S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/02/2015 - 07:45

కడప, డిసెంబర్ 1: గత రెండురోజులుగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు సోమశిల ప్రాజెక్టుకు పెద్దఎత్తున నీరు చేరి 68 టిఎంసిల నీరు నిల్వఉంచడంతో బ్యాక్‌వాటర్‌లో వైఎస్‌ఆర్ కడప జిల్లాలోని పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. అంతకుముందు వారంరోజులు కురిసిన వర్షాలకు 64టిఎంసిల నీరును నిల్వచేయగా, ప్రస్తుతం 68 టిఎంసిలకు చేరింది.

12/02/2015 - 07:44

ప్రత్తిపాడు, డిసెంబర్ 1: కాపులను బీసీల్లో చేరుస్తూ 2016 బడ్జెట్ సమావేశాల్లో చట్టం చేయాలని మాజీ మంత్రి, కాపురిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం డిమాండు చేశారు. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంగళవారం ఆయన ఒక లేఖ రాశారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో లేఖను పత్రికలకు విడుదలచేశారు.

12/02/2015 - 07:36

హైదరాబాద్/ నల్లగొండ, డిసెంబర్ 1: ఇందిరాగాంధీ ప్రధానిగా పనిచేసిన సమయంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇరవై సూత్రాల ఆర్థిక కార్యక్రమం’ (20 పాయింట్ ప్రోగ్రాం) ఉం టుందా? ఊడుతుందా? అన్నది చర్చనీయాంశం అయింది. కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి కేంద్రీకరించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

12/02/2015 - 07:33

హైదరాబాద్, డిసెంబర్ 1: ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఉపశమనం కలిగించే విధంగా వచ్చే మూడు రోజుల్లోగా ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు సహాయ చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ హైకోర్టు మంగళవారం ఆదేశించింది.

12/02/2015 - 07:31

కడప, డిసెంబర్ 1: కడప-కర్నూలు హైవేపై చెన్నూరు మండలం దౌలతాపురం క్రాస్ వద్ద ఏడుగురు ఎర్రచందనం అంతర్జాతీయ స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్‌చేశారు. వీరిలో ఇద్దరు చైనా, మరో ఇద్దరు టిబెట్‌కు చెందినవారు. ఓఎస్‌డి (ఆపరేషన్స్) రాహుల్‌దేవ్ శర్మ జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం వివరాలు తెలియజేస్తూ స్మగ్లర్లకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

12/02/2015 - 07:20

హైదరాబాద్, డిసెంబర్ 1: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనను గాలికి వదిలేసి పార్టీ ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎపిసిసి) అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి విమర్శించారు.

12/02/2015 - 07:18

హైదరాబాద్/గచ్చిబౌలి, డిసెంబర్ 1: సైబరాబాద్‌లో శాంతి భద్రతలు, మహిళా భద్రతను తెలుసుకునేందుకు మంగళవారం విదేశీ పార్లమెంట్ ప్రతినిధి బృదం సైబరాబాద్ కమిషనరేట్‌ను సందర్శించింది. 24దేశాలకు చెందిన 46మంది పార్లమెంట్ సభ్యులు సైబరాబాద్ పరిధిలోని ఇన్ఫర్మేషన్ టెక్మాలజీ కారిడార్‌ను పరిశీలించారు. అనంతరం సైబరాబాద్ కమిషనరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో సమావేశమయ్యారు.

12/02/2015 - 07:09

రాజమండ్రి, డిసెంబర్ 1: వాజపేయ్ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబునాయుడు విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు ప్రయత్నాలు జరిపారని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆరోపించారు.

12/02/2015 - 07:08

హైదరాబాద్, డిసెంబర్ 1: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనను గాలికి వదిలేసి పార్టీ ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎపిసిసి) అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి విమర్శించారు.

12/02/2015 - 07:07

హైదరాబాద్, డిసెంబర్ 1: టిడిపి చేపట్టిన జన చైతన్య యాత్ర నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ వైకాపా వంద ప్రశ్నలతో ప్రజా బ్యాలెట్‌ను విడుదల చేసింది. టిడిపి చేపట్టింది జన చైతన్య యాత్ర కాదని, ప్రజలపై చేస్తున్న దండయాత్ర అన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల వేళలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమై ప్రజలను మొసం చేసిందని వైకాపా సీనియర్ నేత అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.

Pages