S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/08/2016 - 05:32

హైదరాబాద్, ఏప్రిల్ 7: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించి రూ. 36,663 కోట్ల ఆదాయం పన్నును గత ఆర్థిక సంవత్సరానికి వసూలు చేసినట్లు ఆదాయంపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేశ్ బాబు ప్రకటించారు. 2014-15 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 15.4 శాతం ఎక్కువగా ఆదాయం పన్నును వసూలు చేశామన్నారు. వాస్తవానికి రూ. 36,251 కోట్లు వసూలుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

04/08/2016 - 05:18

హైదరాబాద్, ఏప్రిల్ 7: నూతన తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని రాజ్‌భవన్‌లో ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఏర్పాటు చేసిన ఉగాది వేడుకలకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ హాజరయ్యారు. వేడుకల ప్రారంభోత్సవ సమయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు హాజరుకాగా, గంట ఆలస్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చారు. అప్పటికే కెసిఆర్ వెళ్లిపోయారు.

04/08/2016 - 05:15

హైదరాబాద్, ఏప్రిల్ 7: నవంబర్ నెలలోగా కాకినాడ, కర్నూలు నగర పాలక సంస్థలకు ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాలని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ రెండు నగర పాలక సంస్థలకు ఎన్నికలు సత్వరమే నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు విచారించింది. ఈ పిటిషన్లను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి బోసలే, జస్టిస్ పి నవీన్‌రావుతో కూడిన ధర్మాసనం విచారించింది.

04/08/2016 - 04:38

విజయవాడ,ఏప్రిల్ 7: వినియోగదారులకు,ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం కలిగించే రీతిలో విద్యుత్ రంగంలో రాబోతున్న సంస్కరణలను తాను ఆహ్వానిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వీటిని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి వెన్నుదన్నుగా నిలుస్తానని విద్యుత్ సమర్థ వినియోగంపై అంతర్జాతీయ సదస్సును గురువారం ప్రారంభించిన సందర్భంగా అన్నారు.

04/08/2016 - 04:41

విజయవాడ, ఏప్రిల్ 7: ఈ వేసవిలో మంచినీటి ఎద్దడి లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్లను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు జిల్లాల్లో నీటి ఎద్దడి నివారణకు జిల్లాల వారీగా కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు.

04/08/2016 - 04:25

చిత్తూరు, ఏప్రిల్ 7: చిత్తూరు జిల్లా కోర్టులో గురువారం మధ్యాహ్నం జరిగిన బాంబు పేలుడు ఘటన కలకలం రేపింది. ఈ సంఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. నాలుగు వాహనాలు పాక్షికంగా ధ్వంసమైయ్యాయి. ప్రధాన కోర్టు ప్రాంగణంలోనే ఘాతుకం జరగడం ప్రజల్ని తీవ్ర ఆందోళనకు గురి చేసింది. జిల్లా స్పెషన్స్‌కోర్టు సమీపంలోని వాహనాలు నిలిపే స్థలంలో పార్కింగ్ స్థలంలోనే ఇది జరగడం హాహాకారాలు రేకెత్తించింది.

04/07/2016 - 01:07

హైదరాబాద్, ఏప్రిల్ 6: శ్రీనగర్‌లోని ఎన్‌ఐటి (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) పోలీసుల దెబ్బలకు గాయపడిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తమను తక్షణం వేరే ఎన్‌ఐటికి తరలించాలని హెచ్‌ఆర్‌డి బృందాన్ని బుధవారం కోరారు. శ్రీనగర్ నుండి కొంతమంది తెలుగు విద్యార్థులు తమ బాధలను టెలిఫోన్‌లో హైదరాబాద్ పాత్రికేయులకు వివరించారు.

04/07/2016 - 00:58

హైదరాబాద్, ఏప్రిల్ 6: భారీ వీసా కుంభకోణానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై అమెరికా డిపార్టుమెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ ఇన్విస్టిగేషన్ యూనిట్ అరెస్టు చేసిన పదిమంది ఎన్‌ఆర్‌ఐలలో ముగ్గురు తెలుగువారే కీలక నిందితులని తెలుస్తోంది. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ సైతం తెలుగువారి ప్రమేయాన్ని ధ్రువీకరించింది.

04/06/2016 - 08:14

తిరుపతి, ఏప్రిల్ 5: పేద బడుగు, అసంఘటిత కార్మికుల సంక్షేమాన్ని విస్మరించి వ్యవహరిస్తున్న టిడిపి ప్రభుత్వాన్ని 2019 ఎన్నికల్లో తుడిచిపెట్టుకుని పోయే విధంగా టిడిపి, బిజెపి వ్యతిరేకులందర్నీ ఒక్కతాటిపైకి తీసుకువస్తానని, జగన్, పవన్‌లను స్వయంగా కలిసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తానని మాజీ కేంద్రమంత్రి డాక్టర్ చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

04/06/2016 - 08:12

హైదరాబాద్, ఏప్రిల్ 5: స్థిరాస్తి రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారు కోర్టు కేసుల్లో ఇరుక్కోకుండా గ్యారంటీ పట్టా పొందేలా రిజిస్ట్రేషన్ చట్టాన్ని సవరించాలని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులకు వేర్వేరుగా లేఖలు రాశారు.

Pages