S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/01/2016 - 01:14

హైదరాబాద్, మార్చి 31: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీలు పెరిగాయి. కాని గృహ విద్యుత్ వినియోగదారులకు మాత్రం ప్రభుత్వం చార్జీలు పెంచకుండా ఊరట కలిగించింది. గృహేతర, వాణిజ్య కేటగిరీ, అక్వాకల్చర్, వీధి దీపాలు, ప్రభుత్వ మంచి నీటి పథకాలు, హెచ్‌టి-3, హెచ్‌టి-6 కేటగిరీలో 2 శాతం చొప్పున చార్జీలు పెంచింది. మొత్తం మీద రూ.

04/01/2016 - 01:11

హైదరాబాద్, మార్చి 31: అరకు ఎంపి కొత్తపల్లి గీత భర్త రామకోటేశ్వర రావు కిడ్నాప్, విడుదల ఉదంతం గురువారం కొత్త మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.

03/30/2016 - 05:12

హైదరాబాద్, మార్చి 29: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా మొక్కు చెల్లించుకోవడానికి తిరుపతికి ప్రత్యేక ట్రైన్‌లో వెళ్లనున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు చెప్పారు. శాసనసభలో మంగళవారం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మొక్కులు చెల్లించుకోవడానికి తాను ఒక్కడినే కాకుండా పది జిల్లాల నుంచి ప్రజలను తీసుకెళ్తానని, అందుకోసం ప్రత్యేక ట్రైన్ ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి అన్నారు.

03/30/2016 - 05:03

విజయవాడ, మార్చి 29: విజయవాడలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవన నిర్మాణానికి అనుమతులు మంజూరైనట్టు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం వెలగపూడిలో ఆరు బ్లాకులతో తాత్కాలిక సెక్రటేరియట్ నిర్మాణం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఐదు బ్లాకుల్లో సెక్రటేరియట్, ఒక బ్లాక్‌లో అసెంబ్లీ భవన నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అయితే, అసెంబ్లీ భవన నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలో మార్పులు, చేర్పులు చేయాలని నిర్ణయించారు.

03/30/2016 - 04:58

తిరుపతి, మార్చి 29: టిటిడి నిర్వహిస్తున్న అన్నదాన ట్రస్టుకు దాతల నుంచి భూరి విరాళాలు భారీగా అందుతున్నాయి. ఈక్రమంలో 2015-16 సంవత్సరానికి రికార్డు స్థాయిలో రూ.104.54 కోట్లు విరాళాలు అందాయి. ఈసందర్భంగా జెఇఒ శ్రీనివాసరాజు మాట్లాడుతూ టిటిడి అన్నదాన ట్రస్టుకు హెచ్‌సిఎల్ అధినేత శివనాడార్ మంగళవారం ఒక కోటి ఒక్క రూపాయి విరాళంగా ఇచ్చారని అన్నారు.

03/30/2016 - 04:56

హైదరాబాద్, మార్చి 29: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ముఖ్య కార్యదర్శిగా హర్‌ప్రీత్ సింగ్ నియమితులయ్యారు. ప్రస్తుతం గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా ఉన్న నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనుండటంతో ఆయన స్థానంలో హర్‌ప్రీత్‌సింగ్‌ను నియమించారు. హర్‌ప్రీత్ సింగ్ ప్రస్తుతం తెలంగాణ కార్మిక శాఖ ఇన్‌చార్జి ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఆయన స్థానంలో అహ్మద్ నదీమ్ బాధ్యతలు చేపడతారు.

03/30/2016 - 02:40

విశాఖపట్నం, మార్చి 29: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విశాఖ జిల్లా ఏటికొప్పాక బొమ్మలు ఇక ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్నాయి. వందల సంవత్సరాలుగా హస్తకళా నైపుణ్యంతో రూపుదిద్దుకుంటున్న ఏటికొప్పాక బొమ్మలకు ఎంతో గిరాకీ ఉంది. వీటి విక్రయాలను అంతర్జాతీయ మార్కెట్‌కి విస్తరించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఎ) నిర్ణయించింది.

03/30/2016 - 01:06

హైదరాబాద్, మార్చి 29 : నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో 15,125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 2016 ఏప్రిల్ 14 నుండి ఏడాదిపాటు జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అసెంబ్లీలో మంగళవారం వెల్లడించారు.

03/30/2016 - 01:00

హైదరాబాద్, మార్చి 29: విశ్వవిద్యాలయాల వైస్‌చాన్సలర్ల నియామకంలో రాజకీయాలు ఉండరాదని, గత అనుభవాల దృష్ట్యా సమర్థులైన విద్యావేత్తలను వైస్‌చాన్సలర్లను ఎంపిక చేయాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రప్రభుత్వం రెండువర్శిటీల చట్టాన్ని సవరించేందుకు బిల్లులు తెచ్చిందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అన్నారు.

03/30/2016 - 00:57

కాకినాడ, మార్చి 29: ఇంతవరకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో తాను నిర్వర్తించిన అన్ని బాధ్యతల నుండి తప్పకుంటూ, ఆయా పదవులకు రాజీనామా చేసినట్టు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ లేఖ రాశారు. ఈ మేరకు నెహ్రూ మంగళవారం జగన్‌కు తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా పంపారు.

Pages