S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/20/2016 - 03:21

హైదరాబాద్, ఫిబ్రవరి 19: గృహ నిర్మాణ శాఖ డైరెక్టర్ దానకిశోర్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దానకిశోర్‌ను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమీషనర్ అండ్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు.

02/20/2016 - 03:20

హైదరాబాద్, ఫిబ్రవరి 19: జెఎన్‌యు, పటియాల హౌస్ కోర్టు వద్ద జరిగిన న్యాయవాదుల ఘర్షణలు, అరెస్టులకు నిరసనగా శుక్రవారం రాష్ట్ర హైకోర్టు వద్ద ఇరు వర్గాలుగా విడిపోయిన న్యాయవాదులు వాగ్వాదానికి దిగారు.

02/20/2016 - 03:17

హైదరాబాద్, ఫిబ్రవరి 19: గవర్నర్ నరసింహన్ శుక్రవారం అకస్మాత్తుగా గాంధీ ఆస్పత్రిని తనిఖీ చేశారు. బెడ్స్‌లేక నేలపైనే పడుకుని ఉన్న రోగుల్ని, దుర్గంధం వెదజల్లుతున్న బాత్‌రూమ్‌లను చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలోని ఓపి, క్యాజువాలిటీతోపాటు, రెండు, మూడు ఫ్లోర్‌లలోని మెడికల్ వార్డులను సందర్శించారు. గవర్నర్‌ను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్. వెంకటేశ్వర్‌రెడ్డి, ఆర్‌ఎంఓలు అనుసరించారు.

02/20/2016 - 03:17

హైదరాబాద్, ఫిబ్రవరి 19: రాష్ట్ర విభజన అనంతరం ఖమ్మం జిల్లా నుంచి ఏపిలో కలిసిన నాలుగు మండల ప్రజాపరిషత్‌లను పునర్‌వ్యవస్థీకరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీచేసింది. గతంలో జారీచేసిన ఉత్తర్వుల మేరకు నాలుగు మండలాలను తూర్పుగోదావరి జిల్లాలో కలిపిన సంగతి తెలిసిందే. వీటన్నింటిని కలిపి తూర్పుగోదావరి జిల్లాలో ఏటపాక రెవెన్యూ డివిజన్‌ను ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది.

02/20/2016 - 03:17

హైదరాబాద్, ఫిబ్రవరి 19: ఆంధ్రప్రదేశ్‌లో దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న 10 దేవాలయాలను తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

02/20/2016 - 03:16

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: జూన్ 21వ తేదీన జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈసారి మరింత వైభవంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల్ని, ముఖ్యంగా విద్యార్థులను యోగావైపు ఆకర్షించే రీతిలో ఆసనాలతో పాటు ఇతర కార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.

02/20/2016 - 03:16

హైదరాబాద్, ఫిబ్రవరి 19: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో శుక్రవారం నాడు స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. ఎల్ బ్లాక్ రెండో అంతస్తులో షార్టుసర్క్యూట్ జరగడంతో ఈ ప్రమాదం జరిగింది. మొదట దట్టమైన నల్లటి పొగలు చుట్టుముట్టి మంటలు రేగాయి. అయితే సకాలంలో సిబ్బంది స్పందించి మంటలు ఆర్పివేశారు. శుక్రవారం మధ్యాహ్నం అదే బ్లాక్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో దేవుడి పటాల వద్ద కాగితాలకు దీపం అంటుకుని మంటలు చెలరేగాయి.

02/20/2016 - 03:14

హైదరాబాద్, ఫిబ్రవరి 19: ఒడిశాలో నక్కిన నలుగురు కరడు గట్టిన సిమి ఉగ్రవాదులను తెలంగాణ పోలీసులు సాహసంతో పట్టుకుంటే, వారిని విచారించేందుకు దేశంలోని అరడజను రాష్ట్రాల పోలీసులు క్యూ కట్టారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్నాటక, తమిళనాడు పోలీసులు ఒడిశాకు వెళ్లి తమకు ఇంటరాగేషన్ నిమిత్తం అప్పగించాలని కోర్టును ఆశ్రయిస్తున్నారు.

02/20/2016 - 02:25

విజయవాడ, ఫిబ్రవరి 19: భారతదేశంలో వున్నంత సహనం, స్వేచ్ఛ ప్రపంచంలో ఎక్కడా కనిపించదని అయితే ఈ విషయంపై కొన్ని శక్తులు రాద్దాంతం చేస్తున్నాయంటూ కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు నిప్పులు చెరిగారు. అసలు సహనం, స్వేచ్ఛ లేదని ప్రపంచ దేశాల్లో ఎవరికైనా చెప్పేందుకు ధైర్యం, దమ్ము వుందా అని ప్రశ్నించారు.

02/20/2016 - 01:33

హైదరాబాద్, ఫిబ్రవరి 19: కర్నాటక, మహారాష్టల్ల్రో మాదిరిగా వంతెనలు చెక్ డ్యామ్‌లు కలిపి నిర్మించాలని, ఆ మేరకు రీడిజైన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల వర్షపునీటిని నిల్వ చేసుకునే అవకాశం మెరుగవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రీ డిజైన్ పూర్తయిన వంతనెల పనులు వెంటనే ప్రారంభించాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.

Pages