S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/06/2016 - 05:38

హైదరాబాద్, ఏప్రిల్ 5 : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో రెండు నెలల వరకు తీవ్రం నుండి అతితీవ్రమైన ఎండలు ఉంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించింది. గత సంవత్సరం తీవ్రమైన ఎండల వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో 2,500 మంది ప్రాణాలు కోల్పోయారని, అందువల్ల ఈ సంవత్సరం ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ ఐఎండి పరోక్షంగా హెచ్చరించింది.

04/05/2016 - 03:52

హైదరాబాద్, ఏప్రిల్ 4: కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ సోమవారం నాడు విడుదల చేసిన దేశంలో అగ్రగామి విశ్వవిద్యాలయాల జాబితాలో తెలంగాణకు చెందిన మూడు, ఆంధ్రాకు చెందిన మూడు విశ్వవిద్యాలయాలు చోటును సంపాదించుకున్నాయి. వీటితో పాటు పలు ఇంజనీరింగ్, ఎంబిఎ, ఫార్మసీ కాలేజీలు టాప్ రేటింగ్ కాలేజీల జాబితాలో ఉన్నాయి.

04/05/2016 - 03:46

హైదరాబాద్, ఏప్రిల్ 4: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ(హెచ్‌సియు)లో ఉద్యమాలు రాజుకుంటున్నాయి. సోమవారం నాడు చలో రాజ్‌భవన్ నిర్వహించిన విద్యార్థి నాయకులు మంగళవారం, బుధవారాలకు ఆందోళన కార్యక్రమాలు రూపొందించారు. 13న భారీ ర్యాలీకి సన్నద్ధమవుతున్నారు. వైస్ చాన్సలర్ అప్పారావును తొలగించాలన్న డిమాండ్‌తో హెచ్‌సియు జాక్ నేతలు ఉద్యమిస్తున్నారు. 6న చలో హెచ్‌సియు కార్యక్రమాన్ని చేపడతారు.

04/05/2016 - 03:41

హైదరాబాద్, ఏప్రిల్ 4: పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్యను అమలు చేసేందుకు ఉద్దేశించిన 2009 చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలదేనని హైకోర్టు స్పష్టం చేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బోసేల్, జస్టిస్ పి.నవీన్‌రావుతో కూడిన డివిజన్‌బెంచ్ సోమవారం ఈ ఆదేశాలు జారీ చేసింది.

04/05/2016 - 03:38

హైదరాబాద్, ఏప్రిల్ 4: భారత విద్యార్థి ఫెడరేషన్ ఈ నెల 12వ తేదీన రెండు రాష్ట్రాల్లో నమూనా ఎంసెట్‌ను నిర్వహిస్తున్నట్టు మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, ఎపి రాష్టక్రార్యదర్శి ఎస్ నూర్ మహమ్మద్, టిఎస్ కార్యదర్శి బి సాంబశివలు తెలిపారు. గత 15 ఏళ్లుగా మోడల్ ఎమ్సెట్‌ను నిర్వహిస్తున్నామని, రాష్ట్రప్రభుత్వం నిర్వహించే ఎంసెట్‌కు ధీటుగా ఇది ఉంటోందని వారన్నారు.

04/05/2016 - 03:37

హైదరాబాద్, ఏప్రిల్ 4: తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష నిర్వహణను నిలిపివేసినట్టు పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ వెల్లడించారు. ఈ పరీక్షను షెడ్యూలు ప్రకారం ఈ నెల 24,25 తేదీల్లో నిర్వహించాల్సి ఉందని, అయితే రాష్ట్రప్రభుత్వ సూచన మేరకు దీనిని వాయిదా వేస్తున్నట్టు ఆమె చెప్పారు. ప్రస్తుతం 439 పోస్టుల భర్తీకి సన్నాహాలు చేశామని, రానున్న రోజుల్లో పోస్టుల సంఖ్య పెరగవచ్చని అన్నారు.

04/05/2016 - 03:37

హైదరాబాద్, ఏప్రిల్ 4: మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని అదుపు చేసేందుకు తగిన కార్యాచరణను రూపొందించి, ఆ నివేదికను తమకు అందజేయాల్సిందిగా ఎపి, తెలంగాణ ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. గత నెల 15న విజయవాడ శివారులోని గొల్లపూడి వద్ద వైద్య విద్యార్థుల బస్సు దుర్ఘటనలో నలుగురు విద్యార్థులు చనిపోవడంపై పత్రికల్లో వచ్చిన వార్తలను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు సోమవారం ఈ ఆదేశాలు జారీ చేసింది.

04/05/2016 - 02:10

హైదరాబాద్, ఏప్రిల్ 4: యాదాద్రి, వేములవాడ తరహాలోనే భద్రాద్రి అభివృద్ధికి బృహత్ ప్రణాళికను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించనున్నారు. భద్రాద్రిలో ఈనెల 15న శ్రీ సీతారామచంద్ర కల్యాణ మహోత్సవానికి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కెసిఆర్ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఈ ప్రణాళికను కేసిఆర్ ప్రకటిస్తారు.

04/05/2016 - 02:02

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని పటిష్ఠం చేసేందుకు అనుసరించవలసిన వ్యూహంపై కాంగ్రెస్ అధినాయకత్వం దృష్టి సారించింది. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ సోమవారం సాయంత్రం తమ నివాసంలో సిఎల్‌పి నాయకుడు కె జానారెడ్డి, విధాన మండలిలో కాంగ్రెస్ పక్షం నాయకుడు షబ్బీర్ అలీ, పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్కతో సమాలోచన జరిపారు.

04/05/2016 - 01:49

హైదరాబాద్, ఏప్రిల్ 4: హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ అప్పారావును వెంటనే రీకాల్ చేయాలంటూ వామపక్షాల కార్యకర్తలు సోమవారం రాజ్‌భవన్ ముట్టడికి యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో రాజ్‌భవన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులకు, వామపక్ష కార్యకర్తలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. వామపక్ష కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావడంతో రాజ్‌భవన్ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించింది.

Pages