S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/07/2016 - 02:14

విజయవాడ, జూన్ 6:కృష్ణానది యాజమాన్య బోర్డు (కెఆర్‌ఎంబి) అధికార పరిధిని ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిర్ణయించాలని కోరుతూ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 సెక్షన్ 87(1)లో నిర్దేశించిన దానికి అనుగుణంగా కృష్ణానది యాజమాన్య బోర్డు అధికార పరిధి నిర్ణయిస్తూ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉందన్నారు.

06/07/2016 - 02:13

తరలింపు తిప్పలు-2

06/07/2016 - 02:10

హైదరాబాద్, జూన్ 6: కార్పొరేట్ కాలేజీల మధ్య మళ్లీ వార్ మొదలైంది. సినిమా సన్నివేశాలను తలపించేలా ఎక్కువ రేటు చెల్లించి లెక్చరర్లను ఎత్తుకువెళ్లే సంస్కృతికి కొద్ది కాలం విరామం చిక్కినా, మళ్లీ అది జడలు విప్పింది.

06/07/2016 - 02:08

హైదరాబాద్, జూన్ 6: ముస్లింల పవిత్ర రంజాన్ మాసం మంగళవారం నుంచి ప్రారంభంకానున్నది. సోమవారం సాయంత్రం నెల వంక దర్శనమివ్వడంతో మంగళవారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభమవుతాయి. నెల రోజుల పాటు ముస్లింలు ఉపవాసం ఉంటారు.

06/07/2016 - 02:06

విజయవాడ, జూన్ 6: విద్యుత్‌తో నడిచే బస్సులు త్వరలోనే రాష్ట్రంలో రోడ్డెక్కనున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విజయవాడ ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో కొత్తగా నిర్మించిన ఎన్టీఆర్ పరిపాలన భవనాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 80 కొత్త బస్సులను ఆయన ప్రారంభించారు. ఇందులో ప్రతి సీటు వెనక ఒక టివి ఉంటుం ది.

06/06/2016 - 08:31

సూళ్లూరుపేట, జూన్ 5: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ ప్రయోగానికి ముహూర్తం ఖరారు చేసింది. అగ్రరాజ్యాలకు దీటుగా ఒకేసారి 22 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు శ్రీకారం చుట్టింది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రం నుండి ఈనెల 20న పిఎస్‌ఎల్‌వి-సి 34 రాకెట్ ప్రయోగం జరిపేందుకు ఇస్రో సన్నాహం చేస్తోంది.

06/06/2016 - 07:40

హైదరాబాద్, జూన్ 5 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మిషన్ భగీరథ’ పథకానికి నిధుల వేటలో భాగంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ ఈ నెల 10 న ఢిల్లీ వెళుతున్నారు. కేంద్ర తాగునీరు, శానిటేషన్ మంత్రిత్వ శాఖ అధికారులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖాధికారులతో ఆయన చర్చలు జరుపుతారు.

06/06/2016 - 07:37

హైదరాబాద్, జూన్ 5: రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు నేరుగా లబ్ధిదారులకు అందే విధంగా చూసేందుకు, దళారుల పాత్రను తొలగించేందుకు నగదు బదిలీ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం త్వరలో శ్రీకారం చుట్టనుంది. దీనికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం త్వరలో ఖరారు చేస్తుంది.

06/06/2016 - 06:46

హైదరాబాద్, జూన్ 5: హైదరాబాద్‌లోని ఆంధ్ర సచివాలయం నుంచి ఉద్యోగులు, ఉన్నతాధికారుల తరలింపునకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ నెల 8వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్య ప్రకాశ్ టక్కర్ అమరావతికి వెళ్లాల్సిన వివిధ శాఖాధిపతులు, ఉద్యోగులపై రోడ్‌మ్యాప్‌ను ప్రకటించనున్నారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయన్ని ఆదేశించినట్టుగా తెలుస్తోంది.

06/06/2016 - 06:43

హైదరాబాద్, జూన్ 5: మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీకి కేంద్రంలో అదనంగా మరో కేంద్రమంత్రి పదవి ఇచ్చేందుకు భారతీయ జనతా పార్టీ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ విషయం తెలిసిన టిడిపి ఎంపిలు ఇప్పటినుంచే లాబీయింగ్ ప్రారంభించారు.

Pages