S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/07/2016 - 06:55

హైదరాబాద్, జూన్ 6: కార్బైడ్ పూసిన పళ్లను మార్కెట్‌లో అమ్మడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైదరాబాద్ హైకోర్టు తామిచ్చిన ఆదేశాలను పాటించడంలో ఎందుకు జాప్యం జరుగుతోందని తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు చెందిన అధికారులను నిలదీసింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి బోసలే, జస్టిస్ పి నవీన్‌కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ అధికారుల వివరణ కోరింది.

06/07/2016 - 05:57

విజయవాడ, జూన్ 6: ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం రోజురోజుకూ పెరుగుతోందని, ఇది హర్షణీయమని ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం తన నివాసం నుంచి ప్రభుత్వ యంత్రాంగంతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసే అభివృద్ధి, సంక్షేమ పథకాల పూర్తి సమాచారం ప్రతి గ్రామ పంచాయతీలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

06/07/2016 - 05:55

విశాఖపట్నం, జూన్ 6: నైరుతి రుతుపవనాల కదలిక ఆశాజనకంగా ఉంది. అన్నీ అనుకూలిస్తే మరో 24 గంటల తర్వాత రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనావేస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాను ఆనుకుని ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సోమవారం రాత్రి వెల్లడించారు.

06/07/2016 - 05:55

గుంటూరు, జూన్ 6: ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు నాయుడు అట్టహాసంగా ప్రారంభించిన ‘నా ఇటుక- నా అమరావతి’కి బేరాలు కరువయ్యాయి. కొత్త రాజధానిలో అందరినీ భాగస్వాములను చేసేందుకు సిఆర్‌డిఎ నేతృత్వంలో గత ఏడాది అక్టోబర్ 15న ‘నా ఇటుక - నా అమరావతి’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఒక్కో ఇటుకకు 10 రూపాయల చొప్పున వసూలు చేస్తూ ఆన్‌లైన్‌లో కొనుగోలుదారుల వివరాలను సిఆర్‌డిఎ పొందుపర్చింది.

06/07/2016 - 05:53

హైదరాబాద్, జూన్ 6: మహానగర పాలక సంస్థలో పరిపాలన రోజురోజుకు గాడితప్పుతోంది. ఎవరుపడితే వారు ఆయా రాం.. గయా రాం అన్నట్టు తయారైంది పరిస్థితి.

06/07/2016 - 05:49

హైదరాబాద్, జూన్ 6: గ్లోబల్ ఆసుపత్రిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర బిజెపి శాసనసభా పక్ష నేత కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సుచిత్ర, ఎంఎన్ రెడ్డినగర్‌లోని నిఖిల్‌రెడ్డిని పరామర్శించారు. శస్త్ర చికిత్సకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

06/07/2016 - 05:46

హైదరాబాద్, జూన్ 6: దేశ సమైక్యత భావస్వేచ్ఛకు మతోన్మాదం వల్ల ముప్పు వాటిల్లే ప్రమాదముందని, దీన్నుంచి దేశాన్ని కాపాడుకోవాలని మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. మతోన్మాదుల ఆట కట్టించేదుకు ప్రగతిశీల దేశంగా భారత్‌ను పరిరక్షించుకోవాలన్నారు. సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సిఆర్ ఫౌండేషన్ అధ్వర్యంలో చండ్ర రాజేశ్వరరావు102 జయంతి సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు.

06/07/2016 - 05:43

రాజమహేంద్రవరం, జూన్ 6: రాష్ట్రంలో భూ రికార్డుల ఆధునికీకరణ వ్యవహరం ‘కొండ నాలుకకు మందేస్తే’ అన్న చందంగా మారిపోయింది. రాష్టవ్య్రాప్తంగా ఉన్న అన్ని రకాల భూ రికార్డుల వెబ్‌ల్యాండ్ తయారీకి ప్రభుత్వం చర్యలు తీసుకున్న నేపథ్యంలో దశాబ్దాల నాటి సర్వే నెంబర్లు మారిపోయి, రిజిస్ట్రేషన్ల సమయంలో తలనొప్పులు మొదలయ్యాయి. రాష్ట్రంలో 2012-13లోనే భూ రికార్డులు కంప్యూటరీకరించారు.

06/07/2016 - 05:43

హైదరాబాద్, జూన్ 6: నగరంలోని ‘అగ్రోహ’ సహకార పట్టణ బ్యాంకు లిమిటెడ్‌కు భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్‌బిఐ) లక్ష రూపాయల జరిమానా విధించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 సెక్షన్-47ఎ (1) (బి)ను అనుసరించి, డెరెక్టర్లకు, వారి బంధువులకు రుణాలు, అడ్వాన్స్‌ల చెల్లింపులలో అవకతవకలను గుర్తించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్‌బిఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ బి. రమేష్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

06/07/2016 - 05:42

హైదరాబాద్, జూన్ 6: గిరిజన మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చి దిద్దేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్టు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ తెలిపారు. ఔత్సాహిక గిరిజన పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (యున్‌డిపి)తో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

Pages