S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/03/2016 - 02:14

హైదరాబాద్, ఏప్రిల్ 2: రాష్ట్రంలో కొత్తగా రూపొందించిన ఐటీ విధానాన్ని సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించనుంది. హైటెక్స్‌లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కనె్వన్షన్ సెంటర్‌లో సోమవారం మూడు గంటలకు జరిగే ఐటీ ఆవిష్కరణ కార్యక్రమంలో గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు, ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణమూర్తి పాల్గొంటారని ఐటీశాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

04/03/2016 - 02:08

విజయవాడ, ఏప్రిల్ 2: రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త. అన్ని ప్రభుత్వ శాఖల్లో సుమారు 20 వేల పోస్టుల భర్తీకి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వీటిని ఒక సంవత్సరంలోగా భర్తీ చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. రాష్ట్ర క్యాబినెట్ సమావేశం శనివారం స్థానిక ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగింది.

04/03/2016 - 01:52

విజయవాడ, ఏప్రిల్ 2: రాష్ట్రంలో వివిధ సంస్థలకు, పలు పరిశ్రమలకు భూములను కేటాయిస్తూ శనివారం ఇక్కడ జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. చిత్తూరు జిల్లా సత్యవీడులో హీరో కంపెనీకి 600 ఎకరాల భూమిని కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కంపెనీ సంవత్సరానికి 18 లక్షల ద్విచక్ర వాహనాలను తయారు చేయనుంది.

04/03/2016 - 01:48

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గడువు పొడిగించేందుకు కేంద్రం సుముఖంగా ఉంది. దీన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ఇప్పటికే గుర్తించి కొంతమేరకు నిధులు కేటాయిస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనుల తీరును సమీక్షించేందుకు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఇక్కడికి ఆహ్వానిస్తున్నట్లు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతి శనివారం విలేఖరులకు తెలిపారు.

04/03/2016 - 01:45

నెల్లూరు రూరల్, ఏప్రిల్ 2: అర్చకుడు, అతని భార్యను శనివారం అత్యంత దారుణంగా హత్యచేసిన సంఘటన నెల్లూరు శివారు చెరుకూరు గ్రామంలో శివాలయంలో జరిగింది.

04/03/2016 - 01:34

విజయవాడ, ఏప్రిల్ 2: రాష్ట్రంలోని నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీలకు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ తదితర నగర పాలక సంస్థలు, వివిధ మున్సిపాలిటీలకు చాలాకాలంగా ఎన్నికలు జరగలేదు. వీటన్నింటికీ జూన్, జూలై నెలల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.

04/03/2016 - 01:31

విజయవాడ, ఏప్రిల్ 2: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తైవాన్ అధ్యక్షుడి సలహాదారు మైఖేల్ వాంగ్ నేతృత్వంలోని ఎంటుఐ కన్సార్టియం ప్రతినిధి బృందం శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆయన క్యాంప్ కార్యాలయంలో సమావేశమయింది. ఆంధ్రప్రదేశ్‌లో పలు పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి తైవాన్ ఆసక్తి కనబరుస్తోంది. ఆయా పరిశ్రమల ఏర్పాటుకు అనువైన క్లస్టర్లను ఈ బృందం పరిశీలించనుంది.

04/03/2016 - 01:27

హైదరాబాద్, ఏప్రిల్ 2: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా భద్రాచలం రెవెన్యూ గ్రామం ఆనుకుని, ఆంధ్రలో విలీనమైన నాలుగు పంచాయితీ గ్రామాలను మళ్లీ తెలంగాణలో విలీనం చేసే విషయమై రెండు రాష్ట్రాల్లో వాతావరణం వేడెక్కింది. సిఎం చంద్రబాబుతో ఈ నాలుగు గ్రామాల గురించి మాట్లాడితే, ఇచ్చేందుకు అంగీకరించారని సిఎం కె చంద్రశేఖరరావు నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు ప్రకటన చేశారు.

04/02/2016 - 04:57

హైదరాబాద్, ఏప్రిల్ 1: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ మరోమారు దద్దరిల్లింది. యూనివర్శిటీకి చెందిన 55 మంది సిబ్బంది శుక్రవారం సామూహిక సెలవుపై వెళ్లారు. వారు తమ లేఖల్లో యూనివర్శిటీలోని పరిణామాలను ప్రస్తావించకున్నా, అదే కారణంపై సెలవుపై వెళ్లారని తెలిసింది. మరో పక్క అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యులు వైస్ ఛాన్సలర్ చాంబర్ వద్ద రోజంతా ధర్నా చేశారు.

04/02/2016 - 03:21

నాగార్జునసాగర్, ఏప్రిల్ 1: ఎట్టకేలకు నాగార్జునసాగర్ జలాశయం నుండి ఎడమకాలువకు తాగునీటిని శుక్రవారం నాడు డ్యాం అధికారులు విడుదల చేశారు. గురువారం నాడు ప్రకటించినట్లుగానే శుక్రవారం ఉదయం 6:10నిమిషాలకు పొట్టిచెలిమ వద్ద ఉన్న ఎడమకాలువ ప్రధాన ద్వారం నుండి నీటివిడుదలను ప్రారంభించారు. ఎటువంటి అట్టహాసం లేకుండా జెఇ స్థాయి అధికారితో నీటివిడుదలను గావించారు.

Pages