S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/24/2016 - 07:46

హైదరాబాద్: సొంత ఇంటి మరమ్మతులు పూర్తవడానికి మరికొంత సమయం పట్టనుండటంతో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాత్కాలికంగా మదీనాగూడ హఫీజ్‌పేటలోని సొంత ఫామ్‌హౌస్‌కు మారాలని యోచిస్తున్నట్టు తెలిసింది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 65లోని సొంత ఇంట్లోనే గత పాతికేళ్లుగా చంద్రబాబు నివాసం ఉంటున్నారు.

02/24/2016 - 07:45

హైదరాబాద్: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు ప్రింటర్లను అనుసంధానం చేసి ఓటు వేసిన ప్రతి వోటరుకు రశీదు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో నోటా ఆఫ్షన్‌ను కూడా చేర్చాలని కోరారు.

02/24/2016 - 07:38

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సగం మండలాల్లో కర వు తాండవిస్తున్నప్పటికీ, రైతులు మనోధైర్యం కోల్పోలేదు. రబీలో దాదాపు సా ధారణ విస్తీర్ణంలో పంటలు వేశారు. ఏటా రబీ సీజన్‌లో సాగయ్యే విస్తీర్ణంతోపోలిస్తే, ప్రస్తుత రబీలో సాగయిన విస్తీర్ణం ఏ మాత్రం తగ్గలేదు. రాష్ట్రంలో మొత్తం 664 మండలాలు ఉండగా వివిధ జిల్లాల్లో 359 మండలాలను కరవుపీడిత మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది.

02/24/2016 - 06:26

కడప కల్చరల్: ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ కడప పెద్దదర్గాను దర్శించుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున పెద్దదర్గాకు చేరుకున్న రెహమాన్ గురువుల మజార్ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గురువుల ఆశీస్సులు అందుకున్న అనంతరం చెన్నైకి వెనుదిరిగారు.
గోదావరిలో ఇద్దరు విద్యార్థులు గల్లంతు

02/24/2016 - 06:20

కాకినాడ: ప్రపంచీకరణ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య రంగాలలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఛార్టర్డ్ అకౌంటెంట్స్ మరింత అవగాహనతో మెలగాలని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్ కె రోశయ్య పిలుపునిచ్చారు. గ్లోబలైజేషన్‌లో డైనమిజం అవసరమని, దేశ ఆర్థిక విధానాలపై సిఎలు పూర్తి అవగాహన కలిగివుండాలన్నారు.

02/24/2016 - 06:19

గుంటూరు: రాష్ట్రప్రభుత్వం ఫైనల్ మాస్టర్‌ప్లాన్‌లో రాజధాని రైతులు కోరిన విధంగా మార్పులు, చేర్పులు చేపట్టి రూపొందించినట్లు మంత్రి నారాయణ ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం 29 గ్రామాల రైతులు ఇంటర్నెట్‌కు అతుక్కుపోయారు. సిఆర్‌డిఎ వెబ్‌సైట్‌లో మాస్టర్‌ప్లాన్ అప్‌లోడ్ చేసి ఉంటారని భావించిన రైతులు క్షుణ్ణంగా పరిశీలించారు.

02/24/2016 - 05:29

రైల్వేకోడూరు: శేషాచలం అడవుల నుంచి గత రెండు దశాబ్దాల కాలంలో కూలీలు 15 లక్షల ఎర్రచందనం వృక్షాలను నరికేసినట్లు తిరుపతి టాస్క్ఫోర్స్ డిఐజి కాంతారావు తెలిపారు. తద్వారా రూ.25 వేల కోట్ల విలువ చేసే ఎర్ర చందనాన్ని స్మగ్లర్లు తరలించుకుపోయారన్నారు.

02/24/2016 - 05:26

హైదరాబాద్: ఆరునెలల క్రితం ఉల్లిధర కిలోకు వంద రూపాయల వరకు చేరుకోగా, ఇప్పుడు మూడునుంచి పది రూపాయలు పలుకుతోంది. ఊహించని ఈ పరిణామానికి రైతులు లబోదిబో మంటున్నారు. గత సీజన్‌లో ఉల్లిధర ఆకాశాన్ని అంటినప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని పాలకులు చురుగ్గా స్పందించారు. రైతు బజార్లలో ఇతర ప్రాంతాల్లో సబ్సిడీ ధరకు ఉల్లిని అమ్మించారు. అదే సమయంలో ఉల్లి సాగును ప్రోత్సహించేందుకు సబ్సిడీతో రైతులకు విత్తనాలు అందజేశారు.

02/24/2016 - 05:22

విజయవాడ: రాష్ట్రంలో పర్యాటక రంగం అన్ని విధాలుగా అభివృద్ధి చెందేందుకు ఎన్నో అవకాశాలున్నాయని రెండు రోజుల కలెక్టర్ల సమావేశం ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ రంగాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోగలిగితే తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఇందుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై అధికారులకు మార్గ నిర్దేశం చేశారు.

02/23/2016 - 08:48

విజయవాడ, ఫిబ్రవరి 22: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో ప్రధానంగా రెవెన్యూ పరిపాలనలో సంస్కరణలు తెచ్చామని ఏపి రెవెన్యూ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి చెప్పారు. ఇందులో ప్రధానంగా రెవెన్యూ రికార్డులను కొత్త పంథాలో నిర్వహించటం, కాలంచెల్లిన చట్టాలు, నిబంధనలను తొలగించి విధానాలు సరళీకరించామన్నారు.

Pages