S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/22/2016 - 01:30

హైదరాబాద్, జనవరి 21: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య సంఘటనపై దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో యూనివర్శిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ దిగివచ్చింది. గురువారం నలుగురు విద్యార్థులపై సస్పెన్షన్‌ను ఎత్తివేసేందుకు పాలక మండలి సమావేశం నిర్ణయం తీసుకుంది.

01/22/2016 - 01:21

హైదరాబాద్, జనవరి 21: విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రధాన సమస్యగా మారిన గోదావరి జలాల వినియోగంపై గురువారం హైదరాబాద్‌లో జరిగిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాడిగా, వేడిగా జరిగింది. బోర్డు చైర్మన్ రామ్‌శరణ్ అధ్యక్షతన జలసౌధలో జరిగిన ఈ సమావేశంలో జలాల వినియోగంపై ఇరు రాష్ట్రాలు తమకున్న హక్కులు, అభ్యంతరాలను వ్యక్తం చేశాయి.

01/22/2016 - 01:18

హైదరాబాద్, జనవరి 21: రక్షణ రంగ ఉత్పత్తులు, విమానయాన రంగానికి సంబంధించి ఉత్పత్తులు చేస్తున్న లాక్‌హీడ్ కంపెనీ విభాగాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పావులు కదుపుతున్నారు. దావోస్ పర్యటన సందర్భంగా మూడో రోజు పలువురు ప్రముఖులు, అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు.

01/22/2016 - 01:18

హైదరాబాద్, జనవరి 21: కొత్త పరిశ్రమల ఏర్పాటు ఆంధ్ర ప్రదేశ్‌లో విస్తృత అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులు పెట్టే వారికి అన్ని రకాలుగానూ ప్రోత్సాహాన్ని అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అపారఖనిజ సంపద, వ్యవసాయ ఉత్పత్తులకు అవకాశాలు, సుదీర్ఘ సముద్రతీర ప్రాంతం రాష్ట్రానికి ఉందని, అలాగే వీటన్నింటినీ మించి నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉన్నాయని తెలిపారు.

01/21/2016 - 18:59

హైదరాబాద్‌: కొన్ని నెలలుగా వాయిదా పడుతున్న గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం ఎట్టకేలకు గురువారం జరిగింది. బోర్డు ఛైర్మన్‌ రామ్‌శరణ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు నియంత్రణ, నిబంధనల్లో కొన్ని సవరణలు చేసి వాటిని కేంద్ర జలవనరులశాఖకు పంపించాలని నిర్ణయించారు.

01/21/2016 - 16:43

చెన్నై:తమిళనాడులో కరడుగట్టిన ఉగ్రవాది తప్పించుకున్నాడు. ఉత్తరాదిలో ఏడు బాంబుపేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడైన సయ్యద్ మహ్మద్ అలీ పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడు. లక్నో కోర్టులో హాజరుపరిచి వేలూరుకు తీసుకొస్తుండగా మధ్యప్రదేశ్‌లోని ఇటార్సీ దగ్గర రైలులో నుంచి దూకి సయ్యద్ తప్పించుకున్నాడు.

01/21/2016 - 15:58

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. ఉపసంహరణ తర్వాత ఇండిపెండెంట్‌లతోపాటు వివిధ పార్టీలకు చెందిన 1,939 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 604 నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఇవాళ సాయంత్రంకల్లా అభ్యర్థుల తుది జాబితా వెలువడనుంది.

01/21/2016 - 15:53

హైదరాబాద్: హెచ్‌సీయూలో నలుగురు పీహెచ్‌డీ విద్యార్థులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. దళిత విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది.ప్రశాంత్, శేషయ్య, విజయ్‌, సుంకన్న విద్యార్థులపై విధించిన సస్పెన్షన్‌ ఎత్తివేస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది.

01/21/2016 - 14:02

హైదరాబాద్: హెచ్‌సీయూ విద్యార్థులను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతు రోహిత్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామి ఇచ్చారు. దేశం మొత్తం మీ వెంటే ఉందని రోహిత్ కుటుంబానికి దైర్యం చెప్పారు.

01/21/2016 - 13:24

సికింద్రాబాద్: దొంగచాటుగా రేషన్‌ సరుకులను దారి మళ్లిస్తున్న 26 మంది ముఠా ను టాస్క్ ఫోర్స్ అదుపులోకి తీసుకుంది. అదుపులోకి తీసుకున్నవారిలో డీలర్లు, బ్రోకర్లు, మిల్లర్లు ఉన్నారు. 362 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం, 500 క్వింటాళ్ల గోదుమలు, 630 లీటర్ల కిరోసిన్‌, రెండు ట్రక్కులను స్వాధీనం చేసుకున్నారు.

Pages