S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/28/2016 - 02:32

పోలవరం, మార్చి 27: వరదల సమయంలో సముద్రంలోకి వృథాగా పోతున్న గోదావరి జలాలను కృష్ణా నదిలోకి తరలించే ఉద్దేశ్యంతో పోలవరం మండలం పట్టిసం వద్ద నిర్మిస్తున్న భారీ ఎత్తిపోతల పథకం పూర్తయింది. కాంట్రాక్టు ఏజన్సీ ప్రభుత్వానికి ఈ భారీ ఎత్తిపోతల పథకాన్ని సోమవారం అప్పగించనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టిసం రానున్నారు. గత సంవత్సరం మార్చి 29న ఈ పథకం నిర్మాణానికి సిఎం శంకుస్థాపన చేశారు.

03/28/2016 - 05:44

హైదరాబాద్, మార్చి 27 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతా ల్లో నివసిస్తున్న బ్రాహ్మణుల్లో 90 శాతం పైగా పేదరికంలో మగ్గుతున్నారు. అర్ధశతాబ్దకాలంలో ఆర్థికం గా, సామాజికంగా, రాజకీయం గా బాగా దెబ్బతిన్న సామాజికవర్గం ఇది. సామాజిక మార్పులకు అనుగుణంగా ఈ వర్గం అభివృద్ధి చెందలేదు. ప్రభుత్వ చర్యలు సైతం ఈ వర్గానికి బాగా నష్టం చేశాయి.

03/28/2016 - 01:35

హైదరాబాద్, మార్చి 27: తెలంగాణ పోలీస్ శాఖలోని 9281 పోస్టుల భర్తీకి ఏప్రిల్ 3న జరగాల్సిన రాత పరీక్ష వాయిదా పడింది. అయితే 539 ఎస్సై పోస్టుల భర్తీకి జరగాల్సిన పరీక్ష మాత్రం యథాతథంగా కొనసాగుతుందని తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ తెలిపారు.

03/28/2016 - 01:34

హైదరాబాద్, మార్చి 27 : ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలను వణికిస్తున్న అంశం ‘వడదెబ్బ’. ఎండాకాలం ప్రారంభంలోనే ఒకవైపు తెలంగాణలో, మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ‘వడదెబ్బ’కు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. గతంలో ఎండలు ఎక్కువగా ఏప్రిల్ రెండోపక్షం నుండి మే చివరివరకు ఉండేవి. గత వారం, పదిరోజుల నుండే పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో వడదెబ్బ (సన్‌స్ట్రోక్) అంటే ఏమిటి? అన్న ప్రశ్న తలెత్తుతోంది.

03/28/2016 - 01:30

సికింద్రాబాద్, మార్చి 27: ఉగ్రవాదాన్ని సిద్ధాంతపరంగా ఎదుర్కోవాలే తప్ప ఆయుధాలతో కాదని దిల్లీకి చెందిన మేధావుల వేదిక ఇండియా ఫౌండేషన్ డైరక్టర్ అలోక్ బన్సాల్ పేర్కొన్నారు. ఆదివారం తార్నాకాలోని జాతీయ పౌష్టికాహార సంస్థలో ‘ఉగ్రవాదం నేడు.. అంశాలు, సవాళ్లు, స్పందనలు’ అనే అంశంపై సోషల్‌కాజ్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో కీలకోపన్యాసం చేశారు.

03/28/2016 - 01:27

హైదరాబాద్, మార్చి 27:వీణవంకలో దళిత అమ్మాయిపై జరిగిన అ త్యాచారం సంఘటనపై ఆదివారం శాసనసభలో కాంగ్రెస్ సభ్యులు వాకౌ ట్ చేశారు. వీణవంక అత్యాచార సంఘటనపై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రకటన చేశారు. ఈ ప్రకటనపై వివరణ అడిగేందుకు కాం గ్రెస్ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. దీంతో సభా వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు లేచి మంత్రి ప్రకటనలు, వివరణ ఉండదని రూల్స్ చదివి వినిపించారు.

03/28/2016 - 01:19

హైదరాబాద్, మార్చి 27: ఉపాధ్యాయుల నియామకం కోసం మే 1న టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) నిర్వహించి, తర్వాత డిఎస్సీ నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి శ్రీహరి వెల్లడించారు. శాసనసభలో ఆదివారం ప్రశ్నోత్తరాల వ్యవధిలో పాలకపక్ష సభ్యుడు పుట్టామధు, తెదేపా సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ రాష్ట్రంలో ఖాళీగావున్న టీచర్ పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామన్నారు.

03/28/2016 - 01:21

హైదరాబాద్, మార్చి 27: నీటి పారుదల రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం, కేటాయించిన నిధులు, ప్రాజెక్టుల పురోగతిపై ఈ నెల 31న అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ‘పవర్ పాయింట్ ప్రజెంటేషన్’ ఇవ్వనున్నారు. ఆదివారం అసెంబ్లీ స్పీకర్ ఎస్. మధుసూదనా చారి అధ్యక్షతన అసెంబ్లీ వ్యవహారాల సలహా సంఘం (బిఎసి) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి టి.

03/28/2016 - 01:17

హైదరాబాద్, మార్చి 27: ప్రాజెక్టుల రీ-డిజైనింగ్, రీ-ఇంజనీరింగ్ ఖర్చుతో కూడుకున్నదే అయనా, నీటి పథకాల సామర్థ్యం పెరుగుతుందని మంత్రివర్గ ఉప సంఘం అభిప్రాయపడింది. ఈ ప్రక్రియలో ఆర్థిక సమస్యలను అధిగమించేందుకు ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ఉప సంఘం నిశ్చితాభిప్రాయానికి వచ్చింది.

03/28/2016 - 00:50

విజయవాడ, మార్చి 27: తెలుగుదేశం పార్టీ మహానాడును ఈ ఏడాది గుంటూరులో నిర్వహించనున్నారు. రాష్ట్ర విభజన తరువాత కూడా గత ఏడాది మహానాడును హైదరాబాద్‌లో జరుపుకొన్నారు. కానీ ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌లోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ బాధ్యతను తాము తీసుకుంటామని గుంటూరు తెలుగుదేశం పార్టీ నాయకులు ముందుకు వచ్చారు. ఇందుకు చంద్రబాబు సరే అన్నట్టు తెలిసింది.

Pages