S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/27/2016 - 01:07

హైదరాబాద్, మార్చి 26: గ్రూప్-2 పోస్టుల భర్తీ కోసం ఏప్రిల్ 24, 25న నిర్వహించాల్సిన పరీక్షలను రెండు నెలలపాటు వాయిదా వేయాల్సిందిగా సిఎం కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఈమేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణిని ఆదేశించినట్టు సిఎంవో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అలాగే ఏప్రిల్ 4న జరుగనున్న కానిస్టేబుళ్ల నియామక పరీక్షను కూడా వాయిదా వేయాలని సిఎం సంబంధిత అధికారులను ఆదేశించారు.

03/27/2016 - 01:04

విశాఖపట్నం/ విజయనగరం, మార్చి 26: విజయనగర రాజవంశీకుడు, మాజీమంత్రి, మాజీ ఎంపి, విద్యావేత్త పూసపాటి ఆనందగజపతిరాజు (65) శనివారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆనందగజపతిరాజు విశాఖలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన విజయనగరం సంస్థానాధీశుడు పివిజి రాజు తొలి సంతానం కాగా, ప్రస్తుత కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుకు స్వయానా సోదరుడు.

03/26/2016 - 04:10

హైదరాబాద్, మార్చి 25: తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో వచ్చే ఏడాది బడ్జెట్‌లో రూ. 2450 కోట్ల నిధులు కేటాయించారు. బడ్జెట్‌లో ఘనంగా నిధులను కేటాయించి, లక్ష్యాలను కూడా అదేస్థాయిలో నిర్దేశించుకున్నా అమల్లో మాత్రం సగానికి సగం సాధించలేకపోయింది. ముఖ్యంగా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకంలో భాగంగా 5806 చెరువుల మరమ్మత్తుకు రూ.

03/26/2016 - 04:10

హైదరాబాద్, మార్చి 25: నగరంలోని ఓ హోటల్‌లో మద్యం మత్తులో వీరంగం సృష్టించి అరెస్టయిన యువ హీరో ఉదయ్‌కిరణ్‌ను జూబ్లిహిల్స్ పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. ఈ నెల 23న రాత్రి జూబ్లిహిల్స్‌లోని దస్‌పల్లా హోటల్‌లో మూన్ పబ్‌లోకి అనుమతించలేదని ఆగ్రహంతో అద్దాలు ధ్వంసం చేసి మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉదయ్‌కిరణ్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం విధితమే.

03/26/2016 - 04:09

హైదరాబాద్, మార్చి 25: తెలంగాణ ప్రభుత్వం ఈనెల నాలుగున ఐటి పాలసీని ప్రకటించనుంది. అనంతరం ఐటి శాఖ మంత్రి కెటిఆర్ పెట్టుబడులను ఆకర్షించేందుకు బ్రిటన్‌లో పర్యటిస్తారు. బ్రిటన్‌లో ఐటితో పాటు ఇతర రంగాల కంపెనీల నుంచి పెట్టుబడులు ఆహ్వానించేందుకు విదేశీ పర్యటన చేస్తున్నారు. కెటిఆర్ విదేశీ పర్యటనలో ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ కూడా ఉంటారు. ఈనెల 13నుంచి కెటిఆర్ విదేశీ పర్యటన ప్రారంభం అవుతుంది.

03/26/2016 - 03:04

తిరుపతి, మార్చి 25: తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే ప్రతి పైసా ఆదాయం భక్తుల ద్వారా వచ్చేదేనని, పాలన పారదర్శకంగా ఉండడంకోసం ఖర్చుచేసే ప్రతి పైసాపై ఆడిటింగ్ జరగాల్సి వుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. శుక్రవారం వి ఐ పి విరామ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు.

03/26/2016 - 01:49

హైదరాబాద్, మార్చి 25: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రివిలేజ్ కమిటీ మరో అవకాశం ఇచ్చి పిలిస్తే హాజరవుతానని వైకాపా ఎమ్మెల్యే ఆర్‌కె రోజా ప్రకటించారు. గత ఏడాది డిసెంబర్ 18వ తేదీన ఏపి శాసనసభలో ఆమె చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ శాసనసభ తీర్మానం మేరకు ఏడాదిపాటు సస్పెన్షన్ విధించిన విషయం విదితమే.

03/26/2016 - 01:34

హైదరాబాద్, మార్చి 25: భారీ నీటిపారుదల ప్రాజెక్టులంటే దశాబ్ధాల తరబడి సాగడం ఇప్పటివరకూ రివాజుగా మారింది. 1930ల్లో ప్రారంభించిన ప్రాజెక్టులు ఇంకా శిలాఫలకాలకే పరిమితమైతే, 1964లో ప్రారంభమైన రామడుగు ప్రాజెక్టు ఎక్కడి వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగానే ఉంది.

03/26/2016 - 01:25

హైదరాబాద్, మార్చి 25:‘్భరత్ మాతాకీ జై..’ అనే నినాదంపై వివాదం ముదురుతోంది. ఇందుకు వ్యతిరేకంగా ‘హిందుస్థాన్ జిందాబాద్’ పేరిట పాతనగరంలో బ్యానర్లు, పోస్టర్లు వెలిశాయి. పైగా మజ్లిస్ పార్టీ ముఖ్య నేతల ఫొటోలతో కూడిన ఈ పోస్టర్లను ఆ పార్టీ కార్యకర్తలు నాయకులు అంతటా అతికించారు. భారత్ మాతాకీ జై అన్న నినాదాన్ని ముస్లింలెవ్వరూ చేయరని యునైటెడ్ ముస్లిం ఫోరం తాజాగా ఓ తీర్మానం ఆమోదించింది.

03/26/2016 - 01:12

విజయవాడ, మార్చి 25: రాజధాని నిర్మాణానికి జపాన్ ఆర్కిటెక్చర్లు రూపొందించిన డిజైన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ఆమోదించారు. దీంతో రాజధాని అమరావతి నిర్మాణానికి చేపట్టిన చర్యలు తుది దశకు చేరుకున్నాయి.

Pages