S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/30/2016 - 03:04

విజయవాడ, ఏప్రిల్ 29: హైదరాబాద్ నుంచి ఉన్నపళంగా అమరావతికి వెళితే ఇళ్ళు ఎక్కడ వెతుక్కోవాలి? ఆగస్టులోగా తరలిరావడానికి సిద్ధమవుతున్న ఉద్యోగుల్ని వెంటాడుతున్న భయమిదే. అయితే ఆ భయం వారికి అక్కర్లేదు. వారికోసం అమరావతిలో అద్భుతమైన ఇళ్లు తయారవుతున్నాయి. జూన్‌లో అమరావతికి వచ్చే ఉద్యోగుల కోసం ఇళ్ళను సిద్ధం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది.

04/30/2016 - 02:39

హైదరాబాద్, ఏప్రిల్ 29:ఈసారి వర్షపాతం బాగుంటుందని 106శాతం వర్షపాతం ఉంటుందని ముఖ్యమంత్రి కల్వకుంట్లచంద్రశేఖర్‌రావు తెలిపారు. మే 15న మరోసారి వాతావరణ అధ్యయన నివేదిక వెలువడిన తరువాత మరింత స్పష్టత వస్తుందని తెలిపారు.

04/30/2016 - 02:31

హైదరాబాద్, ఏప్రిల్ 29: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. వృత్తి, సాంకేతిక విద్యాసంస్థల్లో తనిఖీలు చేసేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. కాలేజీల్లో విద్యా ప్రమాణాలు సరిగా లేవనే ఉద్దేశంతో తెలంగాణ సర్కార్ విజిలెన్స్ దాడులు ప్రారంభించిన విషయం తెలిసిందే.

04/30/2016 - 02:28

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 29: పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతోనే బంగారు తెలంగాణ కల సాకారం కానుందని భారీ నీటిపారుదల శాఖా మంత్రి టి హరీశ్‌రావు అన్నారు. ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి తెలంగాణలోని పలు జిల్లాల్లో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్టు ప్రకటించారు.

04/30/2016 - 02:25

సంగారెడ్డి, ఏప్రిల్ 29: పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నారాయణఖేడ్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని కల్హేర్ మండలం సుల్తానాబాద్ గ్రామ శివారు నల్లచెరువు వద్ద పశువుల పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యే మారెడ్డి భూపాల్‌రెడ్డి శుక్రవారం ఉదయం ఈ కేంద్రాన్ని ప్రారంభించారు.

04/29/2016 - 06:48

తిరుపతి, ఏప్రిల్ 28: తిరుమలలో టిటిడి కల్యాణ వేదికలో వివాహాలు చేసుకునే వధూవరులకు మే 9 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని టిటిడి ఇ ఒ సాంబశివరావు ఐటి అధికారులను ఆదేశించారు. గురువారం టిటిడి పరిపాలనాభవనంలో తన కార్యాలయంలో ఆయన ఐటి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 9న అక్షయ తృతీయ సందర్భంగా ఆన్‌లైన్ దరఖాస్తులు అందుబాటులో ఉంచాలన్నారు.

04/29/2016 - 06:18

హైదరాబాద్, ఏప్రిల్ 28: ఆర్టీసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ, మిషన్ భగీరథ వైఎస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షులు దేవులపల్లి ప్రభాకర్‌రావు, బుద్ధవనం స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్యలు శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. ఆర్టీసి చైర్మన్‌గా సోమారపు సత్యనారాయణ మధ్యాహ్నాం 3.30కి బాధ్యతలు స్వీకరిస్తారు.

04/29/2016 - 06:18

హైదరాబాద్, ఏప్రిల్ 28: ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికకు దూరంగా ఉంటున్నట్టు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ చెప్పారు. తగినంత బలం లేనందున తాము ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కరవు నివారణ చర్యలను చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు.

04/29/2016 - 06:16

హైదరాబాద్, ఏప్రిల్ 28: తాను పార్టీ మారుతున్నట్లు పార్టీ నేతలే దుష్ప్రచారం చేయడాన్ని సీ ఎల్పీనేత కే.జానారెడ్డి ఖండించారు. తనపై నమ్మకం లేకపోతే సిఎల్‌పి పదవి నుంచి తప్పుకుంటానని కూడా ఆయన చెప్పారు. గురువారం ఇక్కడ సిఎల్‌పి కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశం జరిగే తీరుకు నిరసనగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశం నుంచి వాకౌట్ చేశారు.

04/29/2016 - 06:16

హైదరాబాద్, ఏప్రిల్ 28: తెలంగాణలో ఈ నెల 17న జరిగిన ఎస్‌ఐ రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ప్రిలిమినరీ టెస్ట్ ఫలితాలను డిజిపి అనురాగ్ శర్మ తన కార్యాలయంలో విడుదల చేశారు. పురుషుల్లో 52, మహిళల్లో 41 శాతం ఉత్తీర్థులయ్యారు. సబ్-ఇనె్స్పక్టర్ ఆఫ్ పోలీస్ (సివిల్) పరీక్షలో 1,52,875 పురుషులకు గానూ 79.854 మంది ఉత్తీర్ణత సాధించగా, 22.067 మంది మహిళలకు గానూ 9.021 మంది ఉత్తీర్ణత సాధించారు.

Pages