S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/06/2020 - 23:46

ఆత్మకూరు, ఫిబ్రవరి 6: ప్రజావైద్యుడిగా, పేదల నాయకుడిగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా వ్యవహరించిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి (85) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం ఆత్మకూరు పట్టణంలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.

02/06/2020 - 21:58

అమరావతి: ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన ఇసుక, మైనింగ్ విధానం దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. ఇసుక పాలసీ అమలుపై బుధవారం ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంఓ) కార్యదర్శి ద్వారా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

02/06/2020 - 21:49

హైదరాబాద్, ఫిబ్రవరి 5: శ్రీశైలం, కండలేరు నుంచి చెన్నై నగరానికి మంచినీటి కోసం నీరు విడుదల చేయాలని తమిళనాడు నీటిపారుదలశాఖ అధికారులు కృష్ణానదీ యాజమాన్య బోర్డును కోరారు. జలసౌధలో బుధవారం కృష్ణానదీ యాజమాన్య బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మూడు రాష్ట్రాల నుంచి ఇంజనీర్లు హాజరయ్యారు.

02/06/2020 - 05:59

విశాఖపట్నం, ఫిబ్రవరి 5: భారత నౌకాదళంలో విశేష సేవలందిస్తున్న ఐఎన్‌ఎస్ సింధువీర్ జలాంతర్గామి మరమ్మతులు పూర్తి చేసుకుని సేవలందించేందుకు సిద్ధం కానుంది. విశాఖలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో ఐఎన్‌ఎస్ సింధువీర్‌కు రికార్డు సమయంలో మరమ్మతులు పూర్తి చేసి రికార్డు సృష్టించారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ నెలాఖరు నాటికి సింధువీర్‌ను నౌకాదళానికి అప్పగించాలి.

02/06/2020 - 05:50

మేడారం, ఫిబ్రవరి 5: తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క - సారలమ్మ జాతరలో ప్రధాన ఘట్టంలో భాగంగా గురువారం సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుండి మేడారంలోని గద్దెలకు చేరనుంది. బుధవారం సమ్మక్క కుమార్తె సారలమ్మతో పాటు గోవిందరాజు, పగిడిద్దరాజు బుధవారమే మేడారం చేరుకోగా, గురువారం తల్లి సమ్మక్కను గిరిజన పుజారులు చిలకలగుట్ట నుండి కుంకుమభరిణె రూపంలో గద్దెలకు తీసుకువస్తారు.

02/06/2020 - 05:26

హైదరాబాద్: పెళ్లి అయ్యిందని చదువును మహిళలు ఆపేయవద్దని, చదువు కొనసాగించాలని, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. వివాహం అయిన తర్వాత కూడా లక్ష్యాలను సాధించుకోవచ్చని, అందుకు నిరంతరం కృషి చేయాలని అన్నారు. హైదరాబాద్ నగరంలో ఇటీవల జరిగిన దిశ ఘటన తనను ఎంతో కలచివేసిందని ఆమె వ్యాఖ్యానించారు.

02/06/2020 - 05:31

హైదరాబాద్, ఫిబ్రవరి 5: అడవుల్లో అగ్నిప్రమాదాలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, క్షేత్రస్థాయి సిబ్బంది ఎండాకాలం మొత్తం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర అటవీ శాఖ అధికారి (హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్) ఆర్. శోభ ఆదేశించారు. నల్లమల అడవుల్లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అటవీ అధికారులతో బుధవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అరణ్యభవన్ నుండి మాట్లాడారు.

02/06/2020 - 05:22

తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గదులను బుక్ చేసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే వినియోగించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. నకిలీ వెబ్‌సైట్లను నమ్మి మోసపోవద్దని స్పష్టం చేసింది. నకిలీ వెబ్‌సైట్లను సంప్రదించి మోసపోయినట్లు పలువురు భక్తుల నుండి టీటీడీకి పిర్యాదులు అందాయి.

02/06/2020 - 05:20

హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్‌ఛాలెంజ్‌కి విదేశీ క్రీడాకారులు స్వీకరించారు. అందకు ప్రతి క్రీడాకారుడు ఒక మొక్క నాటారు. ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కి ఇప్పటికే తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖలు గ్రీన్‌ఛాలెంజ్‌ని స్వీకరించారు.

02/06/2020 - 01:20

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోరైలు మొదటి దశ చివరి కారిడార్ ప్రారంభంతో దేశంలోనే అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌గా అవతరించనుందని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. దేశంలో ప్రస్తుతం ఉన్న మెట్రోరైలు ప్రాజెక్టుల్లో ఢిల్లీ తర్వాత హైదరాబాద్ మెట్రో రైలు పెద్దదిగా నిలువబోతుందన్నారు.

Pages