S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/08/2016 - 12:39

హైదరాబాద్, ఏప్రిల్ 7: నూతన తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని రాజ్‌భవన్‌లో ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఏర్పాటు చేసిన ఉగాది వేడుకలకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ హాజరయ్యారు. అయితే ఈ వేడుకల ప్రారంభోత్సవ సమయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు హాజరుకాగా, గంట ఆలస్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అప్పటికే కెసిఆర్ వెళ్లిపోయారు.

04/08/2016 - 12:24

కదిరిటౌన్, ఏప్రిల్ 7: ధర్నా చేస్తున్న వైకాపా ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేయటంతో అనంతపురం జిల్లా కదిరిలో గురువారం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కదిరి వైకాపా ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా కారుపై ఇటీవల తలుపుల మండలంలో దాడి జరిగింది.

04/08/2016 - 05:49

హైదరాబాద్, ఏప్రిల్ 7: మారిషస్ కమర్షియల్ బ్యాంకు దాఖలు చేసిన కేసులో కేంద్ర మంత్రి సుజనా చౌదరికి నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. విచారణ సందర్భంగా గురువారం కోర్టుకు హాజరుకాకపోవడంతో 12వ అదనపు చీఫ్‌మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఈ వారెంట్‌ను జారీచేశారు.

04/08/2016 - 05:45

హైదరాబాద్, ఏప్రిల్ 7: అక్షయ గోల్డ్ కేసు విచారణ తీరు పట్ల హైకోర్టు గురువారం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ సిఐడి ఈ నెల 21వ తేదీన కేసుకు సంబంధించి పూర్తి నివేదిక వివరాలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

04/08/2016 - 05:43

హైదరాబాద్, ఏప్రిల్ 7: రాష్ట్రంలో వడగాడ్పులకు 45 మంది మృతి చెందారని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప గురువారం చెప్పారు.శ్రీకాకుళంలో ఇద్దరు, విజయనగరంలో ముగ్గురు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో 11 మంది, చిత్తూరులో ముగ్గురు, అనంతపురం జిల్లాలో నలుగురు, కడప జిల్లాలో 16 మంది మృతి చెందారని పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో ముగ్గురు మృతి చెందారని ఆయన చెప్పారు.

04/08/2016 - 05:42

హైదరాబాద్, ఏప్రిల్ 7: హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ విద్యార్థుల తరఫున హైకోర్టులో వాదనలు వినిపిస్తున్న న్యాయవాదికి వర్శిటీలో ఎటువంటి అవరోధాలు కల్పించరాదని హైకోర్టు గురువారం వర్శిటీ అధికారులను ఆదేశించింది. క్యాంపస్‌లో ఉన్న విద్యార్థులు అడ్వకేట్‌కు క్లయింట్‌లని వారిని కలుసుకోవడానికి వస్తే ఆటంకాలు సృష్టించవద్దని ఆదేశించారు. ఈ వర్శిటీకి సంబంధించి దాఖలైన కేసులను హైకోర్టు గురువారం విచారించింది.

04/08/2016 - 05:41

హైదరాబాద్, ఏప్రిల్ 7: తెలంగాణలో మిషన్ భగీరథలో ఇంటింటికి మంచినీటిని అందించే పథకంలో భాగంగా ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా ఇంటింటికి ఇంటర్‌నెట్ కనెక్షన్ అందించనున్నారు. ఆరునెలల్లో ఇంటింటికి ఇంటర్‌నెట్ ప్రారంభం అవుతుంది. దీనికి సంబంధించిన పనుల పురోగతిపై ఐటి, పంచాయతీరాజ్ శాఖల మంత్రి కె తారక రామారావు గురువారం అధికారులతో సమీక్ష జరిపారు.

04/08/2016 - 05:37

హైదరాబాద్, ఏప్రిల్ 7 : ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ముందుకు రావాలని, తమవంతు సహకారం అందించాలని భగవాన్ విశ్వయోగి విశ్వంజీ పిలుపునిచ్చారు. దుర్ముఖి నామ ఉగాది సందర్భంగా ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ఆశీస్సులు అందజేశారు.

04/08/2016 - 05:34

గుర్రంపోడ్/పుల్కల్, ఏప్రిల్ 7: నల్లగొండ జిల్లా నడికుడ గ్రామానికి చెందిన కట్టెబోయిన లింగయ్య(30) పత్తిరైతు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా పుల్కల్ మండలంలోని మిన్‌పూర్ తండాకు చెందిన ఉమ్లనాయక్ (55) తన పొలంలోనే చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందాడు.

04/08/2016 - 05:34

హైదరాబాద్, ఏప్రిల్ 7: తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ఈ నెల 17న ఎస్‌ఐ నియామకాలకు రాత పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

Pages