S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/03/2016 - 01:17

విజయవాడ, మే 2: ‘కృష్ణా, గోదావరి నదీ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరుగుతోంది. ఈ సమస్య రోజురోజుకూ జటిలమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో నదీ జలాల వివాదంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఆ తరువాత జరిగిన విలేఖరుల సమావేశంలో చంద్రబాబు ఈ వివరాలను విలేఖర్లకు తెలిపారు.

05/03/2016 - 01:15

విజయవాడ, మే 2: రాష్ట్రంలో ఉద్యానవన రైతుల రుణాలను కూడా రద్దుచేస్తూ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం ఇక్కడ జరిగిన మంత్రివర్గ సమావేశంలో రైతుల రుణమాఫీపై చర్చ జరిగింది. రాష్ట్రంలో రైతులకు మొదటి విడత రుణమాఫీని విజయవంతంగా పూర్తిచేశామని, రెండోవిడత రుణమాఫీకి 3,331 కోట్ల రూపాయలను విడుదల చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు విలేఖరుల సమావేశంలో చెప్పారు.

05/03/2016 - 01:06

నిడదవోలు, మే 2: వరుసకు కొడుకయ్యే పనె్నండేళ్ల బాలుడిని గొంతు నులిమి హత్యచేసి, మేనల్లుడయ్యే యువకుడిపై హత్యాయత్నానికి ఒడిగట్టిన ఉన్మాది ఉదంతమిది. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం శెట్టిపేట గ్రామంలో సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది.

05/03/2016 - 01:02

విజయవాడ,మే 2: విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో సోమవారం మరో ఘోరం జరిగింది. డాక్టర్లు, సిబ్బం ది నిర్లక్ష్య కారణంగా నాలుగురోజుల ఓ పసికందు తీవ్రం గా చీములు కుట్టి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటనపై వామపక్షాలు, ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు ధర్నాకు దిగటంతో ఉద్రిక్తత నెలకొంది. పరామర్శించేందుకు వచ్చిన శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్‌ను ఘెరావ్ చేశారు. ఆస్పత్రిలో సౌకర్యాలు కల్పించకుండా పరామర్శకు వస్తారా?

05/03/2016 - 00:57

హైదరాబాద్, మే 2: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే రెండురోజుల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించింది. ఐఎండి హైదరాబాద్ డైరెక్టర్ వైకె రెడ్డి సోమవారం ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ వాతావరణలో వచ్చిన స్వల్పమార్పుల వల్ల చిరుజల్లులు లేదా తేలికపాటి వర్షాలు అక్కడక్కడా కురుస్తాయని వివరించారు.

05/02/2016 - 05:45

హైదరాబాద్, మే 1: తెలుగు రాష్ట్రాల్లో వడగాడ్పులు మరో వారంపాటు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించింది. రాయలసీమ జిల్లాలతోపాటు కోస్తాలోని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో, తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని ఐఎండి హెచ్చరించింది.

05/02/2016 - 05:39

హైదరాబాద్, మే 1: రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు రాలేదనే ఆగ్రహంతో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బిజెపి ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారా? ఈ నెల 4వ తేదీ బుధవారం నీతి అయోగ్ సమావేశం ఢిల్లీలో జరగనుంది. ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం ఇంతవరకు కేటాయించిన నిధులు తదితర అంశాలపై ఈ సమావేశంలో నీతి అయోగ్ ఉన్నతాధికారులు చర్చించనున్నారు.

05/01/2016 - 07:02

హైదరాబాద్, ఏప్రిల్ 30: అన్నమయ్య కీర్తనలకు ప్రాచుర్యం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ‘అన్నమయ్య పాటకు పట్ట్భాషేకం’ పేరుతో ఒక బృహత్ ప్రణాళికను రూపొందించింది.

05/01/2016 - 07:00

హైదరాబాద్, ఏప్రిల్ 30: కార్మికుల కోసం ప్రత్యేకంగా బ్యాంకులు ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఈ అంశంపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని నియమించామని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో చెప్పారు. కార్మికుల సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.

05/01/2016 - 06:59

హైదరాబాద్, ఏప్రిల్ 30: దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశానికి ఏకీకృత పరీక్ష- నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కు సంబంధించి తామిచ్చిన ఆదేశాల్లో ఎలాంటి మార్పులూ ఉండబోవని సుప్రీంకోర్టు శనివారం మరో మారు స్పష్టంగా చెప్పినా, రానున్న రోజుల్లో విద్యార్థులకు అనుకూలమైన నిర్ణయాలను సుప్రీంకోర్టు తీసుకుంటుందనే ఆశాభావాన్ని విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు.

Pages