S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/20/2016 - 00:54

హైదరాబాద్, ఫిబ్రవరి 19: భారతదేశంలో ఉత్తమ పరిశోధనా విశ్వవిద్యాలయంగా పేరొందిన అమృత యూనివర్శిటీ తన క్యాంపస్‌ను అమరావతిలో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. మూడు దక్షిణాది రాష్ట్రాల్లో ఐదు క్యాంపస్‌లను కలిగి ఉన్న అమృత విశ్వవిద్యాలయం దాదాపు 2500 కోట్ల వ్యయంతో ఈ క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. దీంతో పాటు ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని కూడా ఏర్పాటు చేస్తారు. 2250 పడకలతో మెగా ఆస్పత్రిగా ఇది పనిచేయనుంది.

02/20/2016 - 00:53

విశాఖపట్నం, ఫిబ్రవరి 19: ఇసుకను తక్కువ ధరకు వినియోగదారులకు అందించాలని ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలేవీ సఫలం కావడం లేదు. ఇసుక విధానాన్ని పదే పదే మార్చి చూసినా ఫలితం కనిపించడం లేదు. ఇసుక మాఫియా ఆగడాలను అరికట్టడానికి ప్రభుత్వం గత ఏడాది ఇసుక పాలసీని ప్రకటించిన సంగతి తెలిసిందే. డ్వాక్రా మహిళల ద్వారా ఇసుకను విక్రయించింది. దీంట్లో చాలా అక్రమాలు చోటు చేసుకున్నాయి. లెక్కా, జమా లేకుండా ఇసుకను తరలించారు.

02/20/2016 - 01:07

హైదరాబాద్/కర్నూలు, ఫిబ్రవరి 19: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కర్నూలు జిల్లాకు చెందిన కొందరు వైకాపా ఎమ్మెల్యేలు టిడిపిలో చేరబోతున్నారన్న ప్రచారం రాజకీయవర్గాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ టిడిపిలో చేరడానికి రంగం సిద్ధమైందంటూ శుక్రవారం ప్రచారం భారీయెత్తున సాగింది.

02/20/2016 - 00:51

విజయవాడ, ఫిబ్రవరి 19: ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. పెనమలూరు మండలం తాడిగడపలో శుక్రవారం ఎల్‌వి ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌లో తేజ్‌కోహ్లి ఐ బ్యాంక్‌ను ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు, అకాడమీ ఆఫ్ ఐ కేర్ ఎడ్యుకేషన్ సెంటర్‌ను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు.

02/20/2016 - 00:50

హైదరాబాద్, ఫిబ్రవరి 19: అగ్రిగోల్డ్ కేసులో ఏపి సిఐడి పోలీసుల పనితీరును హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. నిందితులను అరెస్టు చేయడంలో పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరించారని వ్యాఖ్యానించింది. నిందితుల బ్యాంకు ఖాతాలనుంచి డబ్బు వేరే ఖాతాలకు మళ్లిపోయినా గుర్తించలేకపోయారంటూ పోలీసుల తీరును తప్పుపట్టింది. పోలీసుల ధోరణి మారకపోతే దర్యాప్తు అధికారిని జైలుకు పంపించాల్సి వస్తుందని హెచ్చరించింది.

02/19/2016 - 08:19

హైదరాబాద్: కాపుసామాజికవర్గానికి రిజర్వేషన్లను కల్పించే విషయమై జస్టిస్ మంజునాథ కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియచేసింద. కాపు రిజర్వేషన్ల పోరాట సమితికి చెందిన చైర్మన్ డాక్టర్ కెవికె రావుతదితరులు కాపులకు రిజర్వేషన్లను కల్పించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు గురువారం విచారించింది.

02/19/2016 - 08:18

హైదరాబాద్: సీతారామ ఎత్తిపోతల పథకంగా ఇటీవల నామకరణం చేసిన ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం (రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్) నిర్మాణానికి రూ.7926.147 కోట్లతో పరిపాలనపరమైన అనుమతిని తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది. సమీకృత ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని వేగంగా చేపట్టి జిల్లాలో 5 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అనుమతి మంజూరు చేసింది.

02/19/2016 - 08:18

హైదరాబాద్: నవ్యాంధ్ర రాజధాని అమరావతి బృహత్ ప్రణాళికకు తుది రూపాన్నిచ్చేందుకు అటు సింగపూర్ బృందం ఇటు సిఆర్‌డిఎ సిబ్బంది విస్తృత కసరత్తు చేస్తున్నారు. బృహత్ ప్రణాళిక నమూనాను ప్రకటించిన ప్రభుత్వం దానిపై ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరించింది. ప్రజల నుండి వచ్చిన అభ్యంతరాలు, సూచనలను క్రోడీకరించిన అధికారులు తదనుగుణంగా బృహత్ ప్రణాళికలో మార్పులు చేస్తున్నారు.

02/19/2016 - 08:17

హైదరాబాద్: పంట రుణాల మాఫీ మూడవ వాయిదా చెల్లించడానికి బడ్జెట్‌లో రూ. 4 వేల కోట్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మొత్తానికి అదనంగా సుమారు మరో నాలుగు వేల కోట్లు కేటాయిస్తే రాష్ట్రంలో పంట రుణాలన్ని మాఫీ అయిపోతాయి. అయితే ఒకే దఫా పంట రుణాలను మాఫీ చేయాలంటే బడ్జెట్‌లో సుమారు రూ. 8 వేల కోట్లు కేటాయించాల్సి ఉంటుంది.

02/19/2016 - 08:16

హైదరాబాద్: తెలంగాణ సహా మూడు రాష్ట్రాల్లో కార్యకలాపాలు విస్తరింప చేయాలని ‘సిమి’ భావిస్తోందా? అంటే ఔననే అంటున్నారు పోలీసులు. ఒడిశా రాష్ట్రంలోని రుర్కెలాలో తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్న నలుగురు ఉగ్రవాదులు అదేపనిలో ఉండగా పట్టుబడటంతో తెలంగాణ పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది.

Pages