S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/24/2016 - 00:40

గుంటూరు, జనవరి 23: దేశం కోసం సరిహద్దుల్లో ప్రాణ త్యాగాలు చేస్తున్న భరతమాత ముద్దుబిడ్డలకు ఇవ్వని గౌరవం ఒక నకిలీ దళితుడికి ఇవ్వడం అవసరమా అని హిందూ ధర్మ పరిరక్షణ సమస్వయ సమితి గుంటూరు జిల్లా అధ్యక్షుడు దర్శనపు శ్రీనివాస్ ప్రశ్నించారు.

01/24/2016 - 00:39

హైదరాబాద్, జనవరి 23: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో క్రైస్తవ మతం ముసుగులో ఎస్సీలుగా చలామణి అవుతున్న వారిని గుర్తించాలని జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసింది.

01/24/2016 - 00:39

హైదరాబాద్/గచ్చిబౌలి, జనవరి 23: సెంట్రల్ వర్శిటీ ప్రాంగణంలో దీక్షలు చేస్తున్న విద్యార్థులకు పరామర్శల పరంపర కొనసాగుతోంది. శనివారంనాడు మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎపిపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి తదితరులు దీక్షాశిబిరాన్ని సందర్శించారు.

01/24/2016 - 00:38

హైదరాబాద్, జనవరి 23:సెంట్రల్ వర్శిటీ విద్యార్థి రోహిత్ మృతిపై ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. రోహిత్ ఆత్మహత్య దురదృష్టకరమని ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు వ్యాఖ్యానించారు. టిఆర్‌ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల కార్యక్రమం శనివారం తెలంగాణ భవన్‌లో జరిగింది.

01/24/2016 - 00:37

హైదరాబాద్, జనవరి 23: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్‌సియు) విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయపై నమోదు చేసిన కేసును ఉపసంహరించుకోవాలని పలు బిసి, దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. విద్యార్థి ఆత్మహత్యకు దత్తాత్రేయకు ఎలాంటి సంబంధం లేదని ఆ సంఘాలు పేర్కొన్నాయి. బిసి వర్గానికి చెందిన దత్తాత్రేయను మంత్రి పదవి నుంచి తొలగించే కుట్ర జరుగుతోందని ఆ సంఘాలు ఆరోపించాయి.

01/24/2016 - 00:21

హైదరాబాద్, జనవరి 23: విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని తెరాస ఎన్నికల ప్రణాళికలో పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేకంగా రూపొందించిన మేనిఫెస్టోను తెలంగాణ భవన్‌లో శనివారం విడుదల చేశారు. తెరాస ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన పనులను పేర్కొంటూ, చేయబోయే వాటిని కలిసి ఐటి మంత్రి కెటిఆర్, పార్టీ నేతలు డి శ్రీనివాస్ తదితరులు మ్యానిఫెస్టో విడుదల చేశారు.

01/24/2016 - 00:20

హైదరాబాద్, జనవరి 23: తెలంగాణ రాష్టస్థ్రాయి రిక్రూట్‌మెంట్ బోర్డు 9281 పోలీసు కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఫిబ్రవరి 4 వరకూ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్టు రిక్రూట్‌మెంట్ బోర్డు శనివారం పేర్కొంది. ఇప్పటి వరకు పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు 1,59,604 దరఖాస్తులు వచ్చాయని తెలిపింది.

01/24/2016 - 01:35

హైదరాబాద్, జనవరి 23: ప్రపంచస్థాయి నగరలతో సమానంగా ఉన్నతస్థాయి ప్రమాణాలతో రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి బృహత్ ప్రణాళిక ఖరారు చేసామని, మహాయజ్ఞంలో అన్ని రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావాలని సిఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

01/24/2016 - 00:19

హైదరాబాద్, జనవరి 23: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు చేపట్టిన ఆమరణ దీక్ష భగ్నమైంది. పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ విద్యార్థి సంఘాల జెఏసి ఆధ్వర్యంలో చేపట్టిన విద్యార్థుల ఆమరణ దీక్ష శనివారంతో ఐదోరోజుకు చేరింది. విద్యార్థులకు షుగర్ లెవెల్ తగ్గిపోయిందని, ఆరోగ్యం క్షీణించిందని వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు తెలిపారు.

01/24/2016 - 00:18

విజయవాడ, జనవరి 23: ప్రస్తుత న్యాయ విచారణ పద్ధతుల్లో వేగవంతమైన మార్పు తెచ్చి, వినియోగదార్లకు న్యాయవ్యవస్థను మరింత చేరువ చేసేందుకు కోర్టులు, పోలీసు విధానాలు, ప్రజల ఆకాంక్షలకు మధ్య పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వారధిగా పనిచెయ్యాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ పిలుపునిచ్చారు. విజయవాడలో శనివారం రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ల తొలి సమావేశాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

Pages