S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/15/2016 - 01:11

మోతె, ఫిబ్రవరి 14: వర్ధమాన సినీనటి ప్రణీతకు తృటిలో ప్రాణపాయం తప్పింది. నల్లగొండ జిల్లా మోతె మండల కేంద్రం శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె స్వల్ప గాయాలతో బయటపడింది. ప్రమాదానికి సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

02/15/2016 - 01:11

హైదరాబాద్, ఫిబ్రవరి 14: సియాచిన్ ప్రమాదంలో అమరుడైన వీర సైనికుడు ముస్తాఖ్ అహ్మద్ భౌతిక కాయం సోమవారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి రానుంది. ప్రత్యేక విమానంలో ముస్తాఖ్ భౌతికకాయాన్ని ఆర్మీ అధికారులు తీసుకురానున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు బేగంపేట విమానాశ్రయం వద్ద అమరుడు మస్తాఖ్ భౌతిక కాయానికి పలువురు అధికారులు నివాళులర్పిస్తారు.

02/15/2016 - 01:10

హైదరాబాద్, ఫిబ్రవరి 14: సైబరాబాద్ కమిషనరేట్‌లో జనానాభాకు అనుగుణంగా పోలీసు సిబ్బంది లేదని, శాంతి భద్రతల దృష్ట్యా కమిషనరేట్ పరిధిలోని ఐదు టాస్క్ఫోర్స్ టీమ్‌లను ఎత్తివేసినట్టు సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ వెల్లడించారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ సైబరాబాద్ పరిధి 65 లక్షల జనాభాతో 3700 స్కేర్ కి.మీటర్లుగా విస్తరించిందన్నారు. ఐటి కారిడార్ ఉన్నందున భద్రతా సిబ్బంది పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

02/15/2016 - 01:10

వరంగల్, ఫిబ్రవరి 14: కోట్లాది మంది భక్తజనం ఎదురుచూస్తున్న ఉద్విగ్న క్షణాలు మరో రెండురోజుల్లో జరుగనున్నాయి...సమ్మక్క తల్లి దండాలో..సారలమ్మ తల్లి దండాలో అంటూ శివసత్తుల పూనకాలతో..జంపన్నవాగు భక్తజనంతో పులకరించేలా..మేడారం జాతర సాగుతోంది. మేడారం గుడారంలా మారనుంది. ఆదివారం నుండే భక్తులు మేడారం బాటపట్టారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు కూడా ప్రారంభమయ్యాయి. ప్రత్యేక బస్టాండ్‌లో భక్తులు క్యూలు కడుతున్నారు.

02/15/2016 - 01:09

వరంగల్, ఫిబ్రవరి 14: ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన మహాజాతరను విజయవంతం చేయడంలో సవాల్‌గా తీసుకోవాలని డిజిపి అనురాగ్‌శర్మ పోలీసు అధికారులను ఆదేశించారు. ఆదివారం ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడారంనకు చేరుకున్న ఆయన భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు.

02/15/2016 - 01:09

గోవిందరావుపేట, ఫిబ్రవరి 14: వరంగల్ జిల్లాలో మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లుల రాకకు ముందు నుండి భక్తులు భారీగా మేడారం తరలివస్తుండగా ఆదివారం ఈ సంఖ్య మరింత భారీగా పెరిగింది. ఆదివారం సుమారు అయిదు లక్షల మంది భక్తులు మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకున్నట్టు సమాచారం. వేలాది ప్రయివేటు వాహానాలతో పాటు ఆర్టీసీ బస్సులలో భక్తులు ఆదివారం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

02/15/2016 - 01:05

కాకినాడ, ఫిబ్రవరి 14: కాపుల ఐక్య గర్జన అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా రాజకీయాలను టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నిశితంగా గమనిస్తున్నట్టు తెలుస్తోంది. తూర్పు సెంటిమెంట్‌ను బాగా విశ్వసించే చంద్రబాబు ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్‌లో తెలుగుదేశానికి లాభిస్తుందో ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

02/15/2016 - 01:05

కుప్పం, ఫిబ్రవరి 14: దేశ సేవలో పాలుపంచుకుంటూ స్వగ్రామానికి వచ్చిన తన భర్తను అక్రమంగా పోలీసులు నిర్బంధించారని ఓ జవాన్ భార్య కుప్పం పోలీస్‌స్టేషన్ ఎదుట చంటిబిడ్డతో బైఠాయించిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణానికి చెందిన నారాయణ, కుప్పం మండలం గుత్తాలపల్లెకు చెందిన హైమావతికి ఐదేళ్ల క్రితం వివాహమైంది.

02/15/2016 - 01:04

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 14: రాష్ట్ర విభజన అనంతరం తొలిసారి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ముఖ్యఅతిథిగా పాల్గొనే భారీ బహిరంగ సభను మార్చి 6న నిర్వహించాలని నిర్ణయించినట్టు బిజెపి ఆంధ్రప్రదేశ్ ఇన్‌చార్జి సిద్ధార్థనాథ్‌సింగ్ చెప్పారు.

02/15/2016 - 01:04

శ్రీకాకుళం, ఫిబ్రవరి 14: ఆరోగ్య ప్రదాత ఆదిత్యుడని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామిని సతీసమేతంగా ఆదివారం సాయంత్రం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులకు ఆలయ ప్రధానార్చకుడు ఇప్పిలి శంకరశర్మ ఆలయ మర్యాదలతో, పూర్ణకలశంతో స్వాగతం పలికారు.

Pages