S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/22/2016 - 01:40

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో అంతర్జాతీయ విమానాశ్రయంగా గన్నవరం విమానాశ్రయాన్ని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. గన్నవరం విమానాశ్రయ విస్తరణ చేపట్టేందుకు గత కొనే్నళ్ల నుంచి జరుగుతున్న ప్రయత్నాలకు ఇప్పుడు ముందడుగు పడింది. విమానాశ్రయం విస్తరణకు 1,229.94 ఎకరాల భూమిని సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం భూ సమీకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది.

02/22/2016 - 01:39

హైదరాబాద్: విద్యుత్ ఆదాకు ఎల్‌ఇడి బల్బులు వినియోగిస్తే సాలీనా ప్రతి వినియోగదారుడిపై విద్యుత్ భారం రూ.250 నుంచి రూ.550 వరకు తగ్గుతుందని సిఎం చంద్రబాబు అన్నారు. విద్యుత్ ఆదాపై ప్రజల్లో పెద్దఎత్తున చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆదివారం విద్యుత్ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు.

02/21/2016 - 09:09

హైదరాబాద్, ఫిబ్రవరి 20: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విలన్‌గా, కమెడియన్‌గా తనకంటూ ఓ మార్క్ వేసుకున్న ప్రదీప్ శక్తి కన్నుమూశారు. కొంతకాలంగా అమెరికాలో స్థిరపడిన ఈయన, శనివారం తీవ్ర గుండెపోటుకు గురై మరణించారు. తెలుగులో చేసినవి కొద్ది సినిమాలే అయినా, ఆయన చేసిన పాత్రలన్నింటిపైనా ప్రత్యే క మార్క్ వేయగలిగారు.

02/21/2016 - 08:44

హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో గత నెల 17న రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యపై కేంద్రప్రభుత్వం నియమించిన జస్టిస్ అశోక్‌కుమార్ రూపన్‌వాల్ ఏకసభ్య కమిషన్ తన ప్రాథమిక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేసినట్టు తెలిసింది. ఈ నివేదికలో కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీలకు క్లీన్‌చిట్ ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

02/21/2016 - 08:42

విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయానికి (ఎయు) నాక్ ‘ఎ’ గ్రేడ్ దక్కిందని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. శనివారం సాయంత్రం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోని విశ్వవిద్యాలయాల్లో ఎయు నాలుగో స్థానంలో నిలిచిందన్నారు. దేశంలో 480 విశ్వవిద్యాలయాలు ఉండగా వాటిలో నాలుగో స్థానం దక్కడం అభినందనీయమన్నారు.

02/21/2016 - 08:40

తిరుపతి: రాష్ట్ర విభజన సందర్భంగా రాయలసీమకు కేంద్రం ఇచ్చిన హామీల అమలుకు ఢిల్లీస్థాయిలో పోరాటం చేస్తామని సిపిఎం జాతీయనాయకులు ప్రకాశ్ కారత్ అన్నారు. నిత్యం కరువుతో అల్లాడుతున్న సీమకు కేంద్రం ప్రకటించాల్సిన సాయం వెయ్యి కోట్లు ఇచ్చినా చాలదన్నారు. సిపిఎం, సిపిఐ రాష్ట్ర కమిటీలు సంయుక్తంగా సీమ వాసులకు భరోసా నింపుతూ బస్సు యాత్రను చేపట్టడాన్ని అభినందించారు.

02/20/2016 - 03:23

హైదరాబాద్, ఫిబ్రవరి 19: ‘కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం అంకిత భావంతో పనిచేయని నాయకులకు ఇక ఆ పదవులు ఊడినట్లే. పార్టీ పటిష్టత కోసం ఉత్తమ్‌కుమార్ రెడ్డి చర్యలు చేపట్టారు. గురువారం నగరానికి వచ్చిన ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్ సింగ్ గాంధీ భవన్‌లో టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డితో ఇతర ముఖ్య నాయకులతో మంతనాలు జరిపిన సంగతి తెలిసిందే.

02/20/2016 - 03:23

హైదరాబాద్, ఫిబ్రవరి 19: తెలంగాణ ప్రాజెక్టులకు ఆంధ్ర కాంట్రాక్టర్లతో పనులు చేయిస్తున్నారని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. పైగా అంచనాలు పెంచుకుంటూ కమీషన్లు దండుకుంటున్నారని ఆయన శుక్రవారం పార్టీ నాయకుడు ఎం. కోదండరెడ్డితో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ విమర్శించారు.

02/20/2016 - 03:22

హైదరాబాద్, ఫిబ్రవరి 19: తెలంగాణలో సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకానికి రంగారెడ్డిజిల్లాలో భారీ స్పందన లభిస్తోంది. గ్రేటర్ ఎన్నికల ముందు ఈ పథకంద్వారా సుమారు ఏడున్నరవేల మంది దరఖాస్తు చేసుకోగా ఎన్నికల తర్వాత సుమారు 62వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం నుంచి రోజురోజుకు దరఖాస్తుదారుల సంఖ్య భారీగా పెరుగుతోంది.

02/20/2016 - 03:21

హైదరాబాద్, ఫిబ్రవరి 19: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి నియోజకవర్గాల వారీగా టెండర్లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంలో శుక్రవారం మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై సమీక్షించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు వారి రిజర్వేషన్ల ప్రకారం ఇళ్లను కేటాయించాలని మంత్రులు నిర్ణయించారు.

Pages