S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/05/2016 - 04:20

హైదరాబాద్, జూన్ 4: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్‌కు రూట్ క్లియరయింది. లోకేష్ చేరికపై బాబు పరోక్షంగా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఇక ఆయన క్యాబినెట్‌లో చేరడమే తరువాయి అని పార్టీ నేతలు చెబుతున్నారు. గత రెండు రోజుల నుంచి బాబు వివిధ చానెళ్లు, పత్రికలకు ఇంటర్వ్యూలు ఇస్తున్న విషయం తెలిసిందే. ఆ సందర్భంగా లోకేష్ రాజకీయ భవితవ్యం గురించి ప్రశ్నలు అడిగినప్పుడు ఇంకా సమయం ఉంది కదా?

06/05/2016 - 04:08

విజయవాడ, జూన్ 4: రెండేళ్ల తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అన్ని వర్గాలకు అందుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల అమలులో అధికారుల కృషి అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రజల నుండి 90శాతం సంతృప్తికర స్పందన వస్తోందన్నారు. శనివారం ఆయన తన నివాస గృహం ఉండవల్లి నుండి ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగంతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

06/05/2016 - 04:54

రాజమహేంద్రవరం, జూన్ 4: కెజి బేసిన్ పరిధిలో రూ.30వేల కోట్ల పెట్టుబడితో కొత్తగా పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ను ఏర్పాటుచేస్తున్నట్టు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.

06/05/2016 - 04:17

కర్నూలు/ఆదోని, జూన్ 4: కర్నూలు జిల్లాలో శనివారం ఉదయం కర్నాటక రోడ్డు రవాణా సంస్థ బస్సుకు పెనుప్రమాదం తప్పింది. హంద్రీనది వరదలో చిక్కుకున్న బస్సు ప్రయాణికులను సమీప గ్రామస్థులు సురక్షితంగా బయటకు తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరో సంఘటనలో కల్లేవంక వాగులో జొన్నల లారీ బోల్తా పడడంతో అందులోని ముగ్గురిని పోలీసులు రక్షించారు. శనివారం తెల్లవారుజామున జిల్లాలో భారీవర్షం కురిసింది.

06/05/2016 - 03:59

విజయవాడ, జూన్ 4: ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే జోన్ పరిశీలనలో ఉందని రైల్వే మంత్రి సురేష్ ప్రభు చెప్పారు. ఎపి నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన ప్రభు శనివారం విజయవాడకు చేరుకుని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. ఎపి నుంచి టిక్కెట్ ఇచ్చి గెలిపించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

06/05/2016 - 03:56

హైదరాబాద్, జూన్ 4: సచివాలయం ఉద్యోగుల గుండెల్లో జూన్ 27 గడువుగుబులు రేకెత్తిస్తోంది. ఉండటానికి ఇల్లు లేదు...పిల్లల్ని చేర్పించేందుకు స్కూలు లేదు..ఉద్యోగం చేయడానికి సరైన వసతి లేదు...ఎలా వెళ్లాలి? అనే ప్రశ్న వారిని వేధిస్తోంది. ఉద్యోగుల ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సరైన సమాధానం లేదు. రాకపోతే ఊరుకోనంటూ తాజాగా ముఖ్యమంత్రి అల్టిమేటమ్ జారీ చేయడంతో ఉద్యోగులకు ఏం చేయాలో పాలుబోవడం లేదు.

06/04/2016 - 05:20

హైదరాబాద్, జూన్ 3: భారత్- అమెరికాలు సహజ మిత్ర దేశాలని, ప్రధాని నరేంద్ర మోదీ చొరవ, పర్యటనల వల్ల ఇరు దేశాల మధ్య వాణిజ్య ద్వైపాక్షిక సంబంధాల్లో నూతన శకం ప్రారంభమైందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని, ఇక్కడ అద్భుతమైన వాణిజ్య అవకాశాలున్నాయని పిలుపునిచ్చారు.

06/04/2016 - 04:43

హైదరాబాద్, జూన్ 3: ఓటుకు నోటు కేసులో నాల్గవ నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్యపై తెలంగాణ ఏసిబి నమోదు చేసిన క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో మత్తయ్యకు ఊరట లభించింది. ఓటుకు నోటు కేసు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. జస్టిస్ బి శివశంకర్ రావు కేసును విచారించారు.

06/03/2016 - 07:16

తిరుమల, జూన్ 2: తిరుమల శ్రీవారి ఆలయం వద్ద గురువారం ప్రయోగాత్మకంగా ప్రహరీ ఉద్యానవనాలను ప్రారంభించారు. తొలివిడతలో ఆలయ మహాద్వారానికి ఇరువైపులా 2500 కుండీల్లో ఫోలియేట్ జాతి మొక్కలను పెంచుతున్నారు. ఈ మొక్కలకు ఆటోమేటిక్ డ్రిప్ విధానం ద్వారా నీటిని అందిస్తారు. రెండో విడతలో వైభవోత్సవం మండపం, సహస్ర దీపాలంకార సేవ మండపం వద్ద కూడా ఈ ఉద్యానవనాలను ఏర్పాటు చేయనున్నారు.

06/03/2016 - 07:15

ఖమ్మం, జూన్ 2: రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్స 2వ వార్షికోత్సవ సంబురాలు సందడిగా జరిగిన నేపథ్యంలో ఖమ్మంలో మాత్రం అపశృతి చోటు చేసుకుంది. ఒక దశలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడులో టిఆర్‌ఎస్, సిపిఐ కార్యకర్తలు గొడవలకు దిగడంతో ఒకరు మృతి చెందగా, నలుగురు గాయాల పాలయ్యారు.

Pages