S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/25/2016 - 01:06

హైదరాబాద్, జనవరి 24: హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ ఇన్‌చార్జీ వైస్ చాన్సలర్‌గా ప్రొఫెసర్ విపిన్ శ్రీవాత్సవను నియమించడంపై ఎస్సీ, ఎస్టీ విద్యార్ధి సంఘాలు, అధ్యాపక సంఘాలు మండిపడుతున్నాయి. తమిళనాడుకు చెందిన సెంథిల్‌కుమార్ అనే ఫిజిక్స్ పరిశోధన విద్యార్ధి 2008లో ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సమయంలో ఫిజిక్స్ డిపార్టుమెంట్ డీన్‌గా ప్రొఫెసర్ శ్రీవాత్సవ ఉన్నారని విద్యార్ధి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

01/25/2016 - 01:05

హైదరాబాద్, జనవరి 24: ఆత్మహత్య చేసుకున్న సెంట్రల్ వర్శిటీ విద్యార్ధి రోహిత్ వేముల ఫేస్‌బుక్‌లో పేర్కొన్న అంశాలను విశే్లషిస్తే అతని అంతరంగంలో తలెత్తిన కల్లోలం, ఆటుపోట్లు, మానసిక సంఘర్షణ విదితమవుతాయి. 2013 మేలో ఫేస్‌బుక్‌లో రోహిత్ ఇలా రాశారు. ‘నా తల్లి పవిత్రమైన మాతృమూర్తి. నాకు జీవితమంటే విరక్తి పుట్టినప్పుడల్లా నా తల్లిని తలుచుకుంటాను. ఆమె జ్ఞాపకాలనుంచి స్ఫూర్తి పొందుతుంటాను.

01/25/2016 - 01:04

బంగారుపాళ్యం, జనవరి 24: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రత్యేక వాహనంలో బయలుదేరిన భక్త బృందం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వద్ద ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి.

01/25/2016 - 01:03

మహబూబ్‌నగర్, జనవరి 24: అడవుల్లో నివసించే చెంచుల ఆరోగ్య పరిరక్షణకు తెలంగాణ రచయితల వేదిక నడుం బిగించింది. మహబూబ్‌నగర్ జిల్లా నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలోని అప్పాపూర్ చెంచుపెంటల్లో ఆదివారం వైద్య శిబిరం నిర్వహించి రెండు వందలమందికి పైగా ఆదివాసీలకు చికిత్స అందించింది.

01/25/2016 - 01:02

భద్రాచలం, జనవరి 24: ఖమ్మం జిల్లా భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి సన్నిధిలోని మిథిలా స్టేడియం సమీపాన స్వామి ఉత్తరద్వారంలో ఆదివారం తెలుగు రాష్ట్రాల చిన్నారులు భక్తరామదాసు కీర్తనలకు అనుగుణంగా రామయ్యకు నృత్యాభిషేకం చేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు దక్కించుకున్నారు. గతంలో అన్నమయ్య కీర్తనలకు నృత్యాలు చేసిన చిన్నారులు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్సులో నమోదయ్యారు.

01/25/2016 - 01:01

సంగారెడ్డి, జనవరి 24: ఏటా సాహస బాలలకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక గీతా చోప్రా అవార్డు దక్కించుకున్న మెదక్ జిల్లా బాలిక రుచిత కనబరచిన ధైర్య సాహసాలు నిరుపమానం. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల రుచిత కనబరిచిన తెగువ మరో ఇద్దరు బాలలకు ప్రాణభిక్ష పెట్టింది. ఇంతకీ రుచిత చేసిన సాహసమేమిటి?

01/25/2016 - 00:39

హైదరాబాద్, జనవరి 24: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో తెదేపా- భాజపాలను గెలిపిస్తే పూర్తిస్థాయిలో నగరంలో వైఫై ఏర్పాటు చేస్తామని, పైపు లైన్ల ద్వారా వంట గ్యాస్ అందిస్తామని, ప్రతి ఇంటికీ ఉచితంగా సెట్ టాప్ బాక్స్ ఇస్తామని, పేదలకు ఉచిత నల్లా కనెక్షన్ కల్పిస్తామని, శివారు ప్రాంతాలకు వౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెదేపా -్భజపా సంయుక్త ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నాయి.

01/25/2016 - 00:38

హైదరాబాద్, జనవరి 24: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ప్రతి ఇంటికీ తాగు నీరు ఉచితంగా అందిస్తామని, బిల్లు వసూలు చేసేదిలేదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రకటించింది. సీమాంధ్ర నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచీ వలస వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారి రక్షణ బాధ్యత తమదేనని, సెటిలర్లు అనే పదాన్ని నిషేధిస్తామని పేర్కొంది.

01/25/2016 - 00:37

హైదరాబాద్, జనవరి 24: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కంటే ఎక్కువ ఉండేలా బడ్జెట్ ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి (2016-17) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే కనీసం పది లక్షలైనా ఎక్కువ ఉండేందుకు ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నట్టు అధికార వర్గాల సమాచారం. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.

01/25/2016 - 00:36

ప్రతి శుక్రవారం పాఠకులను అలరిస్తున్న వెనె్నల సినిమా ప్రత్యేక అనుబంధం ఇక (జనవరి 26) నుంచి ప్రతి మంగళవారం అందుతుంది. మంగళవారం రావాల్సిన యువ ప్రత్యేక పేజీ శుక్రవారం వెలువడుతుంది. పాఠకులు గమనించగలరు.
-ఎడిటర్

Pages