S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/27/2016 - 02:35

హైదరాబాద్, మార్చి 26: మహిళలు స్వశక్తితో పైకి ఎదిగినప్పుడే సాధికారత సాధించినట్లు అవుతుందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. శనివారం తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం అధ్వర్యంలో జరిగిన సమావేశానికి దత్తాత్రేయ, బిజెపి నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పురంధ్రీశ్వరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

03/27/2016 - 02:08

తిరుమల, మార్చి 26: వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల కొండంతా భక్తజనంతో నిండిపోయింది. సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుండగా కాలినడకన వచ్చే భక్తులకు 8గంటల సమయం పడుతోంది. రద్దీ పెరగడంతో తిరుమల జె ఇ ఓ శ్రీనివాసరాజు, ఆలయ డిప్యూటి ఇ ఒ చిన్నంగారి రమణలు అధికారులతో కలసి క్యూలైన్లను పరిశీలించారు. ఈసందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకున్నారు.

03/27/2016 - 02:07

అమలాపురం, మార్చి 26: తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది కర, కేశవదాసుపాలెం గ్రామ పంచాయతీల్లో శనివారం మధ్యాహ్నం ఒఎన్‌జిసికి చెందిన రెండు పైపులైన్ల నుండి భారీ ఎత్తున గ్యాస్ లీకేజి అయ్యింది. అంతర్వేది కర సెయింట్ మేరీ స్కూలు సమీపంలో కెవి 32 బావికి సంబంధించిన పైపులైన్ లీకై పెద్దఎత్తున శబ్దం చేస్తూ గ్యాస్ పైకి వెదజల్లింది.

03/27/2016 - 01:42

హైదరాబాద్, మార్చి 26: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్ధుల సంఘర్షణ నేపథ్యంలో వైస్ ఛాన్సలర్‌ను రీ కాల్ చేయాల్సిందిగా కోరుతామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శాసనసభలో చెప్పడంతో మరోమారు విసిల తొలగింపు అంశం తెరమీదకు వచ్చింది.

03/27/2016 - 01:41

హైదరాబాద్, మార్చి 26: ‘హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌ను రీ-కాల్ చేసే అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని, అది కేంద్రం పరిధిలో ఉండటంతో ప్రధానితో స్వయంగా చర్చించి రెండు, మూడు రోజులలోనే సమస్య పరిష్కారం అయ్యేటట్టు చూస్తా’నని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు.

03/27/2016 - 01:38

హైదరాబాద్, మార్చి 26: ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి వేముల రోహిత్ దళితుడు కాదని, వడ్డెర అని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి శనివారం శాసనసభలో తెలిపారు. హెచ్‌సియు సంఘటనపై వివిధ రాజకీయ పక్షాలు శనివారం శాసన సభలో వాయిదా తీర్మానానికి నోటీసు ఇచ్చాయి. ప్రభుత్వం వాయిదా తీర్మానాన్ని తిరస్కరించింది.

03/27/2016 - 01:37

నాంపల్లి, మార్చి 26: తన ప్రేమను నిరాకరించిందన్న అక్కసుతో యువతి గొంతు, చేయికోసి యువకుడు పరారయ్యాడు. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం బండ్లగూడెంలో శనివారం ఈ ఘోరం జరిగింది. బండ్లగూడెం గ్రామానికి చెందిన గార్లపాటి శేఖర్‌రెడ్డి కుమార్తె అనిత, వరంగల్‌కు చెందిన పంగ రాజ్‌కుమార్ గత కొంతకాలంగా హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ తపస్య జూనియర్ కళాశాలలో లెక్చరర్లుగా పనిచేస్తున్నారు.

03/27/2016 - 01:29

హైదరాబాద్, మార్చి 26 : ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ తక్కువ ధరకే బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ కల్పించడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. శాసనసభలో శనివారం ప్రత్యేకంగా ఈ అంశంపై ఒక ప్రకటన చేస్తూ, 15 నుండి 20 ఎంబీపిఎస్ వేగంతో గృహాలకు, 100 ఎంబీపిఎస్ నుండి ఒక జీబిపిఎస్ వేగంతో వ్యాపార, వర్తక సంస్థలకు బ్రాడ్ బ్యాండ్ అందించడమే తమ లక్ష్యమన్నారు.

03/27/2016 - 01:25

భువనగిరి, మార్చి 26: సంచార జాతికి చెందిన ఐదుగురు సభ్యుల కుటుంబం ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణంలో శనివారం తెల్లవారుజామున ఈ ఘోరం జరిగింది.

03/27/2016 - 01:22

హైదరాబాద్, మార్చి 26: వైకాపా నుంచి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు టిడిపిలో చేరనున్నారా? ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు దఫదఫాలుగా వైకాపాకు గుడ్‌బై చెప్పి టిడిపిలో చేరారు. తాజాగా వైకాపా శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ వైకాపాను వీడతారనే ప్రచారం ఊపందుకుంది. ఆయనతోపాటు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.

Pages