S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/07/2016 - 05:42

సూళ్లూరుపేట, జూన్ 6: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రం నుండి ఈనెల 20వ తేదీన ప్రయోగించే పిఎస్‌ఎల్‌వి-సి 34 ప్రయోగానికి సంబంధించిన మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశం (ఎంఆర్‌ఆర్) మంగళవారం షార్‌లో జరగనుంది. ఇప్పటికే ఈ ప్రయోగానికి సంబంధించిన మూడు దశల రాకెట్ అనుసంధాన పనులు షార్‌లో శాస్తవ్రేత్తలు పూర్తిచేశారు.

06/07/2016 - 05:41

హైదరాబాద్, జూన్ 6: కాచిగూడ-గుంటూరు, కాచిగూడ-తిరుపతి డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 12 నుంచి 30 వరకు రూట్ ట్రయల్స్, మరమ్మతుల కారణంగా డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్వో ఎం ఉమాశంకర్ కుమార్ పేర్కొన్నారు. రద్దయిన రైళ్లలో ట్రైన్ నెం. 22118 కాచిగూడ-గుంటూరు, ట్రైన్ నెం.

06/07/2016 - 05:40

హైదరాబాద్, జూన్ 6: జూనియర్ ఆర్టిస్టు కిడ్నాప్‌కు గురైన సంఘటన కలకలం రేపింది. ఆలస్యంగా వెలుగుచూసిన సంఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ సిఐ వెంకటరెడ్డి కథనం ప్రకారం వివరాలిలావున్నాయి.

06/07/2016 - 05:40

హైదరాబాద్, జూన్ 6: ఎత్తు పెరగడం కోసం గ్లోబల్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకున్న నిఖిల్ రెడ్డి తండ్రి గోవర్ధన్‌రెడ్డికి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లేఖ రాసింది. గోవర్ధన్‌రెడ్డి ఫిర్యాదును ఎథిక్స్ కమిటీ పరిగణలోకి తీసుకుంది. నిఖిల్ పరిస్థితిపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వివరణ కోరింది.

06/07/2016 - 05:39

హైదరాబాద్, జూన్ 6: కళానికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీశారదను పోలీసులు అరెస్టు చేశారు. ధర్మవరం చేనేత కార్మికుల నుంచి వస్త్రాలు కొనుగోలు చేసి డబ్బులివ్వలేదని ధర్మవరం పోలీసులకు కార్మికులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం రాత్రి హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని ఆమె నివాసంలో ఆమెను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో ఉందని ధర్మవరం ఎస్‌ఐ సునిత తెలిపారు.

06/07/2016 - 04:21

న్యూఢిల్లీ/ హైదరాబాద్, జూన్ 6:తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ జెఎసి, టిఆర్‌ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది.ఇక అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధం అన్నట్టుగా ఇరు వర్గాలు మాటల దాడిని ప్రారంభించాయి. తెలంగాణ విద్యావంతుల వేదిక సమావేశంలో కెసిఆర్ పాలనను విమర్శిస్తూ టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ చేసిన విమర్శలపై టిఆర్‌ఎస్ మంత్రులు, ఎంపిలు తీవ్ర స్వరంతో స్పందించారు.

06/07/2016 - 04:18

హైదరాబాద్, జూన్ 6: రాష్టవ్య్రాప్తంగా 119 నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలకు క్యాంపు కార్యాలయాల నిర్మాణానికి తక్షణం స్థల సేకరణ జరిపి, డిసెంబర్‌లో టెండర్లు పిలువాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్యేలకు తమ నియోజక వర్గ కేంద్రాల్లో క్యాంపు కార్యాలయాలు నిర్మించాలని నిర్ణయించారు. నిధులు కూడా మంజూరు చేశారు.

06/07/2016 - 04:15

హైదరాబాద్, జూన్ 6: కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. రెండు రెవిన్యూ డివిజన్లు, 20 మండలాలకు ఒకటి చొప్పున కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రామాణికంగా తీసుకోవడంతోపాటు జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్లకు మించకుండా విస్తీర్ణం ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది.

06/07/2016 - 04:28

హైదరాబాద్/విజయవాడ, జూన్ 6: హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు విజయవాడ రావాలంటే వౌలిక వసతులను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఉద్యోగుల సంఘం నేత అశోక్‌బాబు పేర్కొన్నారు. సోమవారం నాడిక్కడ ఆయన మాట్లాడుతూ రావడానికి ఇష్టం లేని ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, కొంత మంది వ్యాఖ్యలను అందరికీ ఆపాదించడం సమంజసం కాదని అన్నారు.

06/07/2016 - 02:26

తుళ్లూరు, జూన్ 6: కొత్త రాజధానిలో సహజంగానే ఇబ్బందులు ఉంటాయని, ఉద్యోగులు రాలేమంటే కుదరదని, నిర్దేశిత గడువులోపు తరలి రావాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను సోమవారం ఆయన పరిశీలించారు.

Pages