S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/03/2016 - 06:49

రావులపాలెం, జూన్ 2: ఆంధ్రప్రదేశ్ రాష్టమ్రంతటా నవ నిర్మాణ దీక్షలు నిర్వహిస్తుంటే తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో మాత్రం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సంబరాలు నిర్వహించి కొందరు తమ ప్రత్యేకతను చాటుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం జాతీయ రహదారి కూడలిలో గురువారం తెలంగాణ రాష్ట్ర సీమాంధ్రుల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ సంగినీడి సీతారాం ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు.

06/03/2016 - 06:47

తిరుమల, జూన్ 2: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం గురువారం దర్శించుకుంది. సిఎం సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు నారా లోకేశ్, ఆయన సతీమణి బ్రాహ్మణి, వారి కుమారుడు దేవాన్ష్ తదితరులు శ్రీవారి దర్శనార్థం గురువారం ఉదయం 9గంటలకు తిరుమలకు చేరుకున్నారు. రెండో పర్యాయం దేవాన్ష్‌కు తలనీలాలు సమర్పించారు.

06/03/2016 - 06:45

గుత్తి, జూన్ 2: పాముకాటుకు గురైన తల్లితో పాటు ఆమె పాలు తాగిన ఏడాది కొడుకు మృతి చెందిన సంఘటన గురువారం అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని గాంధీనగర్ గ్రామంలో చోటుచేసుకుంది. మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గాంధీనగర్‌కు చెందిన లింగన్న, చంద్రకళ (30) దంపతులు పశుపోషణ ద్వారా జీవనం సాగించేవారు. వారికి ఏడాది వయసు గల కుమారుడు ఉన్నారు.

06/03/2016 - 06:45

హైదరాబాద్, జూన్ 2: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఆదా చేసేందుకు ఏపి ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కాంలు, కేంద్రం పరిధిలోని ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా ఏపి రాష్ట్ర ఎనర్జీ ఎఫీషియెన్సీ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (ఏపిఇఇడిసి)ను ఏర్పాటు చేశాయి. ఈ మేరకు రాష్టప్రభుత్వం జీవో 18ను జారీ చేసింది. ఈ వివరాలను ఇంధన కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడించారు.

06/03/2016 - 06:44

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్రం మెడికల్, డెంటల్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఎమ్సెట్-2కు గురువారం రాత్రికి 15వేల దరఖాస్తులు వచ్చాయి. తొలి రోజు ఆరు వేల దరఖాస్తులు రాగా రెండో రోజు దరఖాస్తుల సంఖ్య 15వేలకు పెరిగింది. అబ్బాయిలు 6వేల మంది దరఖాస్తు చేయగా, అమ్మాయిలు 10వేల మంది దరఖాస్తు చేశారు.

06/03/2016 - 06:44

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ విస్తరణాధికారుల నియామకానికి పబ్లిక్ సర్వీసు కమిషన్ 4వ తేదీన ఎంపిక పరీక్ష నిర్వహించనుంది. ఈ పరీక్షకు 7645 మందికి హాల్‌టిక్కెట్లు జారీ చేశారు. 4వ తేదీన ఉదయం పేపర్-1, సాయంత్రం పేపర్-2 జరుగుతుందని కమిషన్ కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ చెప్పారు.

06/03/2016 - 06:43

హైదరాబాద్, జూన్ 2: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించేందుకు అనుకూలంగా లేఖ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నవ నిర్మాణ దీక్షను చేయడం వింతగా ఉందని ప్రతిపక్ష పార్టీ వైకాపా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడలో గురువారం నవ నిర్మాణ దీక్ష చేయలేదని, ఇదంతా నయ వంచన దీక్ష అని ఆ పార్టీ విమర్శించింది.

06/03/2016 - 06:43

హైదరాబాద్, జూన్ 2: విశాఖపట్నంలోని హిందూజా నేషనల్ పవర్ కార్పోరేషన్ నుంచి 1040 మెగావాట్ల విద్యుత్‌ను ఏపి డిస్కాంలే కొనుగోలు చేయాలంటూ ఆంధ్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోపై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1040 మెగావాట్ల హిందూజాకు అనుమతులు ఇచ్చారు.

06/03/2016 - 06:42

విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, జూన్ 2: ఉత్తరాంధ్రలో గురువారం నిర్వహించిన నవనిర్మాణ దీక్ష ఉరకలెత్తిన ఉత్సాహం మధ్య జరిగింది. విశాఖలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎంపి కె.హరిబాబు, ఎమ్మెల్సీ మూర్తి మాట్లాడుతూ విభజన వల్ల కలిగిన బాధ పడకుండా రెట్టింపు కసితో, ఉత్సాహంతో రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
విజయనగరంలో...

06/03/2016 - 06:41

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రభుత్వాల బాధ్యతారాహిత్యం వల్లనే పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోందని, అనేక స్కూళ్లు మూసివేతకు కారణమవుతోందని పలువురు తల్లిదండ్రులు, విద్యాసంఘాల నాయకులు, ఎన్‌జిఓల ప్రతినిధులు తెలంగాణ, ఆంధ్రాల్లో స్కూళ్ల మూసివేతపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ చైర్మన్ అశోక్‌గుప్తకు ఫిర్యాదు చేశారు.

Pages