S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/02/2016 - 03:05

ఖమ్మం, ఏప్రిల్ 1: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒక్కో దత్తత గ్రామాన్ని అభివృద్ధి చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి తెలిపారు.

04/02/2016 - 02:20

హైదరాబాద్, ఏప్రిల్ 1: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌కు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన డాక్టర్ ఎన్ రమేష్‌కుమార్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

04/02/2016 - 02:10

హైదరాబాద్/ నాచారం, ఏప్రిల్ 1: హిందూత్వమనేది ప్రకృతి విధ్వంసానికి అనుకూలమైనది కాదని, అది ప్రకృతి విధ్వంసాన్ని ఎప్పటికీ ఒప్పుకోదని బిజెపి మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి కెఎన్ గోవిందాచార్య అన్నారు. అవేర్‌నెస్, యాక్షన్ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్‌లోని దూర విద్యాకేంద్రంలో జాతీయవాదం అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు.

04/02/2016 - 02:05

హైదరాబాద్, ఏప్రిల్ 1: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో విద్యార్ధి ఉద్యమాలను నియంత్రించేందుకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు (సిఐఎస్‌ఎఫ్)ను నియమించాలని వర్శిటీ పాలకులు నిర్ణయించారు. సిఐఎస్‌ఎఫ్‌ను నియమించే వరకూ ప్రస్తుతం ఉన్న సెక్యూరిటీని పటిష్ఠం చేయాలని, అవసరమైతే మహిళా పోలీసులను సైతం నియమించాలని ఇటీవల జరిగిన డీన్‌లు, డైరెక్టర్ల సమావేశం నిర్ణయించింది.

04/02/2016 - 02:04

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: పట్టిసీమ ఎత్తిపోతల పథకం పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగం కాదని కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. న్యాయవాది శ్రవణ్ ఆర్టీఐ కింద అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. కేంద్ర జలవనరులశాఖ అమోదించిన సమగ్ర పాజెక్టు నివేదికలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం లేదని తెలిపింది.

04/02/2016 - 02:03

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: వైకాపా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ కేసును సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. రోజాపై ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ ఏపి శాసనసభ చేసిన తీర్మానాన్ని నిలుపుదల చేయడంపై హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును రోజా సుప్రీం కోర్టులో సవాల్ చేశారు.

04/02/2016 - 01:57

మండపేట, ఏప్రిల్ 1: తూర్పు గోదావరి జిల్లా మండపేటలోని ఓ ప్రైవేటు స్కూలు ఆవరణలోని అరటి చెట్టు ఆరు అడుగుల గెలతో అబ్బురపరుస్తోంది. గెల నేలకు తగులుతుండటంతో కర్రలతో ప్రత్యేక ఏర్పాటుచేశారు. నర్సరీల నుండి ఈ మొక్కను తీసుకొచ్చినట్టు సమాచారం. ఇంకా తయారవుతున్న దశలో ఉన్న ఈ గెలను చూడటానికి పలువురు తరలివస్తున్నారు.

04/02/2016 - 01:53

హైదరాబాద్, ఏప్రిల్ 1: రాష్ట్రంలో మళ్లీ ఉల్లిగడ్డల లొల్లి మొదలైంది. నిన్నటిదాకా మార్కెట్‌లో ఉల్లిగడ్డ కొరత ఏర్పడి కిలో వంద రూపాయల దాకా ధర పెరగడంతో వినియోగదారులు ఆందోళనకు దిగితే, వీటి నిల్వలపై తాజాగా ప్రభుత్వం విధించిన ఆంక్షలతో నేడు వ్యాపారులు ఆందోళన చేపట్టారు.

04/02/2016 - 01:38

ప్రత్యక్షంగా 15లక్షల మందికి ఉపాధి... పరోక్షంగా 53 లక్షల మందికి బతుకుదెరువు... రాష్ట్రానికి పన్నుల రూపంలో 30వేల కోట్ల ఆదాయం... తెలంగాణలో నెలకొల్పుతామన్న ఐటిఐఆర్‌పై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గుప్పించిన హామీలివి. ఇవన్నీ గాలికి కొట్టుకుపోయనట్టే కనిపిస్తోంది. ప్రస్తుత బిజెపి ప్రభుత్వం దీన్ని పట్టించుకునే పరిస్థితిలో లేదు.

04/02/2016 - 01:35

నిజామాబాద్, ఏప్రిల్ 1: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, 9 గంటల విద్యుత్ సరఫరా, వైద్యారోగ్యం తదితర పథకాలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు.

Pages