S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/27/2016 - 00:31

హైదరబాద్, ఫిబ్రవరి 26: ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఇన్‌క్యాప్) మేనేజింగ్ డైరెక్టర్‌గా ప్రభుత్వం ఆర్‌కె సుమన్‌ను నియమించింది. అక్కడ పనిచేస్తున్న కె సాంబశివరావును బదిలీ చేసి ఆయనను ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. కాగా ఐదుగురు సీనియర్ ఐఏఎస్‌లకు కార్యదర్శి హోదా నుంచి ముఖ్య కార్యదర్శి హోదా కల్పించింది.

02/26/2016 - 07:31

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పాలిసెట్‌ను ఏప్రిల్ 27న నిర్వహించనున్నారు. లక్ష సీట్లున్న ఈ కోర్సులో చేరేందుకు లక్షన్నర మంది పరీక్ష రాయనున్నారు. పరీక్ష ఎలాంటి లోటుపాట్లు లేకుండా జరిగేందుకు స్పెషల్ ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించనున్నారు. మొత్తం 40 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. పదో తరగతి సిలబస్‌పై జరిగే ఈ పరీక్షను ఏప్రిల్ 27వ తేదీ ఉదయం 11 గంటల నుండి ఒంటి గంట వరకూ నిర్వహిస్తారు.

02/26/2016 - 07:24

హైదరాబాద్: తుంగభద్ర నదీ యాజమాన్యం బోర్డు సమావేశంలో రాజోలిబండ మళ్లింపు స్కీం (ఆర్‌డిఎస్)ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టాలన్న ప్రతిపాదనను తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నిర్ణయం వల్ల మహబూబ్‌నగర్ జిల్లాలో 87వేల ఎకరాల ఆయకట్టు ప్రయోజనాలు దెబ్బతింటాయని అభ్యంతరం వ్యక్తం చేసింది. గురువారం ఇక్కడ తుంగభద్ర బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజనీర్ గుప్తా అధ్యక్షత వహించారు.

02/26/2016 - 06:01

హైదరాబాద్: రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు నిరాశే మిగిలిందని ప్రతిపక్షాలు కేంద్రంపై విమర్శల దాడి చేశాయి. ఇరు రాష్ట్రాలకు భారీగా కేటాయింపులు ఉంటాయని భావిస్తే రైల్వే శాఖ పెద్ద షాకిచ్చిందని వాపోయాయి. ఈ బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి మొండి చెయ్యి చూపించారని దేవాదాయ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

02/26/2016 - 06:00

హైదరాబాద్: రైల్వే బడ్జెట్ కోసం వేయి కళ్లతో ఎదురుచూసిన ఆంధ్రప్రదేశ్‌కు నిరాశే ఎదురైంది. కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు గురువారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ఏ కీలక ప్రాజెక్టు గురించీ ప్రస్తావన లేకపోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. రాష్ట్ర ఎంపిలు బడ్జెట్ తీరుపై పెదవి విరిచారు. ప్రధానంగా అవశేష రాష్ట్రం కావడంతో కొత్త రైళ్లకు అవకాశం కల్పిస్తారని అంతా ఆశించారు.

02/26/2016 - 09:19

హైదరాబాద్: ప్రసిద్ధ సంఘ సేవిక, రాష్ట్ర రెడ్‌క్రాస్ ఉపాధ్యక్షురాలు టి ఊర్మిళారెడ్డి గురువారం ఉదయం బంజారాహిల్స్‌లోని నివాసంలో కన్నుమూశారు. ఆమె దివంగత రాజ్యసభ సభ్యుడు తిక్కవరపు చంద్రశేఖర రెడ్డి సతీమణి. ఆమె వయసు 80 సంవత్సరాలు. డక్కన్ క్రానికల్ గ్రూపు అధినేతలు టి వెంకట్రామ్‌రెడ్డి, వినాయక్ రవిరెడ్డి ఆమె కుమారులు. ఆమె భౌతిక కాయానికి గురువారం పంజాగుట్ట శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి.

02/26/2016 - 05:02

హైదరాబాద్: రైల్వే బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు రైల్వే మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు పెద్ద షాకిచ్చారు. విశాఖ, కాజిపేట రైల్వే డివిజన్ల ఏర్పాటు ప్రస్తావన, కొత్త రైళ్ల ఊసే బడ్జెట్‌లో లేకపోవడం గమనార్హం. కానీ దక్షిణ మధ్య రైల్వేకు బడ్జెట్‌లో రూ.6,412 కోట్లు కేటాయించి గత బడ్జెట్ కన్నా 145 శాతం అధికంగా ఇచ్చామని దమ రైల్వే జనరల్ మేనేజర్ గుప్తా చెప్పుకొచ్చారు.

02/25/2016 - 06:55

హైదరాబాద్: వాతావరణంలో మార్పుల వల్ల వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింటోందని, వాతావరణ మార్పులకు అడ్డుకట్టవేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని హైదరాబాద్‌లో బుధవారం ముగిసిన అంతర్జాతీయ సదస్సులో శాస్తవ్రేత్తలు అభిప్రాయపడ్డారు.

02/25/2016 - 05:14

హైదరాబాద్ : తరతరాలుగా పత్తిని నమ్ముకుని జీవిస్తున్న రైతులు ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. దేశీయ పత్తి రకాలు అనేక తెగుళ్లకు గురవుతుండటంతో వీటి స్థానంలో రోగాలు సోకవని ప్రచారం పొందిన బిటి కాటన్ రకాలను రైతులు వేస్తున్నారు. తెలంగాణ- ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా పత్తి విస్తీర్ణంలో ఇప్పటికే బిటి రకాలు 95 శాతం విస్తరించాయి.

02/24/2016 - 07:47

ఏలూరు: డిపాజిటర్లను మోసం చేశారన్న అభియోగాలను ఎదుర్కొంటూ, కోర్టు ఆదేశాల మేరకు వారం రోజులుగా సిఐడి కస్టడీలో ఉన్న అగ్రిగోల్డ్ ఛైర్మన్ అవ్వా వెంకట రామారావు, ఎండి అవ్వా వెంకట శేషు నారాయణరావు మంగళవారం తిరిగి జ్యుడీషియల్ రిమాండులోకి వెళ్లారు. సిఐడి అధికారులు మంగళవారం వారిని కోర్టుకు హాజరుపర్చారు. అనంతరం రిమాండ్‌లో భాగంగా ఏలూరులోని జిల్లా జైలుకు తరలించారు.

Pages