రగడ నివాసం వద్ద హైటెన్షన్ నెలకొంది.

06/09/2016 - 08:00

నాగార్జునసాగర్, జూన్ 8: నాగార్జునసాగర్ జలాశయం నుండి ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా కృష్ణాడెల్టాకు బుధవారం నాడు సాగర్ డ్యాం అధికారులు నీటిని విడుదల చేశారు. బుధవారం ఉదయం 8గంటలకు 3,500క్యూసెక్కులను ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా విడుదల చేశారు. ప్రస్తుతం 7వేల క్యూసెక్కులు కృష్ణాడెల్టాకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయంలో ప్రస్తుతం 506.50అడుగుల నీటిమట్టం ఉంది.

06/09/2016 - 07:52

హైదరాబాద్, జూన్ 8: అనంతపురం జిల్లాలో నిర్వహించిన రైతు భరోసా యాత్రకు వచ్చిన విశేష స్పందనతో కదం తొక్కుతున్న వైకాపా శ్రేణులకు మార్గనిర్దేశనం చేసేందుకు, వచ్చే మూడేళ్ల పాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు పార్టీ నేతల నుంచి అభిప్రాయాలు సేకరించాలని వైకాపా అధ్యక్షుడు జగన్ నిర్ణయించారు.

06/09/2016 - 07:52

హైదరాబాద్, జూన్ 8: తుని ఘటనలో అమాయకులయిన వారిపై కేసులు ఎత్తివేయకపోతే గురువారం నుంచి ఆమరణ దీక్ష చేపడతానని కాపునాడు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఇచ్చిన అల్టిమేటమ్‌పై కాపు సామాజికవర్గంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో దీక్షకు మద్దతివ్వకపోతే స్థానికంగా తమ మనుగడ ఏమిటన్న దానిపై కాపు వర్గానికి చెందిన మంత్రులు, టిడిపి ఎమ్మెల్యేలు సందిగ్ధంలో పడ్డారు.

06/09/2016 - 07:51

హైదరాబాద్, జూన్ 8: ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలను ఎన్నింటిని నెరవేర్చారని, రెండేళ్ల పాలనను పండుగగా చేసుకుంటున్న రాష్ట్రప్రభుత్వం తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వైకాపా డిమాండ్ చేసింది. బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ వ్యవసాయ రుణాలను మాఫీ చేశారా అని ప్రశ్నించారు. టిడిపి అధికారంలోకి వచ్చేసరికి రూ.

06/09/2016 - 07:51

హైదరాబాద్, జూన్ 8: ఆంధ్ర రాష్ట్రంలో ఉత్తమ పద్ధతుల్లో సాగునీటి సంఘాలను నిర్వహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, కర్నాటక, ఒడిశాలో ప్రతి వంద హెక్టార్లకు ఒక సాగునీటి సంఘం ఉందని, అదే ఆంధ్రాలో 1600 హెక్టార్లకు ఒక సాగునీటి సంఘం ఉందని ఏపి ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.

06/08/2016 - 07:16

హైదరాబాద్, జూన్ 7: హైదరాబాద్‌లో కార్పొరేట్ కాలేజీలు నారాయణ, వెలాసిటీల మధ్య కొట్లాట విజయవాడకు మారింది. వెలాసిటీలో పనిచేస్తూ అదృశ్యమయ్యారని చెబుతున్న అశ్వత్థరావు మంగళవారం విజయవాడలో ప్రత్యక్షమయ్యారు.

Pages